సూపర్‌స్టార్ టైటిల్‌లో చెన్నై చిన్నది | Rajinikanth to Romance Trisha | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్ టైటిల్‌లో చెన్నై చిన్నది

Published Sun, Oct 16 2016 2:17 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

సూపర్‌స్టార్ టైటిల్‌లో చెన్నై చిన్నది

సూపర్‌స్టార్ టైటిల్‌లో చెన్నై చిన్నది

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో రొమాన్స్ చేసే అవకాశం చెన్నై చిన్నది త్రిషకు ఇంత వరకూ రాలేదు. అలాంటి అవ కాశం వస్తుందని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా రజనీకాంత్ చిత్ర టైటిల్‌తో నటించే అవకాశం వ రించినట్లు తాజా సమాచారం. త్రిషను ఇప్పుడు స్టార్ హీరోలకు జంటగా నటించే అవకాశాల కంటే హీరోయిన్ ఓరియెంటెడ్ కథా పాత్రలే అధికంగా తలుపు తడుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం హీరోయిన్‌కు ప్రాముఖ్యత ఉన్న మోహిని అనే హారర్ కథా చిత్రంలో నటిస్తున్న త్రిష త్వరలో అరవిందస్వామికి జంటగా చదరంగవేట్టై-2లో నటించడానికి సిద్ధమవుతున్నారు.
 
  కాగా హిందీలో సంచలన విజయం సాధించిన క్వీన్ చిత్ర రీమేక్‌లోనూ నటి రేవతి దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో బాలీవుడ్ సంచలన చిత్రం ఎన్‌హెచ్10 తమిళ రీమేక్‌లో నటించే అవకాశం త్రిషనే వరించినట్లు సమాచారం. హిందీలో నవదీప్‌సింగ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంలో అనుష్కశర్మ నాయకిగా నటించారు. ఆ చిత్రం ఇప్పుడు తమిళం, తెలుగు భాషల్లో రీమేక్ కానుంది. ఇందులో నటి త్రిషను నాయకిగా నటింపజేసే ప్రయత్నాలు  జరుగుతున్నాయి.దీని గురించి త్రిష కూడా పాజిటివ్‌గానే స్పందించడం గమనార్హం.
 
 తనను బాగా ఆకట్టుకున్న చిత్రం ఎన్‌హెచ్ 10  అని, ఈ హిందీ రీమేక్‌లో నటిస్తారా? అని తనను అడిగారని, తానూ అందుకు సమ్మతించినట్లు తెలిపారు.అయితే ఈ విషయం ఇంకా చర్చల్లోనే ఉందని,తానింకా ఒప్పంద పత్రాలపై సంతకం చేయలేదని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచీ కాశ్మీర్ సరిహద్దుల వరకూ సాగే జాతీయ రహదారిని ఎన్‌హెచ్ 10 అంటారు. ఈ రోడ్డు పయనంలో జరిగే యాక్షన్ థ్రిల్లర్ క థే ఎన్‌హెచ్ 10 చిత్ర సింగిల్ లైన్ కథ. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి గర్జనై అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం.ఇదే టైటిల్‌తో ఇంతకు ముందు సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం వచ్చిందన్నది గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement