ఆ వయసులో పెళ్లి తప్పే! | Amala Paul about her marriage | Sakshi
Sakshi News home page

ఆ వయసులో పెళ్లి తప్పే!

Published Mon, Nov 21 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM

ఆ వయసులో పెళ్లి తప్పే!

ఆ వయసులో పెళ్లి తప్పే!

‘‘విడాకులు తీసుకోవాలని ఎవరూ పెళ్లి చేసుకోరు. ఇప్పటివరకూ నా జీవితంలో నేను తీసుకున్న అత్యంత బాధాకరమైన, క్లిష్టమైన నిర్ణయం (విడాకులు తీసుకోవాలనుకోవడం) అది. నేనిప్పటికీ విజయ్‌ను ప్రేమిస్తున్నా. ఎప్పటికీ ప్రేమిస్తా’’ అన్నారు అమలాపాల్. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో అమలాపాల్ ప్రేమ, పెళ్లి, విడాకుల వివరాలు అందరికీ తెలిసినవే. విడాకులు తీసుకోవడానికి ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కిన చాన్నాళ్లకు అమలాపాల్ స్పందించారు. ‘‘18 ఏళ్లకు కథానాయిక అయ్యా. 23 ఏళ్లకు పెళ్లి చేసుకున్నా.

ఏడాది తిరగక ముందే విడిపోవాలనుకున్నా. ఆ టైమ్‌లో నాకు సలహాలు ఇచ్చేవారు లేరు. విజయ్‌ను పెళ్లి చేసుకోవడం ఒప్పా? తప్పా? అనడిగితే.. చెప్పలేను. కానీ, ఆ వయసులో పెళ్లి చేసుకోవడం తప్పే. ఎర్లీ ట్వంటీస్‌లో పెళ్లి చేసుకోకూడదు. నేనెవర్నీ నిందించడంలేదు. బాధపడడం లేదు. జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం కష్టం’’ అని అమలాపాల్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement