Mental courage
-
కార్యసాధన
చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని ఒక సామెత ఉంది. అంటే చెప్పిన పని కాక ఎక్కువ చేసి వచ్చాడు అని అర్థం. సందర్భానుసారంగా దీనిని మెచ్చుకోటానికి, తప్పు పట్టటానికి కూడా ఉపయోగిస్తారు. దీనికి పూర్తి వ్యతిరేకం ‘‘పుల్లయ్య వేమవరం’’ – రాకపోకల శ్రమ తప్ప ఏ మాత్రం ప్రయోజనం లేదు అని. ఈ రెండు కూడా యజమాని చేత ఆదేశించబడిన దాసుడు పనిని ఏవిధంగా నిర్వర్తించాడు? అనే దాన్ని తెలిపేవే.‘‘రేపు పుల్లయ్యని వేమవరం పంపాలి’’ అని యజమాని ఇంట్లో వాళ్ళతో చెపుతుంటే విని తెల్లవారే సరికి, వెళ్ళి తిరిగి వచ్చాడు. యజమాని పిలిచి వెళ్ళమని చెప్పే లోపే తాను చేసిన నిర్వాకం చెప్పాడు. వెళ్ళి ఏం చేశావు? అని అడిగితే సమాధానం లేదు. మళ్ళీ వెళ్ళవలసి వచ్చింది.మరొక వ్యక్తి చెప్పిన పని మాత్రం పూర్తి చేసి రావటం జరిగింది. ఫలానా వారు ఉన్నారో లేదో చూసి రమ్మంటే ఉన్నదీ లేనిదీ కనుక్కుని వచ్చేయటం జరిగింది. లేరు అంటే మళ్ళీ ఎప్పుడు ఉంటారు? అని తెలుసుకుంటే మరొక మారు వెళ్ళవలసిన పని ఉండదు. వేరొక వ్యక్తి యజమాని చెప్పిన పని చేసి, దానికి అనుబంధంగా ఉన్న మరిన్ని వివరాలు సేకరించి తిరిగి వచ్చి, యజమాని అడిగిన ప్రశ్నలకి తగిన సమాధానాలు ఇచ్చి మరొకమారు వెళ్ళవలసిన పని లేకుండా చేయటం జరిగింది. అంటే చూసి రమ్మన్న వ్యక్తి లేకపోతే ఎక్కడికి వెళ్లారు? ఎప్పుడు వస్తారు? అప్పుడు మా యజమాని రావచ్చా? మొదలైన వివరాలు తెలుసుకుంటే ఉపయోగంగా ఉంటుంది. అక్కడి వారితో మాట్లాడి తమ వివరాలన్నీ చెప్పి వచ్చే తెలివితక్కువ వారూ, అనవసర ప్రసంగం చేసి అతితెలివితో వ్యవహారాన్ని చెడగొట్టేవారూ కూడా ఉంటారు. ఇటువంటి వారితో ప్రమాదం. ఈ నలుగురిలో యజమానికి ప్రీతిపాత్రమైన వారు ఎవరు? తెలుస్తూనే ఉంది కదా! ఇటువంటి కార్యసాధకుడికి నిలువెత్తు ఉదాహరణ హనుమ. ముందు తనంతట తాను సముద్ర లంఘనం చేస్తాను అనలేదు. జాంబవంతుడు ప్రేరేపిస్తే కాదని కూడా అనలేదు. నిజానికి వెళ్ళింది సీతని చూడటానికి.కాని, చూసి రాలేదు. మాట్లాడాడు. అప్పుడు, తరువాత ప్రతిపని చేస్తున్నప్పుడు తాను ఇది చేయవచ్చునా? లేదా? అని వితర్కించి, ఆ పని తాను చేయవలసిన పనిలో భాగం అని నిర్ధారించుకుని మరీ చేశాడు. తన ప్రభువు లక్ష్యం తెలుసు. తాను చేసే ప్రతి పని దానికి సహకరించేదిగా ఉన్నదీ, లేనిదీ విచారించి, అందులో భాగమేనని నిర్ధారించుకుని మరీ చేశాడు. ఆ యా సందర్భాలలో దూత అయిన వాడు ఏమి చేయవచ్చు, ఏమి చేయ కూడదు అని వితర్కించుకుని, అది శాస్త్ర సమ్మతమే అని నిశ్చయించుకున్నాక మాత్రమే చేశాడు. దూతగా వెళ్ళేవారు శారీరిక బలంతో పాటు, మానసిక ధైర్యం, శాస్త్రపరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఒక దేశ దౌత్య, రాయబార కార్యాలయాల్లో ఉండేవారికి ఉండవలసిన లక్షణాలు ఇవే. అప్పుడు మాత్రమే దేశ ప్రతిష్ఠని పెంపొందించే విధంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ‘‘చూడబడినది నా చేత సీత’’ అని చెప్పగానే ‘‘ఆమె ఎట్లా ఉన్నది? ఏ మన్నది?’’ అని అడిగాడు రాముడు. నేను దూరం నుంచి చూశానే కాని, దగ్గరగా చూడలేదు, మాట్లాడ లేదు అని చెపితే ఏం బాగుంటుంది? లంకా నగరం గురించి, రావణుడి సైన్యం గురించి అడిగినప్పుడు అవి తెలుసుకోమని చెప్ప లేదు కనుక నేను పట్టించుకో లేదు అంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించినట్టు కాదు కదా అది!అందుకే సమర్థులు చూసి రమ్మంటే కాల్చి వస్తారు. దూతగా వెళ్ళేవారు శారీరిక బలంతో పాటు, మానసిక ధైర్యం, శాస్త్రపరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఒక దేశ దౌత్య, రాయబార కార్యాల యాల్లో ఉండేవారికి ఉండవలసిన లక్షణాలు ఇవే. అప్పుడు మాత్రమే దేశ ప్రతిష్ఠని పెంపొందించే విధంగా నిర్ణయాలు తీసుకో గలుగుతారు. – డా. ఎన్. అనంతలక్ష్మి -
మేరీ జిందగీ..వేకప్ గరల్స్
అవేకెండ్ హిందుస్థాన్ ఈజ్ అవేక్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హాజ్ అవేకెండ్ ద ఎర్త్ యాజ్ అవేకెండ్ అండ్ ది స్కై ఈజ్ అవేక్... సో యూ ఆల్సో వేకప్!! అంటూ ఈ ట్యూన్.. కశ్మీరి బాలికల్లో మానసిక ధైర్యాన్ని నూరిపోస్తోంది. కశ్మీకు ఉన్న ప్రత్యేక రాష్ట్ర హోదా ఎత్తి వేసిన తరువాత కూడా అక్కడి పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. వీలైనంత త్వరగా అక్కడి పరిస్థితులను అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా మార్చేందుకు కేంద్రప్రభుత్వం, ఇండియన్ ఆర్మీ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే లక్నోకు చెందిన ‘మేరి జిందగీ’ బ్యాండ్‌ను కశ్మీకు పంపి అక్కడి బాలికల్లో అనేక అంశాలపై అవగాహన కలి్పస్తోంది. రేపటి (అక్టోబర్ 11) అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ ఆర్మీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం విశేషం. విన్నింగ్ హార్ట్స్ అండ్ మైండ్స్ ఆర్మీ సరిహద్దుల్లో ఉండి పోరాడుతూ దేశప్రజలు, కశీ్మరీల ప్రాణాలకు రక్షణ కల్పించడంతోపాటు, అక్కడి మహిళలు, బాలికల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కృషిచేస్తోంది. ఈ క్రమంలోనే ‘‘విన్నింగ్ హార్ట్స్ అండ్ మైండ్స్ (డబ్ల్యూహెచ్‌ఏఎమ్), సద్భావన’’ పేరుతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా..‘మేరీ జిందగీ’ బ్యాండ్‌ను కశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాల్లో రెండు రోజులపాటు (9, 10) పర్యటిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి.. విద్య, ఆత్మరక్షణ, ప్రాథమిక హక్కులు, సమానత్వం, మెన్స్ట్రువల్ హైజీన్ వంటి విషయాలపై అక్కడి మహిళలు, బాలికల్లో పాటల ద్వారా రాక్ బ్యాండ్ అవగాహన కలి్పస్తోంది. తమని తాము రక్షించుకోవడానికి ఉపయోగపడే ఆత్మరక్షణ మెళకువలను పాటల ద్వారా నేరి్పంచడం, మహిళలను చుట్టుముట్టే సమస్యలపై సంగీత కచేరీల ద్వారా విభిన్న కోణాల్లో వివరించడం, కొంతమంది విద్యారి్థనులతో ముచ్చటించి ఆరోగ్యం, విద్య, సమానత్వం వంటివాటి ప్రాముఖ్యతను తెలియజెబుతోంది. మేరీ జిందగీ.. దేశంలో తొలి మహిళా రాక్ బ్యాండ్ మేరి జిందగీ. దీనిని 2010లో డాక్టర్ జయ తివారీ స్థాపించారు. ‘సేవ్ ది గర్ల్ చైల్డ్’ లక్ష్యంగా ఏర్పడిన మహిళా బ్యాండ్ వివిధ అంశాల్లో మహిళలు, బాలికలకు అవగాహన కలి్పంచేందుకు ప్రత్యేకమైన పాటలు, సంగీతాన్ని రూపొందించి, పాటల రూపంలో ప్రదర్శిస్తుంది. ఇప్పటిదాక 350పైగా షోలను బ్యాండ్ నిర్వహించింది. బ్యాండ్ లీడర్ జయ స్వయంగా పాటలను రచించి, వాటికి ట్యూన్లు రూపొందించడం విశేషం. ఇంకా ఈ బ్యాండ్‌లో నిహారిక దుబే, పుర్వి మాలి్వయా, సౌభాగ్యా దీక్షిత్, మేఘన శ్రీవాస్తవ లు ఉన్నారు. ఈ బ్యాండ్ మహిళలకు మరింత దగ్గరయ్యేందుకు పింక్ డ్రెస్‌కోడ్‌ని ధరించడం విశేషం. ఈ ఐదుగురు కలిసి వివిధ రకాల సంగీత వాయిద్యాలతో మహిళలు, బాలికలకు అవగాహన కల్పిస్తున్నారు. -
అందుకు గర్వపడుతున్నా: మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫ్రంట్లైన్లో ఉన్న పోలీస్ అధికారులు కరోనా వైరస్ బారిన పడుతున్నారని తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటి నుంచి ధైర్యాన్ని కోల్పోకుండా అధికారులు విధులు నిర్వర్తించారని తెలిపారు. ఇప్పుడు చిన్న స్థాయి అధికారి నుండి పెద్దస్థాయి అధికారి వరకు కరోనా బారిన పడుతున్నారని, ఎవరు మనోధైర్యాన్ని కోల్పోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. (డేంజర్ బెల్స్ !) తెలంగాణ పోలీస్ అకాడమీలో కూడా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని భయాందోళనలకు గురికావొద్దని అభ్యర్థులకు ఆయన సూచించారు. కరోనా బారిన పడిన పోలీసులు తిరిగి కోలుకుని విధుల్లోకి చేరారని, చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు గర్వపడుతున్నానని తెలిపారు. లాక్డౌన్ నుంచి నేటి వరకు విధి నిర్వహణలో పోలీసు అధికారులు ఎప్పుడు ముందున్నారని మహమూద్ అలీ పేర్కొన్నారు. -
మానసిక స్థయిర్యమే నా బలం: కోహ్లి
న్యూఢిల్లీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తను శారీరక దృఢత్వంకంటే మానసిక సంసిద్ధతకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తానని చెప్పాడు. అందుకే ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే తిరిగి అదేస్థాయిలో ఆటను మొదలుపెట్టే బలం తనలో ఉందన్నాడు. ఐపీఎల్ అంటే తనకు ప్రత్యేక అభిమానమని... ఒకే టోర్నీలో అన్ని దేశాల వారినీ కలుపుకొని ఆడుతూ అందరినీ అలరించే లీగ్ అని చెప్పాడు. అయితే కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితులు మునుపటిలా ఉండవని... తప్పకుండా మార్పులుంటాయని... వీటిని అంగీకరించాల్సిందేనన్నాడు. ‘ఐసీసీ టోర్నీలకంటే భిన్నమైంది ఐపీఎల్. అందుకే ఆ లీగ్ అంటే నాకెంతో ఇష్టం. మనతో కొత్తగా ఆడేవాళ్లతో మన అనుభవాలు పంచుకోవచ్చు. పాతవాళ్లతో అనుబంధం కొనసాగించవచ్చు. ఎప్పుడోగానీ చూసే విదేశీ ఆటగాళ్లతో తరచూ కలిసి ఆడే అవకాశం ఈ లీగ్ ద్వారానే కలుగుతుంది. అందుకే ఐపీఎల్ అంటే అందరికీ మోజే. అభిమానులకు క్రేజే’ అని అన్నాడు. మీ ఫేవరెట్ మ్యాచ్ ఏదనే ప్రశ్నకు బదులిస్తూ ‘ఇది చెప్పడం తేలిక కాదు. ఎందుకంటే అలాంటివి నాకెన్నో ఉన్నాయి... అయితే అప్పటి పరిస్థితి, ప్రాధాన్యతను బట్టి చూస్తే టి20 ప్రపంచకప్ (2016)లో భాగంగా మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన పోరు నా ఫేవరెట్ మ్యాచ్‌ల్లో ఒకటి. ఓడిపోయేస్థితిలో ఉన్న ఈ మ్యాచ్‌లో మేము గెలిచాం’ అని చెప్పాడు. -
అలాంటి వారికి సినిమా కరెక్ట్ కాదు
‘‘మానసికంగా ధైర్యంగా లేని వారికి సినిమా సరైనది కాదు’’ అంటున్నారు అమలా పాల్. ప్రస్తుతం స్త్రీలపై అఘాయిత్యాలు, వేధింపులు జరగడం ప్రతిరోజూ గమనిస్తున్నాం. ఈ చర్యలను ఉద్దేశించి అమలా పాల్ మాట్లాడుతూ – ‘‘స్త్రీలపై వేధింపులు కేవలం సినిమా ఇండస్ట్రీలోనే జరుగుతాయి అనుకోవడం పొరపాటు. అన్ని రంగాల్లో ఇలాంటి ఆకృత్యాలు జరుగుతూనే ఉంటాయి. కానీ స్త్రీ మాత్రం తన ధైర్యాన్ని కోల్పోకూడదు. ముఖ్యంగా సినిమాల్లోకి వచ్చే వాళ్లు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మానసికంగా ధైర్యంగా లేకపోతే ఇక్కడ రాణించలేం. కేవలం సినిమా అనే కాదు, ఇది ఏ వృత్తికి అయినా అప్లై అవుతుంది. వర్కింగ్ ప్లేస్‌లో రకరకాల వేధింపులకు గురయ్యే అవకాశం ఎక్కువ. అందుకే మనం ధైర్యంగా ఉండాలి. మన నిర్ణయం మీద కచ్చితంగా నిలబడగలగటం, ఆలోచనల్ని సూటిగా వ్యక్తపరచడం నేర్చుకోవాలి. అప్పుడు ఎలాంటి సమస్యకైనా ఎదురుగా నిలబడి పోరాడటం నేర్చుకోగలుగుతాం’’ అని పేర్కొన్నారు అమలా పాల్. -
నేడు ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవం
ఆత్మస్థైర్యానికి అడ్డేదీ ! వారి మనోధైర్యం అందరికీ ఆదర్శం.. చిన్న చిన్న కారణాలతో చింతించే మనుషులకు వారి జీవన ప్రయాణమే ఓ పాఠం. కుంగుబాటుకు లొంగిపోక ధైర్యంగా ఎదుర్కొని నిలిచిన వారి పోరాట పటిమ అమోఘం. రంగం ఏదైనా రాణించేస్తామనే వారి ధీమా మేరునగం. ఎవరెస్టు అయినా ఎక్కేస్తామనే వారి ఉత్సాహానికి సరిహద్దు అంబరం. పదుగురిలో మేం ‘ప్రత్యేక ప్రతిభావంతుల’మంటూ చాటి చెబుతున్న వారి ఆత్మస్థైర్యం నిత్య స్ఫూర్తిదాయకం. శరీరానికే వైకల్యం.. తన వైకల్యం శరీరానికే తప్ప మనస్సుకు కాదని నిరూపించాడు బాలరాజు. పులిచెర్ల మండలం పాళెం పంచాయతీ తుడుంవారిపల్లెకు చెందిన బాలరాజు(45) చిన్న వయస్సులోనే ఎడమకాలు కోల్పోయాడు. నిరాశ చెందకుండా కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. పొలం పనులు సొంతంగా చేసుకుంటున్నాడు. ఉపాధి హామీ పథకంలో ఈ ఏడాది 102 రోజుల పని సైతం పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఘన సన్మానమూ అందుకున్నాడు. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయాలకు వైకల్యం అడ్డు రాదంటున్నాడు బాలరాజు. -కల్లూరు -
మానసిక ధైర్యంతో ముందుకు..
మలేసియాటౌన్‌షిప్: నిరాశ, నిస్పృహలతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెందిన వారిలో మానసిక ధైర్యం నింపేందుకు కృషి చేస్తున్నామని పలు స్వచ్ఛందసేవా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగాలయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో బుధవారం 2కే వాక్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కేపీహెచ్‌బీ కాలనీ రాందేవ్రావు ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన అవగాహన శిబిరంలో పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దిగులు, ఒంటరితనం, నిస్సహాయత, నిరాశ, కుటుంబ, వ్యక్తిగత సమస్యలు ఆత్మహత్యకు దారితీస్తున్నాయన్నారు. ఆ సమయంలో ఆప్తులు, స్నేహితులు, తోటి నివాసితులు ఓదార్చి మనోధైర్యాన్ని ఇచ్చి ఆత్మహత్య ప్రయత్నంను నివారించవచ్చన్నారు. వీరికోసం ఆత్మహత్య నివారణ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, 040-46004600 నంబర్‌కు సంప్రదించి వారిని ఈ కేంద్రంలో చేర్చాలన్నారు. వారికి మానసిక ధైర్యాన్ని ఇచ్చే విధంగా చికిత్స చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సినీ నటి రేష్మారాథోర్, నటుడు నవీన్‌చంద్ర ముఖ్య అతిథులుగా హాజరై 2కే వాక్‌ను ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛంద సంస్థల ప్రతినిథులు, స్థానికులు ఆత్మహత్యలను నివారించాలని నినాదాలు చేస్తూ జేఎన్టీయూ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోషిణి ఫౌండేషన్ వ్యవస్థాపకులు టింకి భరద్వాజ్, మాక్రొ ఫౌండేషన్ సంస్థకు చెందిన సుబ్బారావు, మాక్రొ గ్రూపు డెరైక్టర్ మహేష్ మాల్నిధి, అరుణాచలం సంస్థ డెరైక్టర్ త్యాగరాజన్, సేవా స్వచ్ఛంద సంస్థ సెక్రటరీ జవహర్లాల్ నెహ్రూ, ఐపీడీజీ మల్టిపుల్ కౌన్సిల్ వైస్ చైర్పర్సన్ లయన్ దీపక్ భట్టాచార్జీ, వైడబ్ల్యూసీఏ ఆఫ్ సికింద్రాబాద్ సంస్థ కోశాధికారి నియోమి ఫ్రాన్సిస్, సీవోవీఏ సంస్థ డెరైక్టర్ మాజర్హుస్సేన్, లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ ఎన్ఎన్. మూర్తి, జిల్లా ప్రెసిడెంట్ లయన్ ఈశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.