మిస్సయిన అమలాపాల్ | amalapal loss chance in tollywood film | Sakshi
Sakshi News home page

మిస్సయిన అమలాపాల్

Published Thu, May 1 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 AM

మిస్సయిన అమలాపాల్

మిస్సయిన అమలాపాల్

 పెళ్లి ప్రకటనతో నటి అమలాపాల్ అవకాశాలను కోల్పోతున్నారా? అంటే అవుననే చెప్పవచ్చు. నటి అమలాపాల్ దర్శకుడు విజయ్ ప్రేమలో పడినట్లు గత కొంత కాలంగా ప్రచారం జోరుగా జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు ఈ ప్రచారంపై నోరు మెదపని ఈ ప్రేమ జంట తాజాగా అవును మేము ప్రేమించుకుంటున్నాం. త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాం. అంటూ బహిరంగంగా ప్రకటించి వదంతులను నిజం చేసింది. దీంతో అమలాపాల్‌కు వ్యక్తిగతంగా మేలు జరిగినా కెరీర్ పరంగా పెద్ద డామేజ్ అయ్యింది. అప్పుడే ఒక టాలీవుడ్ అవకాశం వెనక్కు పోయింది. వస్తా నీ వెనుక అనే చిత్రంలో అమలాపాల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు.

ఈ చిత్రం షూటింగ్ విదేశాల్లో చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసుకోగా అమలాపాల్ పెళ్లి వార్తలు తెలిసి షూటింగ్‌ను వాయిదా వేసుకున్నారట. అంతేకాదు చిత్రం నుంచి అమలాపాల్‌ను తొలగించి ఆ పాత్రకు వేరే హీరోయిన్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నారట. తన పెళ్లి విషయం గురించి అమలాపాల్ తమకు ముందుగా తెలియజేయలేదని, ఈ విషయాన్ని తాను పత్రికల్లో చూసి తెలుసుకున్నామని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. అమలాపాల్‌కిచ్చిన అడ్వాన్స్‌ను కూడా తిరిగి ఇవ్వవలసిందిగా ఆ చిత్ర నిర్మాతలు కోరుతున్నారు.

అమలాపాల్ ఖండన
అయితే వస్తా నీ వెనుక చిత్ర నిర్మాతలు తనపై లేనిపోని అభాండాలేస్తున్నారని నటి అమలాపాల్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె పేర్కొంటూ తన పెళ్లి పేరుతో ఁవస్తా నీ వెనుక* చిత్ర నిర్మాతలు తనపై ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. నిజానికి చిత్ర నిర్మాణంలో ఆ నిర్మాతలకే నిబద్ధత లేదన్నారు. వస్తా నీ వెనుక చిత్రం కోసం మార్చి నుంచి మే వరకు మూడు నెలలు కాల్‌షీట్స్ కేటాయించానన్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం గురించి తాను పలుమార్లు సంప్రదించినా ఆ నిర్మాత నుంచి సరైన సమాధానం రాలేదన్నారు. విదేశాల్లో షూటింగ్ అన్నారని, అలాంటప్పుడు తన అసిస్టెంట్‌కు పాస్‌పోర్టుల గురించి సంప్రదించలేదని ఆరోపించారు. తన పెళ్లి జూన్‌లో జరగనుందని, తాను ఆ చిత్రానికి మార్చి నుంచి మే నెల వరకు కేటాయించానని అమలాపాల్ పేర్కొన్నారు. అలాంటప్పుడు తన పెళ్లి విషయం వారికి చెప్పాల్సిన అవసరమేముందని ఈ బ్యూటీ ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement