అత్యంత సంచలనాత్మక సెలబ్రిటీ | actress amala paul as a most sensational celebrity | Sakshi
Sakshi News home page

అత్యంత సంచలనాత్మక సెలబ్రిటీ

Published Mon, Oct 12 2015 11:17 AM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM

అత్యంత సంచలనాత్మక సెలబ్రిటీ - Sakshi

అత్యంత సంచలనాత్మక సెలబ్రిటీ

కొరుక్కుపేట: తమిళ సినీరంగంలో 2015 ఏడాదిగాను అత్యంత సంచలనాత్మక సెలబ్రిటీగా నటి అమలాపాల్ మొదటి స్థానంలో నిలిచింది. ఇంటెల్ సెక్యూరిటీ గ్రూప్, మెక్‌కాఫే సంయుక్తంగా చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైందని ఇంటెల్ సెక్యూరిటీ గ్రూప్, ఇండియా ఇంజనీరింగ్ సెంట్రల్ హెడ్ వెంకట కృష్ణపూర్ తెలిపారు. ఈ మేరకు ఆయన వెల్లడించిన సర్వేలో మోస్ట్ సెన్సేషనల్ సెలబ్రిటీస్ ( ఎంఎస్‌సీ) సర్వేలో గత ఏడాది సంచలనాత్మక సెలబ్రిటీగా ఉన్న ధనుష్ స్థానంలో ఈ ఏడాది అమలాపాల్ నిలిచిందన్నారు.

రెండో స్థానంలో హీరో ఆర్య, మూడవ స్థానంలో సూర్య నిలిచారని అన్నారు. మొదటి ఐదుగురు సెలబ్రిటీల్లో అమలాపాల్ 11.53 శాతం, ఆర్య 11.39 శాతం, సూర్య 10.83 శాతం, విజయ్ 10.69 శాతం, ఎమిజాక్సన్ 10.14 వ శాతాన్ని అభిమానులు నమోదు చేశారని తెలిపారు. తమిళ సినిమాలో ఆకర్షణీయమైన నటీనటులు పాల్గొన్న పాపులర్ కల్చర్ ఈవెంట్‌లు, అవార్డు షోలు, టీవీ షోలు, ఫిల్మ్‌మ్యూజిక్ లాంచ్ తదితర వాటిని పరిగణలోనికి తీసుకుని వెబ్సైట్ ద్వారా సర్వే చేశామని వెల్లడించారు. ఈ ఏడాది అమలాపాల్ సెలబ్రిటీగా నిలువడం సంతోషంగా ఉందని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement