నానా పటేకర్
నటి తనుశ్రీ దత్తాను పదేళ్ల క్రితం లైంగికంగా వేధించారని నటుడు నానా పటేకర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘హస్‌ఫుల్ 4’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఆరోపణలు క్లియర్ అయ్యే వరకూ సినిమా షూటింగ్ నిలిపివేద్దాం అని హీరో అక్షయ్ కుమార్ టీమ్‌ని కోరిన సంగతి తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు సాజిద్ ఖాన్ మీద కూడా ఈ ఆరోపణలు రావడంతో దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారాయన.
తాజాగా ఈ సినిమా నుంచి నానా పటేకర్ కూడా తప్పుకున్నారట. ‘‘అందరి సౌకర్యం ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు నానా పటేకర్. ఈ సినిమా నుంచి తప్పుకోవడమే సరైన స్టెప్. ఎవరైనా నిర్మాత శ్రేయస్సే కోరుకుంటారు. అందుకే.. నానా కూడా సినిమా నుంచి తప్పుకున్నారు’’ అని నానా తనయుడు మల్హర్ మీడియాతో చెప్పారు. ప్రస్తుతం నానా పటేకర్ స్థానంలో అనిల్ కపూర్ పేరుని పరిశీలిస్తున్నారట చిత్ర బృందం.
Comments
Please login to add a commentAdd a comment