96కి సిద్ధమవుతున్న త్రిష | Vijay Sethupathi and Trisha's New Movie 96 First Look | Sakshi
Sakshi News home page

96కి సిద్ధమవుతున్న త్రిష

Published Tue, May 16 2017 3:30 AM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM

96కి సిద్ధమవుతున్న త్రిష

96కి సిద్ధమవుతున్న త్రిష

చెన్నై చిన్నది త్రిష త్వరలో విజయ్‌సేతుపతితో 96కి సిద్ధం అవుతున్నారు. మోహిని, చదరంగవేటై్ట 2 చిత్రాలను పూర్తి చేసి వేసవి విడుపుకు అమెరికా చెక్కేసిన ఈ అమ్మడు తాజా చిత్రానికి రెడీ అవుతున్నారు. వరుస విజయాలతో మంచి జోరులో ఉన్న నటుడు విజయ్‌సేతుపతితో రొమాన్స్‌ చేయనున్నారు. వీరి చిత్రానికి 96 అనే ఆసక్తికరమైన టైటిల్‌ ఖరారు చేశారు.

ఇంతకు ముందు జయంరవి, హన్సిక నటించిన రోమియో జూలియట్, విశాల్, తమన్నా జంటగా నటించిన కత్తిసండై, విక్రమ్‌ప్రభు హీరోగా వీరశివాజీ వంటి చిత్రాలను నిర్మించిన మెడ్రాస్‌ ఎంటర్‌ ప్రైజస్‌ అధినేత ఎస్‌.నందగోపాల్‌ ప్రస్తుతం విశాల్‌ కథానాయకుడిగా మిష్కిన్‌ దర్శకత్వంలో తుప్పరివాలన్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం పూర్తి కావస్తున్న దశలో తాజాగా విజయ్‌సేతుపతి, త్రిష హీరోహీరోయిన్లుగా 96 చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రం ద్వారా ప్రేమ్‌కుమార్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన పసంగ, నడువుల కొంచెం పక్కత్తుకానోమ్, సుందరపాండియన్‌ తదితర చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పని చేశారన్నది గమనార్హం. ఈ 96 చిత్రం ద్వారా దర్శకుడిగా మెగాఫోన్‌ పట్టనున్నారు. చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది విభిన్న కథాంశంతో కూడిన ప్యూర్‌ లవ్‌ స్టోరీగా ఉంటుందన్నారు. ఇతర తారాగణం, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందనీ, చిత్రం త్వరలో కుంభకోణంలో ప్రారంభం కానుం దని వెల్లడించారు. దీనికి షణ్ముగసుం దరం ఛాయాగ్రహణను, గోవిందమోహన్‌ అందించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement