
మరో విభిన్న పాత్రలో!
సూర్య, అమలాపాల్ ముఖ్యపాత్రల్లో తమిళంలో పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పసంగ-2’. ఈ చిత్రాన్ని ‘మేము’ పేరుతో సాయి మణికంఠ క్రియే షన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్ రెడ్డి తెలుగులో అందిస్తున్నారు. అర్రోల్ కోర్రెల్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో త్వరలో విడుదల కానుంది.
‘‘ ‘తారే జమీన్ పర్’, ‘మనం’, ‘దృశ్యం’ తరహాలో వైవిధ్య కథాంశంతో ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దీన్ని తెరకెక్కించారు. సూర్య పాత్ర విభిన్నంగా ఉంటుంది’’ అని చెప్పారు.