నాని సూపర్...! | Janda Pai Kapiraju Released On August 8 | Sakshi
Sakshi News home page

నాని సూపర్...!

Published Tue, Jul 22 2014 10:52 PM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM

నాని సూపర్...!

నాని సూపర్...!

 ప్రతి వ్యక్తి తనను తాను సంస్కరించుకుంటే, దేశాన్ని సంస్కరించుకున్నట్టే. ఈ నేపథ్యంలో ‘జెండాపై కపిరాజు’ చిత్రం రూపొందింది. నాని తొలిసారి ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. సముద్ర ఖని దర్శకుడు. మల్టీ డైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లి. పతాకంపై రజిత్ పార్థసారథి నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ ‘శంభో శివ శంభో’ లాంటి సినిమాలు చేసిన సముద్రఖని చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
 
 యువతకు నచ్చే అన్ని అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. నాని పాత్రల చిత్రణ సూపర్‌గా ఉంటుంది. ప్రముఖ నటుడు శరత్‌కుమార్ పోషించిన పాత్ర ఈ చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అని చెప్పారు. అమలాపాల్, రాగిణి ద్వివేది నాయికలుగా నటించిన ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: సుకుమార్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement