ప్రేమను వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు | Kajal Reveals her Marriage Plans | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 19 2018 10:25 AM | Last Updated on Thu, Apr 19 2018 10:25 AM

Kajal Reveals her Marriage Plans - Sakshi

తమిళ సినిమా : ఆ నటుడు నాపై ప్రేమను వ్యక్తం చేయడానికి రెండు సార్లు ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు నటి కాజల్‌ అగర్వాల్‌. ఈ బ్యూటీ ఆలోచనలిప్పుడు ప్రేమ, పెళ్లి చుట్టు తిరుగుతున్నాయనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. నటిగా దశాబ్దం దాటేసిన ఈ ముద్దుగుమ్మ తమిళం, తెలుగు, హింది భాషల్లో నటించేశారు. తెలుగు, తమిళ భాషల్లో అగ్రనాయకిగా రాణిస్తున్న కాజల్‌ హిందిలోనూ అలా ఎదగాలన్న కోరిక నెరవేరలేదు. అయితే ఇంకా అలాంటి స్థాయి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

కోలీవుడ్‌లో విజయ్, అజిత్, విశాల్, సూర్య వంటి స్టార్‌ హీరోలందరితోనూ రొమాన్స్‌ చేసిన ఈ బ్యూటీ టాలీవుడ్‌లోనూ మెగాస్టార్‌ చిరంజీవి నుంచి యువ నటుడు నవదీప్‌ సహా జత కట్టేశారు. ప్రస్తుతం కాస్త జోరు తగ్గిందనే చెప్పాలి. చేతిలో చిత్రాలు ఉన్నా అవేవీ స్టార్‌ హీరోల చిత్రాలు కావు. దీంతో పెళ్లి వైపు దృష్టి మళ్లిందనే ప్రచారం జోరందుకుంది. కాజల్‌ అగర్వాల్‌ చెల్లెలు నిషాఆగర్వాల్‌ చాలా కాలం క్రితమే పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్‌ అయిపోయింది. 

దీంతో కాజల్‌కు కూడా పెళ్లి చేసేయాలనే నిర్ణయానికి ఆమె తల్లిదండ్రులు వచ్చినట్లు సమాచారం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎవరినైనా ప్రేమిస్తున్నారా? మీకిప్పటి వరకూ ఎవరైనా ప్రేమిస్తున్నానని చెప్పారా? అన్న ప్రశ్నలకు కాజల్‌అగర్వాల్‌ బదులిస్తూ ఇప్పటి వరకూ తానెవరిని ప్రేమించలేదని చెప్పారు. అయితే నటుడు నవదీప్‌ ప్రేమ గురించి తనతో చెప్పడానికి రెండు సార్లు ప్రయత్నించారని తెలిపారు. ఇంతకీ పెళ్లెప్పుడు చేసుకుంటారన్న ప్రశ్నకు ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement