అమలా పాల్
... అంటున్నారు అమలా పాల్. ఏ విషయంపై దృష్టి పెడదామంటున్నారంటే ‘చూపు’పై. అర్థం కావడంలేదా? చూపు లేనివాళ్లకు చూపునిద్దాం అంటున్నారు. ఈ విషయం గురించి అమలా పాల్ మాట్లాడుతూ – ‘‘ఓ సంస్థకు చెందిన ఐ క్యాంపైన్ స్పీచ్‌కు రెడీ అవుతున్నప్పుడు కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ల మంది చూపులేక బాధపడుతున్నారని, అందులో ఎక్కువమంది ఇండియాలోనే ఉన్నారని తెలుసుకుని షాక్ అయ్యాను. నేత్రదానంపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు ఒక కారణమై ఉంటుందనిపించింది.
అంతా సవ్యంగా ఉంటే ఏటా 40 వేలకుపైగా సర్జరీలు జరుగుతాయి. వారందరూ ఎంతో సంతోషంగా ప్రపంచాన్ని చూడగలరు.. చూపులేని వాళ్లు ఈ రంగుల ప్రపంచాన్ని చూసేందుకు మన వంతు సాయం చేద్దాం’’ అని అమలాపాల్ పేర్కొన్నారు. అంతేకాదు కళ్లను దానం చేసేందుకు ‘అమలహోమ్’ అనే ఫౌండేషన్‌ను కూడా స్టార్ట్ చేశారు. నేత్రదానం చేయాలనుకునేవాళ్లు ఈ ఫౌండేషన్‌ని సంప్రదించవచ్చు. కంటి ఆపరేషన్స్‌కి ఆర్థిక సహాయం అందజేయడానికి ఈ ఫౌండేషన్ కృషి చేయాలనుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment