తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ ప్రారంభమైనప్పటి నుంచి వందశాతం ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుంది. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలను విడుదల చేస్తూ ప్రేక్షకులకు వినోదం పంచుతుంది. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం కల్ట్ మూవీని తెలుగు వెర్షన్‌లో విడుదల చేసింది. నేడు(ఫిబ్రవరి 18) ఉదయం నుంచి ‘96’ మూవీ ఆహా స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ చిత్రమైన ‘96’ను తెలుగులో అనువదించి మన తెలుగు ప్రేక్షకులకు అందించింది ఆహా. దీంతో తెలుగు ప్రేక్షకులు ఆహాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
చదవండి: నష్టాల్లో రామ్ చరణ్ బిజినెస్, నిలిచిపోయిన సేవలు
తమిళ సినిమా అయిన 96 అక్కడ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష , తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరో హీరోయిన్స్‌గా నటించారు. అద్భుతమైన విజయంతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఆహా స్ట్రీమింగ్ అవుతున్న కొత్త సినిమాల జాబితాకు వస్తే.. ‘అర్జున ఫల్గుణ, హే జూడ్, ది అమెరికన్ డ్రీమ్, లక్ష్య, సేనాపతి, త్రీ రోజెస్, లాభం, మంచి రోజులొచ్చాయి, రొమాంటిక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, అనుభవించు రాజా, సర్కార్, ఛెఫ్ మంత్ర, అల్లుడుగారు’ వంటి తదితర చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.
చదవండి: సన్నీ లియోన్ పేరుపై గుర్తు తెలియని వ్యక్తికి రుణం.. ఐవీఎల్ సెక్యూరిటీపై నటి ఫైర్..
Admin mowa is busy watching #96OnAHA right now..
— ahavideoIN (@ahavideoIN) February 17, 2022
So no description, just enjoy the film🙈
▶️https://t.co/1sLuRNN55l@VijaySethuOffl @trishtrashers #PremKumar #govindvasantha @Gourayy @VarshaBollamma @AadhityaBaaskar pic.twitter.com/ySnGtPqOAV
Comments
Please login to add a commentAdd a comment