లక్కీ హీరోయిన్ | Trisha Got Lucky chance with Balayya | Sakshi
Sakshi News home page

లక్కీ హీరోయిన్

Aug 10 2014 12:11 AM | Updated on Sep 2 2017 11:38 AM

లక్కీ హీరోయిన్

లక్కీ హీరోయిన్

నటి త్రిష లక్కీ హీరోయిన్. ఈమెకు మూడు పదుల వయసు మీద పడినా, నటిగా దశాబ్దం దాటినా నేటి కీ హీరోయిన్‌గా ఒక బలమైన స్థానంలో కొనసాగుతుండడం విశేషమే.

నటి త్రిష లక్కీ హీరోయిన్. ఈమెకు మూడు పదుల వయసు మీద పడినా, నటిగా దశాబ్దం దాటినా నేటి కీ హీరోయిన్‌గా ఒక బలమైన స్థానంలో కొనసాగుతుండడం విశేషమే. కొత్తనీరు రాక, పాత నీరు పోక సర్వసాధారణం అంటారు. అయితే ఎందరో యువ నటీమణులు కొత్త కొత్త అందాలతో విజృంభిస్తున్నా వారికి దీటుగా త్రిష తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అంతేకాదు నటిగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. తమిళం, తెలుగు భాషల్లో నేటికీ ఒక చిత్రం తరువాత మరొక చిత్రం చేస్తూ గ్యాప్ అనే పదానికి తావు లేకుండా హీరోయిన్‌గా తన పయనాన్ని అప్రతిహతంగా సాగిస్తున్నారు.
 
 మరో విశేషం ఏమిటంటే తాజాగా శాండిల్‌వుడ్‌లో రంగ ప్రవేశం చేశారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో అజిత్ లాంటి స్టార్ హీరో సరసన టాలీవుడ్‌లో లెజెండ్ నటుడు బాలకృష్ణకు జంటగా రొమాన్స్ చేస్తున్న త్రిష శాండిల్‌వుడ్‌లో టాప్ హీరో పునీత్ రాజ్‌కుమార్‌తో నటిస్తున్నారు. ఈ లక్కీ హీరోయిన్ మాట్లాడుతూ నటిగా పదేళ్లు దాటినా ఇటు టాప్‌స్టార్స్‌తోను, అటు యువ హీరోల సరసన నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. కన్నడ చిత్ర రంగ ప్రవేశం గురించి ప్రస్తావిస్తూ ఇన్నేళ్ల తరువాత కన్నడ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. అది పునీత్ రాజ్‌కుమార్ సరసన నటించడం మరింత ఆనందంగా ఉందన్నారు.
 
 ఆయనకు జంటగా పవర్ చిత్రంలో నటిస్తున్నానని ఈ చిత్రం శాండిల్ వుడ్‌లో మంచి ఎంట్రీనిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పవర్ చిత్ర షూటింగ్‌లో పునీత్ రాజ్‌కుమార్ సహకారం మరువలేనన్నారు. ఇంతకుముందు కన్నడ చిత్రాల్లో ఎందుకు నటించలేదని అడుగుతున్నారని అయితే అలాంటి మంచి అవకాశం ఇప్పుడే వచ్చిందని వివరించారు. సాధారణంగా చిత్ర పరిశ్రమలో పురుషాధిక్యం ఉంటుందని అయినా తానింతకాలం హీరోయిన్‌గా రాణిస్తుండడం తన అదృష్టం అని త్రిష పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement