మరోసారి విక్రమ్‌తో.. | trisha romance with Vikram | Sakshi
Sakshi News home page

మరోసారి విక్రమ్‌తో..

Published Sun, Aug 28 2016 2:11 AM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

మరోసారి విక్రమ్‌తో..

మరోసారి విక్రమ్‌తో..

విక్రమ్, త్రిషలది సూపర్‌హిట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. సామి చిత్రం వీరిద్దరితో పాటు దర్శకుడు హరి కెరీర్‌లోనూ చాలా కీలకమైనది. విక్రంను కమర్షియల్ హీరోగా స్థాయిని పెంచిన చిత్రం సామి. ఇక త్రిషకు తొలి సూపర్‌హిట్ చిత్రం ఇదే. ఈ చిత్రం బాలకృష్ణ హీరోగా లక్ష్మీనరసింహ పేరుతో రూపొంది మంచి విజయాన్ని సాధించింది.
 
  2002లో తెరపైకి వచ్చిన సామి చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్లు ఆ చిత్ర దర్శకుడు హరి ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా చిత్రానికి ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలవుతున్నాయని సమాచారం. ప్రస్తుతం హరి నటుడు సూర్య కథానాయకుడిగా ఎస్-3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావొచ్చింది. దీంతో హరి విక్రమ్‌తో సామి-2 చిత్రానికి సిద్ధమవుతున్నారు. కాగా సామి చిత్రంలో నటించిన త్రిషనే సీక్వెల్‌లోనూ నటించనున్నట్లు దర్శకుడి వర్గం తెలిపారు.
 
 అయితే ఆమె ఇందులో హీరోయిన్‌గా నటిస్తారా? లేక వేరే ముఖ్య పాత్రలో కనిపించనున్నారా? అన్నది సస్పెన్స్ అని అంటున్నారు. ఇందులో ఒక అగ్రనటి హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. అయితే నటి నయనతార సామి-2లో నాయకిగా నటించే అవకాశం ఉన్నట్లు ఇంతకు ముందే ప్రచారం జరిగింది. విక్రమ్‌తో ఇరుముగన్ చిత్రంలో నటిస్తున్న నయనతార వెంటనే మళ్లీ ఆయనతో జత కట్టడానికి రెడీ అవుతారా? అన్నది చర్చనీయాంశమైన విషయం. సామి-2 చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడే వరకూ ఇలాంటి ఊహాగానాలు ప్రసారం అవుతూనే ఉంటాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement