![I dont believe in #MeToo allegations against Rajkumar Hirani - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/8/sanjay-dutt.jpg.webp?itok=2adBSwyT)
సంజయ్ దత్
‘‘దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీతో కలసి చాలా సినిమాలు చేశాను. చాలా కాలంగా అతను నాకు పరిచయం. అతని మీద వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలను నేను అస్సలు నమ్మను’’ అన్నారు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా ‘మున్నాభాయ్’ సిరీస్, ‘పీకే, సంజు’ చిత్రాల దర్శకుడు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఆయన వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన ఓ మహిళ చేసిన ఆరోపణలను సంజయ్ దత్ కొట్టి పారేశారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘రాజు మీద ఆరోపణలు నమ్మశక్యంగా లేవు. ఆరోపణలు కాకుండా ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయవచ్చుగా?’’ అన్నారు. ‘‘మున్నాభాయ్ సిరీస్‌లో కొత్త చిత్రం కచ్చితంగా ఉంటుందని రాజు ఆల్రెడీ చెప్పాడు. కానీ అది ఎప్పుడు ఉంటుందో నాక్కూడా సరిగ్గా తెలియదు’’ అని కూడా సంజయ్ దత్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment