గోపాల్‌గంజ్: పోర్న్ సైట్ల కారణంగానే మహిళలపై లైంగిక నేరాలు పెరుగుతు న్నాయని బిహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యా నించారు. పోర్న్‌సైట్లను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ‘దిశ’ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియా, సాంకేతికత పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం వల్లే మహిళలు, చిన్నారులపై దేశమంతటా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. నేరగాళ్లు వీటిని చిత్రీకరించి, ఇంటర్నెట్‌లో పెడుతున్నారు. వీటిని చూసి ఇతరులు దారుణాలకు పాల్పడుతున్నారు. అందుకే ఈ పోర్న్ సైట్లపై దేశంలో పూర్తి నిషేధం విధించాలని కేంద్రానికి లేఖ రాస్తా’ అని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment