హైకూ టైటిల్ మారింది | Suriya's film Haiku to see a title change | Sakshi
Sakshi News home page

హైకూ టైటిల్ మారింది

Published Sun, Aug 30 2015 3:04 AM | Last Updated on Sun, Sep 3 2017 8:21 AM

హైకూ టైటిల్ మారింది

హైకూ టైటిల్ మారింది

సూర్య అతిథి పాత్రలో నటిస్తూ 2డీ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం హైకూ. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమలాపాల్, బిందుమాధవి, కార్తీక్‌కుమార్ ప్రధాన పాత్రలు పోషించగా కవిన్, నయన,అభిమాన్ తదితర నవ నటీనటులు ముఖ్య పాత్రలు పరిచయం అవుతున్నారు. బాలల ఇతివృత్తంగా రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడీ చిత్ర పేరు మారనుంది. హైకూ అనేది ఆంగ్లం పేరు కావడంతో రాష్ట్ర ప్రభుత్వ రాయితీలకు చిత్రం అర్హత లేని కారణంగా పసంగ-2గా పేరు మార్చినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.
 
 ఇంతకు ముందు పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన పసంగ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందడంతో పాటు జాతీయ అవార్డులను గెలుచుకున్న విషయం అందరికీ  తెలిసిందే. దీంతో ఈ పసంగ చిత్రంపైనా ఎక్కడలేని అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇటీవల చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్లు విడుదలయ్యాయి. ఈ చిత్రానికి అరోల్ కొరెల్లి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని వచ్చే నెలలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ త్వరలో విడుదల చేయనుంది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement