Housefull 4
-
అవును.. ప్రేమలో ఉన్నాం: కృతి కర్బందా
ముంబై : తాను ప్రేమలో ఉన్నాననే విషయాన్ని హీరోయిన్ కృతి కర్బందా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో దాయాల్సిందేమీ లేదని.. తన తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలుసునని పేర్కొన్నారు. మోడల్‌గా కెరీర్ ఆరంభించిన కృతి... బోణీ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్కినేని మనుమడు సుమంత్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం కృతికి సక్సెస్ ఇవ్వకపోయినా... కన్నడ, తమిళ సినిమాల్లో నటించే అవకాశం మాత్రం కల్పించింది. ఇక పవన్ కల్యాణ్‌తో కలిసి తీన్మార్ మూవీలో నటించే అవకాశం వచ్చినా.. ఆ సినిమా కూడా నిరాశపరచడంతో కృతి పూర్తిగా సాండల్‌వుడ్‌కే పరిమతమైపోయింది. ఇక రామ్‌చరణ్ బ్రూస్లీ సినిమాలో అతడికి సోదరిగా నటించిన తర్వాత కృతి.. తెలుగు తెరకు దాదాపు దూరమైపోయింది. ఈ క్రమంలో బాలీవుడ్‌పై దృష్టి సారించిన ఈ ముద్దుగుమ్మ.. అక్షయ్ కుమార్ హౌజ్‌ఫుల్ 4 సినిమాతో కెరీర్లో తొలిసారి భారీ హిట్ అందుకుంది. అదే జోష్‌లో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ఈ క్రమంలోనే పాగల్‌పంతీ సినిమాకు సైన్ చేసింది. ఇందులో హీరోగా నటిస్తున్న పులకిత్ సామ్రాట్‌తో కృతి ప్రేమలో ఉందంటూ బీ-టౌన్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అతడితో కలిసి పార్టీలకు హాజరవుతూ.. పాపరాజీలకు పనికల్పించిన కృతి.. ఇంతవరకు ఈ విషయంపై నోరు మాత్రం మెదపలేదు. అయితే తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తాను సామ్రాట్‌తో డేటింగ్లో ఉన్న విషయాన్ని కన్ఫాం చేసింది. ‘ మేమిద్దరం జంటగా బాగుంటాం గనుక మా గురించి ఎన్నో వార్తలు ప్రచారమయ్యాయి. మీరు అనుకుంటున్నట్లుగా అవి రూమర్లు కాదు. నిజమే నేను సామ్రాట్‌తో ప్రేమలో ఉన్నాను. ఒక వ్యక్తి నచ్చడానికి ఐదేళ్లు పట్టొచ్చు లేదా పదేళ్లు పట్టొచ్చు. కానీ అంకిత్ ఐదు నెలల్లోనే నాకు పూర్తిగా అర్థమయ్యాడు. తనతో మాట్లాడటం నాకెంతో సౌకర్యవంతంగా ఉంటుంది. తన మీద ఉన్న నమ్మకంతోనే మీతో నా ప్రేమ విషయాన్ని పంచుకుంటున్నాను. ఇప్పుడు నాకెంతో మనశ్శాంతిగా ఉంది’ అని చెప్పుకొచ్చింది. కాగా వీరిద్దరు గతంలో వీరే దీ వెడ్డింగ్ సినిమాలోనూ కలిసి నటించారు. ఇక పులకిత్ సామ్రాట్‌కు గతంలోనే పెళ్లైంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ రాఖీ సిస్టర్ శ్వేతా రోహిరాను అతడు పెళ్లి చేసుకున్నాడు. అనంతరం మనస్పర్థలతో వాళ్లిద్దరూ విడిపోయారు. -
ఆ సినిమా వసూళ్లు ‘హౌస్‌ఫుల్’
సాక్షి, ముంబై : కిలాడీ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం హౌస్‌ఫుల్ 4 కలెక్షన్లలో దూసుకుపోతోంది. అక్టోబర్ 25న విడుదలైన ఈ చిత్రంపై మొదట్లో మిశ్రమ స్పందన వచ్చినా అనంతరం పుంజుకొని ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా రూ. 200.58 కోట్లను వసూలు చేసిందని చిత్ర నిర్మాత సాజిద్ నడియావాలా మంగళవారం ప్రకటించారు. అనంతరం చిత్రం విజయం పట్ల చిత్రంలోని నటులు కృతిసనన్, రితేష్ దేశ్‌ముఖ్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్మాణ బృందానికి అభినందనలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అక్షయ్ గత చిత్రం మిషన్ మంగళ రూ. 202 కోట్లు వసూలు చేసింది. త్వరలో ఈ రికార్డును తాజా చిత్రం అధిగమించే అవకాశముంది. మరోవైపు ఈ సినిమా వసూళ్లతో అక్షయ్‌కుమార్ 2019 సంవత్సరానికి గాను అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ హీరోగా నిలిచాడు. ఈ ఏడాది అక్షయ్ కుమార్ సినిమాలు సాధించిన వసూళ్లు రూ. 542 కోట్లుగా ఉన్నాయి. రెండో స్థానంలో హృతిక్ రోషన్ నిలిచాడు. ఆయన నటించిన సూపర్ 30, వార్ సినిమాలు రూ. 463 కోట్ల వసూళ్లు సాధించాయి. ఇదిలా ఉండగా, ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని వచ్చిన విమర్శలపై అక్షయ్‌కుమార్ తొలిసారి స్పందించారు. ‘హౌస్‌ఫుల్ 4 చిత్ర నిర్మాణంలో లాస్ ఏంజెల్స్‌లో ఉన్న ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఫాక్స్‌కాన్ కూడా పాలుపంచుకుంది. వారు మిలియన్ల కొద్దీ డబ్బు ఖర్చుపెట్టి ప్రతీ ఏటా సినిమాలు నిర్మిస్తారు. ఎంతో పేరున్న ఫాక్స్‌కాన్ సంస్థే తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ సినిమా వసూళ్లను పేర్కొంది. ఫేక్ కలెక్షన్లు అంటూ వాగే వారికి ఇదే నా సమాధాన’మంటూ ఘాటుగా బదులిచ్చాడు. -
5 రోజుల్లోనే రూ. 111 కోట్ల కలెక్షన్లు
ముంబై : బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ హౌస్‌ఫుల్ 4 బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా భారీ వసూళ్ల దిశగా సాగుతున్న ఈ మూవీ రూ 100 కోట్ల క్లబ్లో ప్రవేశించింది. సినీ విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైనా హౌస్‌ఫుల్ 4 హౌస్‌ఫుల్ కలెక్షన్లతోసత్తా చాటుతోంది. మంగళవారం రూ 24 కోట్లు రాబట్టిన హౌస్‌ఫుల్ 4 విడుదలైన 5 రోజుల్లోనే రూ. 111 కోట్లు వసూలు చేసింది. భాయ్ దూజ్ వేడుకల నేపథ్యంలో సెలవు దినం కలిసిరావడంతో ముంబై, ఢిల్లీ, ఎన్సీఆర్, యూపీ, రాజస్ధాన్ ప్రాంతాల్లో మంగళవారం భారీ వసూళ్లు రాబట్టింది. సూపర్‌హిట్ హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో నాలుగవ భాగంగా విడుదలైన హౌస్‌ఫుల్ 4ను సాజిద్ నడియాద్వాలా నిర్మాణ భాగస్వామ్యంతో తెరకెక్కించారు. అక్షయ్‌తో పాటు కృతి సనన్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, కృతి కర్బందా, పూజా హెగ్డే, చుంకీ పాండే తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. -
హౌస్‌ఫుల్ 4 వసూళ్ల హవా
ముంబై : బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన కామెడీ రైడర్ హౌస్‌ఫుల్ 4 బాక్సాఫీస్ వద్ద వసూళ్ల హవా కొనసాగిస్తోంది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైనా బాక్సాఫీస్ వసూళ్లలో మాత్రం ఈ మూవీ సత్తా చాటుతోంది. విడుదలైన ఐదు రోజుల్లో రూ 90 కోట్లకు చేరువై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హౌస్‌ఫుల్ 4 సోమవారం జాతీయ సెలవు దినంతో ఏకంగా రూ 34.56 కోట్లు రాబట్టి నాలుగు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ 87.78 కోట్లు వసూలు చేసింది. సాజిద్ నదియాద్వాలా నిర్మాణ భాగస్వామ్యంతో ఫర్హాద్ సంజీ నిర్ధేశకత్వంలో రూపొందిన హౌస్‌ఫుల్ 4లో ఖిలాడీ అక్షయ్‌తో పాటు కృతి సనన్, బాబీ డియోల్, కృతి కర్బంద, రితీష్ దేశ్‌ముఖ్, పూజా హెగ్డే ప్రధాన తారాగణంగా ప్రేక్షకులను అలరించారు. -
హౌస్‌ఫుల్ 4 బాక్సాఫీస్ రిపోర్ట్..
ముంబై : బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ నటించిన హౌస్‌ఫుల్ 4 బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ మూడో రోజు దీపావళి సెలవుతో భారీ వసూళ్లు సాధించింది. వారాంతంలో మొత్తం రూ 53.22 కోట్లు రాబట్టి వసూళ్లపరంగా సూపర్ హిట్‌గా నిలిచింది. శుక్రవారం తొలిరోజు రూ 19.08 కోట్లు రాబట్టిన హౌస్‌ఫుల్ 4 శనివారం రూ 18.81 కోట్లు, ఆదివారం రూ 15.33 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్ల జోరును కొనసాగిస్తోంది. అక్షయ్‌తో పాటు కృతి సనన్, బాబీ డియోల్, కృతి కర్బందా, రితీష్ దేశ్‌ముఖ్, పూజాహెగ్డేలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని సాజిద్ నదియాద్వాలా, ఫాక్స్‌స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. రానున్న రోజుల్లో హౌస్‌ఫుల్ మూవీ మెరుగైన వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
రివ్యూలు పెదవి విరిచినా.. భారీ వసూళ్లు!
ముంబై: అక్షయ్‌కుమార్ తాజా సినిమా ‘హౌజ్‌ఫుల్-4’.... సూపర్‌హిట్ కామెడీ ఫ్రాంచైజీగా గుర్తింపు పొందిన హౌజ్‌ఫుల్ సినిమాల్లో ఇది నాలుగో సినిమా. ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి కలెక్షన్ల వర్షాన్ని కురిపించాయి. తాజా సీక్వెల్లో అక్షయ్‌కుమార్‌తోపాటు బాబీడియోల్, రితేశ్ దేశ్‌ముఖ్, కృతీ సనన్, పూజా హెగ్డే, కృతి కర్బంద, దగ్గుబాటి రానా వంటి స్టార్ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి సందర్భంగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పట్ల విమర్శకులు పెదవి విరిచారు. ఈ కామెడీ సినిమా అంతగా నవ్వించేలా లేదని, హాస్యం కంటే అర్థంలేని వెర్రితనమే ఎక్కువగా ఉందని రివ్యూలు వచ్చాయి. అయినా, బాక్సాఫీస్ వద్ద అక్షయ్ సినిమా మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తోంది. తొలిరోజు రూ. 19.08 కోట్లు వసూలు చేసిన హౌజ్‌ఫుల్-4.. రెండోరోజు రూ. 18.81 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా రెండురోజుల్లో ఈ సినిమా 37.89 కోట్లు వసూలు చేసింది. దీపావళి పండుగ సీజన్లో ఈ స్థాయిలో వసూళ్లు రావడం గొప్ప విషయమేనని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో ఈ సినిమా నిలకడగా వసూళ్లు సాధిస్తే.. సూపర్‌హిట్ అయ్యే అవకాశముందని అంటున్నారు. -
3 సినిమాల ఫస్ట్ డే కలెక్షన్లు ఎంత?
ముంబై: ఈ దీపావళికి బాలీవుడ్ నుంచి మూడు సినిమాలు బరిలో నిలిచాయి. అక్షయ్‌కుమార్ ‘హౌస్‌ఫుల్ 4’, తాప్సి ‘శాండ్ కీ ఆంఖ్’, రాజ్‌కుమార్ రావు ‘మేడిన్ చైనా’ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. భారీ తారాగణంతో తెరకెక్కిన ‘హౌస్‌ఫుల్ 4’, అంచనాలకు తగినట్టుగానే ఆరంభ వసూళ్లు రాబట్టింది. తొలిరోజు ఈ సినిమా రూ.19.08 కోట్లు వసూలు చేసింది. శని, ఆదివారాల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది. ప్రముఖ మహిళా షూటర్లు ప్రకాషి తోమర్, చంద్రో తోమర్ జీవిత కథ ఆధారంగా ‘శాండ్ కీ ఆంఖ్’ బాక్సాఫీస్ వద్ద కాస్త నిదానంగా వసూళ్లు రాబడుతోంది. తాప్సి పొన్ను, భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మొదటి రోజు దాదాపు రూ. 4.5 కోట్లు కలెక్షన్లు తెచ్చుకుంది. విలక్షణ నటుడు రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించిన ‘మేడిన్ చైనా’ తొలి రోజు సుమారు రూ. 3 కోట్లు రాబట్టింది. సీనియర్ నటులు పరాశ్ రావల్, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించారు. విభిన్న కథలతో తెరకెక్కిన ఈ మూడు సినిమాల్లో ప్రేక్షకులు వేటిని ఆదరిస్తారో చూడాలి. -
మీటూ మార్పు తెచ్చింది
‘‘మీటూ’ ఉద్యమం జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ఒక నటిగా, స్త్రీగా నా అభిప్రాయమేంటంటే.. ఈ ఉద్యమాన్ని తేలికగా తీసుకోకూడదు. ‘మీటూ’ వల్ల చిత్ర పరిశ్రమలో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరమైనది కూడా. బయటకు వచ్చి ఈ విషయాలను చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. బాధితులందరి ధైర్యాన్ని అభినందిస్తున్నాను’’ అని ‘మీటూ’ మూమెంట్ గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు పూజా హెగ్డే. ప్రస్తుతం ‘హౌస్‌ఫుల్ 4’ ప్రమోషన్లో ఫుల్ బిజీగా ఉన్నారు పూజా. అక్షయ్‌కుమార్, సన్నీ డియోల్, పూజా హెగ్డే, రానా, కృతీ సనన్, కృతీ కర్భందా ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ఇది. ముందుగా ఈ చిత్రానికి సాజిద్ ఖాన్ దర్శకుడు. దాదాపు 70 శాతం సినిమాని కూడా పూర్తి చేశారు. అయితే ‘హౌస్‌ఫుల్ 4’ చిత్రీకరణలో ఉండగానే, ఆయన మీద ‘మీటూ’ ఆరోపణలు రావడంతో దర్శకుడిగా తప్పించారు. ఆ విషయం గురించి పూజా మాట్లాడుతూ – ‘‘సినిమా జరుగుతున్న సమయంలో దర్శకుడిని తప్పించడమంటే సినిమాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ నిర్మాణ సంస్థ ఆ ఇబ్బంది ఏం తెలియనివ్వలేదు. ఈ చిత్ర కథా రచయిత ఫర్హాద్ సమ్‌జీను దర్శకుడిగా నియమించింది’’ అని పేర్కొన్నారు. -
పశ్చాత్తాపం లేదు
‘మొహంజోదారో’ చిత్రంతో బీటౌన్‌లో అడుగుపెట్టారు ఇప్పటి టాలీవుడ్ బిజీ హీరోయిన్ పూజాహెగ్డే. కానీ, ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆమె నటించిన మరో సినిమా విడుదలకు దాదాపు మూడేళ్లు పట్టింది. తాజాగా అక్షయ్ కుమార్ ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాతో హిందీ తెరపై మెరవబోతున్నారీ బ్యూటీ. ‘మొహంజోదారో’ సినిమా విఫలం కావడం వల్లే బాలీవుడ్లో మీకు అవకాశాలు తగ్గాయా? అన్న ప్రశ్నను పూజా ముందు ఉంచితే...‘‘ఈ ప్రశ్న ఎదురైన ప్రతిసారీ చెబుతూనే ఉన్నాను. ఈ సినిమా చేసినందుకు పశ్చాత్తాపం లేదు. అప్పట్లో ఈ సినిమా చేయాలని నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఇప్పటికీ నమ్ముతున్నాను. నా తొలి హిందీ సినిమాలోనే హృతిక్‌రోషన్ వంటి స్టార్ హీరోతో కలిసి నటించినందుకు సంతోషంగా ఉంది. ఇక సినిమా ఫలితం అన్నది నటీనటుల చేతుల్లో ఉండదు. ప్రేక్షకులు నిర్ణయిస్తారు. నేను నటించిన ‘హౌస్‌ఫుల్ 4’ ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
అక్షయ్ కుమార్ ‘హౌస్‌ఫుల్ 4’ ట్రైలర్ లాంచ్
-
టైమింగ్ ముఖ్యం
‘పర్ఫెక్ట్ టైమింగ్‌లో కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోతే కామెడీ పండదు. కామెడీ పాత్రలు చేయడం అంత సులువేం కాదు’ అంటున్నారు కృతీసనన్. హిందీ చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’లో ఆమె పాత్రలో మంచి కామిక్ యాంగిల్ ఉందట. ఈ విషయం గురించి కృతీ చెబుతూ– ‘‘ఇవాళ్టి పరిస్థితుల్లో అందరి జీవితాల్లోనూ ఏదో రకమైన స్ట్రెస్ ఉంటోంది. అందుకే మా సినిమాలకు వచ్చే ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసి బాగా నవ్వించాలి. ఇప్పుడు నేను చేస్తున్న ‘హస్‌ఫుల్ 4, అర్జున్ పటియాలా’ చిత్రాల్లోని నా పాత్రలో మంచి కామిక్ యాంగిల్ ఉంది. మనలో ఎంత యాక్టింగ్ స్కిల్ ఉన్నప్పటికీ కామెడీ చేయడానికి మాత్రం టైమింగ్ చాలా ముఖ్యం. లొకేషన్లో అక్షయ్‌కుమార్, రితేష్ దేశ్‌ముఖ్‌ల కామెడీ టైమింగ్‌ను చూసి ఎంతో నేర్చుకున్నాను’’ అన్నారు కృతీ సనన్. -
గేమ్స్ ఆడొద్దు
షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేశారు ‘హౌస్‌ఫుల్ 4’ టీమ్. దర్శక ద్వయం ఫర్హాద్ సామ్జీ తెరకెక్కించిన చిత్రమిది. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, కృతీసనన్, కృతీ కర్భందా, బాబీ డియోల్, రానా, పూజా హెగ్డే కీలక పాత్రలు చేశారు. ‘‘హౌస్‌ఫుల్ 4 షూటింగ్ పూర్తయింది. ఇంత పెద్ద మల్టీస్టారర్‌లో నటిస్తానని ఊహించలేదు. మంచి క్వాలిటీస్ ఉన్న అక్షయ్ సార్‌తో కలిసి నటించడం ఫుల్ హ్యాపీ. ఆయనతో గేమ్స్ ఆడకండి. ఎందుకుంటే ఎక్కువ శాతం గెలుపు ఆయనదే అవుతుంది’’ అని పేర్కొన్నారు పూజా. ‘‘షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది థియేటర్స్‌లో కలుద్దాం’’ అన్నారు అక్షయ్. ఈ సినిమాకు తొలుత సాజిద్ ఖాన్ దర్శకుడిగా వ్యవహరించారు. కానీ ‘మీటూ’ ఆరోపణల వల్ల ఆయన తప్పుకున్నారు. అలాగే నానా పటేకర్ ప్లేస్‌లో రానా నటించారు. -
నానా పోయి రానా వచ్చె
బాలీవుడ్ కామెడీ మూవీ సిరీస్ ‘హౌస్‌ఫుల్’ టీమ్‌లోకి రానా జాయిన్ అయ్యారు. నానా పటేకర్ స్థానాన్ని ఈ హీరో భర్తీ చేశారు. నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసిన నేపథ్యంలో తన వల్ల చిత్రబృందానికి ఇబ్బంది కలగకూడదని నానా ‘హౌస్‌ఫుల్4 ’ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత నానా పటేకర్ స్థానంలోకి రానా వచ్చారు. మొదట ఈ పాత్రను అనిల్‌కపూర్ చేస్తారని వార్తలు వినిపించినా ఫైనల్‌గా రానా వచ్చారు. ఈ పాత్ర గురించి రానా మాట్లాడుతూ – ‘‘హౌస్‌ఫుల్’ లాంటి కామెడీ జానర్ సినిమాలో ఇప్పటి వరకూ నేను నటించలేదు. కొత్త కొత్త జానర్స్‌లో కనిపించడం నాకెప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది. హైదరాబాద్ బయటకు వచ్చి పని చేయడం కొత్తగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అని భావిస్తాను. అక్షయ్ కుమార్‌తో ఆల్రెడీ పని చేశాను. ఇప్పుడు ‘హౌస్‌ఫుల్ 4’లో అనుభవం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి’’ అని పేర్కొన్నారు. కేవలం నానా పటేకర్ మాత్రమే కాదు దర్శకుడు సాజిద్ ఖాన్ ప్లేస్‌లో ఫాహద్, సంజీ ద్వయం దర్శకులుగా వచ్చిన సంగతి తెలిసిందే. -
షూటింగ్ సమయంలో నన్ను వేధించారు!
ముంబై : అక్షయ్‌కుమార్ అప్‌కమింగ్ మూవీ హౌజ్‌ఫుల్-4 లైంగిక వేధింపుల ఆరోపణలతో నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. పదేళ్ల క్రితం నానా పటేకర్ తనను వేధించాడంటూ తనుశ్రీ దత్తా ఆరోపించడంతో అతడు సినిమా నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. తనుశ్రీ ఆరోపణలతో ‘మీటూ’ ఉద్యమం ఉధృతమైన నేపథ్యంలో.. సినిమా దర్శకుడు సాజిద్ ఖాన్‌పై కూడా వేధింపుల ఆరోపణలు రాగా అతడు కూడా దర్శకత్వ బాధ్యతల నుంచి వైదొలిగాడు. తాజాగా... హౌజ్‌ఫుల్-4 సినిమా షూటింగ్ సమయంలో కొంతమంది వ్యక్తులు తనపై లైంగిక దాడికి ప్రయత్నించారంటూ ఓ మహిళా జూనియర్ ఆర్టిస్టు ఆరోపించారు. హీరోలు అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్ సెట్లో ఉన్న సమయంలోనే తాను ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నానని చెప్పడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ వివాదంపై వివరణ ఇచ్చారు. సదరు జూనియర్ ఆర్టిస్టు స్నేహితుడికి(సినిమాతో సంబంధం లేని వ్యక్తి), డాన్స్‌మాస్టర్‌కు గొడవ జరిగింది వాస్తవమేనని.. అయితే ఆ సమయంలో అక్షయ్, రితేశ్ అక్కడ లేరని తెలిపాడు. వ్యక్తిగత విషయాల కారణంగా జరిగిన గొడవను సినిమా యూనిట్‌కు ఆపాదించాలని ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. గొడవ జరిగిన సమయంలో తన అసిస్టెంట్ అక్కడే ఉన్నారని.. జూనియర్ ఆర్టిస్టు చెబుతున్నట్లుగా ఆమెను ఎవరూ లైంగిక వేధించలేదని తనతో చెప్పారని పేర్కొన్నాడు. ఇప్పటికే వివిధ కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతుంటే.. సంబంధంలేని విషయాల్లో కూడా ఇలా తమను ఇరికించడం సరికాదన్నారు. -
నానా ప్లేస్‌లో రానా
బాలీవుడ్ ఇండస్ట్రీలో మీటూ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ ఆరోపణల కారణంగా కొంత మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు తమకు తాముగా ప్రాజెక్ట్స్నుంచి తప్పుకుంటుండగా.. మరికొందరిని యూనిట్ సభ్యులే తొలగిస్తున్నారు. ముఖ్యంగా హౌస్‌ఫుల్ 4 సినిమా మీద ఈ ప్రభావం బాగా కనిపిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు నానా పటేకర్, దర్శకుడు సాజిద్ఖాన్లను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించటంతో కొత్తవారిని వెతికే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే దర్శకుడిగా ఫర్హాద్ సంజినీ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక నానా పటేకర్ స్థానంలో సౌత్ స్టార్ రానా దగ్గుబాటి నటించనున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న కాంబినేషన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
నిర్మాత శ్రేయస్సే ముఖ్యం
నటి తనుశ్రీ దత్తాను పదేళ్ల క్రితం లైంగికంగా వేధించారని నటుడు నానా పటేకర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘హస్‌ఫుల్ 4’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఆరోపణలు క్లియర్ అయ్యే వరకూ సినిమా షూటింగ్ నిలిపివేద్దాం అని హీరో అక్షయ్ కుమార్ టీమ్‌ని కోరిన సంగతి తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు సాజిద్ ఖాన్ మీద కూడా ఈ ఆరోపణలు రావడంతో దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారాయన. తాజాగా ఈ సినిమా నుంచి నానా పటేకర్ కూడా తప్పుకున్నారట. ‘‘అందరి సౌకర్యం ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు నానా పటేకర్. ఈ సినిమా నుంచి తప్పుకోవడమే సరైన స్టెప్. ఎవరైనా నిర్మాత శ్రేయస్సే కోరుకుంటారు. అందుకే.. నానా కూడా సినిమా నుంచి తప్పుకున్నారు’’ అని నానా తనయుడు మల్హర్ మీడియాతో చెప్పారు. ప్రస్తుతం నానా పటేకర్ స్థానంలో అనిల్ కపూర్ పేరుని పరిశీలిస్తున్నారట చిత్ర బృందం. -
‘హౌస్‌ఫుల్’పై మీటూ ఎఫెక్ట్
‘మీటూ’ ఉద్యమానికి సంబంధించి పది రోజులుగా యాక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, రైటర్స్, డైరెక్టర్స్, సింగర్స్‌లపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి సినీ కెరీర్‌పై ‘మీటూ’ ఉద్యమం ప్రభావం చూపిస్తున్నట్లుంది. మహిళలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సుభాష్ కపూర్‌తో కలిసి పని చేయలేనని చెప్పేశారు ఆమిర్‌ఖాన్. ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా ఇదే బాటలో నడుస్తానంటున్నారు. ‘హౌస్‌ఫుల్ 4’ షూటింగ్‌ను వెంటనే ఆపివేయాలని అక్షయ్ ఈ సినిమా నిర్మాత సాజిద్ నడియాడ్వాలాను కోరినట్లు బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ‘హౌస్‌ఫుల్ 4’ డైరెక్టర్ సాజిద్ ఖాన్, నటుడు నానా పటేకర్లపై ‘మీటూ’ ఆరోపణలు రావడమే ఇందుకు కారణమని బాలీవుడ్ టాక్. ‘‘విదేశాలు నుండి ఇంటికి తిరిగి రాగానే ‘మీటూ’ ఉద్యమానికి చెందిన కథనాలను చదివి కలత చెందాను. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులపై విచారణ జరగాలి. బాధితులకు సరైన న్యాయం జరగాలి. మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారితో కలిసి నటించాలని నేను అనుకోవడం లేదు’’ అన్నారు అక్షయ్ కుమార్. ‘హౌస్‌ఫుల్’ ఫ్రాంచైజీలో వస్తున్న నాలుగో పార్ట్ ‘హౌస్‌ఫుల్ 4’. ఇందులో అక్షయ్‌కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, పూజా హెగ్డే, కృతీ కర్భందా, కృతీసనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘‘మీటూ’ ఉద్యమంలో భిన్న రంగాల మహిళలు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పిన విషయాలు నన్ను ఆవేదనకు గురి చేశాయి. స్రీలు ఇలా తమ చేదు అనుభవాలను బయటపెట్టడానికి నిజంగా ధైర్యం కావాలి. వారి కథనాలను వినాలి కానీ జడ్జ్ చేయకూడదు. బాధిత స్త్రీలందరికీ నా మద్దతు తెలుపుతున్నా. అలాగే ‘హౌస్‌ఫుల్ 4’కు సంబంధించి అక్షయ్ కుమార్ నిర్ణయాన్ని నేనూ కట్టుబడి ఉండాలనుకుంటున్నా అన్నారు ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్న రితేష్ దేశ్‌ముఖ్. అలాగే హౌస్‌ఫుల్ 4 సినిమా నుంచి నానా పటేకర్ తప్పుకున్నారని బాలీవుడ్ టాక్. తన వల్ల ‘హౌస్‌ఫుల్ 4’ సినిమా టీమ్‌కు ఇబ్బంది కలగకూడదని నానా పటేకర్ ఫీల్ అయ్యారని హిందీ చిత్రపరిశ్రమలో తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు తన మీద వచ్చిన ఆరోపణలకు సాజిద్ ఖాన్ స్పందించారు. నైతిక బాధ్యత వహిస్తున్నా ‘మీటూ’ ఉద్యమంలో నాపై వచ్చిన ఆరోపణల కారణంగా నా కుటుంబ సభ్యులు, నా నిర్మాతలు, నా సినిమాల్లోని హీరోల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాను. అందుకే ఈ ఆరోపణలకు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ, నిజం నిరూపితమయ్యే వరకు డైరెక్టర్ చైర్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నాను. అలాగే నా స్నేహితులకు, మీడియా వారికి ఒక విన్నపం. నిజం నిరూపించబడే వరకు దయచేసి నాపై వస్తున్న ఆరోపణలను పాపులర్ చేయకండి’’ అని ‘హౌస్‌ఫుల్ 4’ దర్శకుడు సాజిద్ ఖాన్ అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ నిర్ణయాల పట్ల నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ‘‘అక్షయ్ కుమార్‌కు సెల్యూట్. మీటూ ఉద్యమంలో భాగంగా అక్షయ్ లాగే చాలా మంది స్పందించి మహిళలకు సమానత్వం, గౌరవం అనే అంశాల్లో అండగా నిలుస్తారని ఆశిస్తున్నాను. అప్పుడు మహిళలు ఇండస్ట్రీలో సంతోషంగా పనిచేసే వాతావరణం ఏర్పడుతుంది’’ అని కన్నడ కథానాయిక పరుల్ యాదవ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పక్కదారి పట్టకూడదు తాజాగా ఈ విషయంపై కమల్‌హాసన్ స్పందించారు. ‘‘మీటూ’ ఉద్యమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు పెదవి విప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమం నిజాయతీగా సక్రమమైన మార్గంలో వెళితే మంచి మార్పు వస్తుంది. కానీ ఇది పక్కదారి పట్టకూడదు. తప్పుడు ఆరోపణలు తెరపైకి రాకూడదు. నిజం ఉన్నప్పుడు ‘మీటూ’ ఉద్యమం తప్పుకాదు. సమాజంలో మహిళల సమస్యలను అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కాదు పురాణాల కాలం నుంచే మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారు’’ అని కమల్ పేర్కొన్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న ‘మీటూ’ కథనాలు నన్ను బాధించాయి. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. తాము ఎదుర్కొన్న భయంకరమైన సంఘటలను షేర్ చేసిన మహిళలందరికీ నేను మద్దతు తెలుపుతున్నాను. ఇప్పుడు మహిళలందరూ ఏకతాటిపైకి రావడం మంచి పరిణామంగా భావిస్తున్నాను. మీటూ గొంతు ఇప్పుడు జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. మాట్లాడాల్సిన సమయం ఇదే. మంచి మార్పుకు కూడా సరైన సమయం ఇదే. – రకుల్ ప్రీత్‌సింగ్ ‘మీటూ’ కథనాల వల్ల బాగా డిస్ట్రబ్ అయ్యాను. మహిళలకు సొసైటీలో గౌరవం, భద్రత ఉండాలి. అందుకు నేను, నా కంపెనీ కట్టుబడి ఉంటాం. మీటూ ఉద్యమ బాధితులకు నా మద్దతు ఉంటుంది. – అజయ్ దేవగన్ బయటకు వస్తున్న పేర్ల కంటే కూడా ఆ సంఘటనలు జరిగిన విధానం నన్ను ఎక్కువగా బాధిస్తున్నాయి. అలాగే ఇన్ని భయంకరమైన సంఘటనలు కూడా మంచు కొండలో కోన మాత్రమే అని అనుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశారు. – తాప్సీ మా కుటుంబానికి చాలా విషాదకరమైన సమయం ఇది. ఇప్పుడు మేము కొన్ని సమస్యలను ఎదుర్కొనక తప్పదు. నా తమ్ముడు సాజిద్ ఖాన్‌పై వచ్చిన ఆరోపణలు ఒకవేళ నిజమే అయితే ఆ బాధిత మహిళలకు ఒక మహిళగా నా సపోర్ట్ ఉంటుంది – ఫరా ఖాన్ కథానాయికలు రిచా చద్దా, కృతీ సనన్, ఫరాఖాన్, చిత్రాంగద సింగ్‌లతో పాటు మరికొందరు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ‘మీటూ’ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. - -
హౌజ్‌ఫుల్ 4 నుంచి నానా ఔట్..!
తనుశ్రీ దత్తా చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో గత కొంతకాలంగా వార్తల్లో నిలిచిన నానా పటేకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘హౌజ్‌ఫుల్ 4’ సినిమా నుంచి నుంచి వైదొలుగుతున్నట్టు శుక్రవారం ప్రకటించారు. ఈ సినిమా దర్శకుడు సాజిద్‌ఖాన్‌పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో.. ‘అత్యాచార, లైంగిక వేధింపుల ఆరోపణల్లో దోషులుగా తేలినవారితో తాను నటించను’ అని ‘హౌజ్‌ఫుల్ 4’ హీరో అక్షయ్‌కుమార్ సినిమా నిర్మాతల వద్ద చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు అక్షయ్ ట్వీట్ చేశారు. నిందితులపై విచారణ జరిగేవరకు సినిమా చిత్రీకరణకు తాత్కాలికంగా విరామం ఇవ్వాలని అక్షయ్ నిర్మాతలను కోరడంతో నానా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, తనపై వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు తేలేంతవరకు దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు సాజిద్‌ఖాన్ శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించారు. సహాయ దర్శకురాలు సలోని చోప్రా, నటి రేచల్, మరో నటి సాజిద్‌పై వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు సాజిద్ తెలిపారు. బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా లేవనెత్తిన లైంగిక వేధింపుల పర్వం భారత్‌లో #మీటు ఉద్యమానికి దారులు వేసిన సంగతి తెలిసిందే. పని ప్రదేశాల్లో తమకు ఎదురైన లైంగిక వేధింపులను ఎందరో మహిళలు సోషల్ మీడియా వేదికగా గళం విప్పుతున్నారు. -
తనుశ్రీ దత్తా వివాదం : అజ్ఞాతంలోకి నటుడు
తనుశ్రీ దత్తా, నానా పటేకర్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. నానా పటేకర్‌పై తనుశ్రీ చేసిన లైంగిక ఆరోపణలకు బాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరు మద్దతు ఇస్తున్నారు. ట్వింకిల్ ఖన్న, సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా. అర్జున్ కపూర్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, ఫర్హాన్ అక్తర్‌లు తనుశ్రీకి సపోర్టుగా నిలిచారు. ప్రస్తుతం హౌజ్‌ఫుల్ 4 లో నటిస్తున్న నానా పటేకర్ షూటింగ్ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ హౌజ్‌ఫుల్ 4 సినిమా సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులంతా గురువారం జైసల్మేర్ బయలుదేరి వెళ్లారు. అలా వెళ్లిన యూనిట్ సభ్యులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నానా పటేకర్ మిస్సయ్యారు. ఆయన ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎక్కడికి పోయారో తెలియదు, నానా పటేకర్ షూటింగ్ రానట్టు తెలిసింది. కనీసం చిత్ర యూనిట్‌కు కూడా ఆయన ఎక్కడికి వెళ్లారు చెప్పలేదు. దీంతో పటేకర్ సీన్లను తర్వాత షూట్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించిందని రిపోర్టులు తెలిపాయి. హౌజ్‌ఫుల్ 4 సినిమా షూటింగ్ సందర్భంగా జైసల్మేర్ బయలుదేరు వెళ్లు సమయంలో, నానా పటేకర్, కృతి సనూన్, పూజే హెగ్డేలతో కలిసి ఉన్న ఓ పిక్చర్‌ను ఫర్హాన్ అక్తర్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. అక్కడికి వెళ్లిన తర్వాత నానా పటేకర్ మిస్సయ్యారు. 2009లో వచ్చిన ‘హార్న్ ఒకే ప్లీజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలన్నీ నిరాధారనమైనవని, సెట్లో 50 నుంచి 100 మంది వ్యక్తులు ఉన్నారని చెప్పారు. ఎలాంటి లైంగిక ఆరోపణల గురించి ఆమె మాట్లాడుతుంది అంటూ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. కాగా, సాజిద్ ఖాన్ కామెడి సినిమా హౌజ్‌ఫుల్ 4లో నానా పటేకర్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. -
లండన్‌లో ఫన్
ముచ్చటగా ముగ్గురు హీరోయిన్లు కృతీ సనన్, పూజా హెగ్డే, కృతీ కర్భందా లండన్‌లో కలిశారు. హాలీడే సందర్భంగా కలవలేదు. అనుకోకుండా కలవలేదు. థియేటర్స్‌ను ఆడియన్స్‌తో హౌస్‌ఫుల్ చేసేందుకు ‘హౌస్‌ఫుల్ 4’ కోసం కలిశారు. హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో వస్తోన్న ఫోర్త్ ఫార్ట్ ‘హౌస్‌ఫుల్ 4’. ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్‌కు దర్శకత్వం వహించిన సాజిద్ ఖాన్నే ‘హౌస్‌ఫుల్ 4’ను తెరకెక్కిస్తున్నారు. థర్డ్ పార్ట్‌కు సాజిద్– ఫర్హాద్ ద్వయం దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అక్షయ్‌కుమార్, బాబీ డియోల్, రితేష్ దేశ్‌ముఖ్, పూజా హెగ్డే, కృతీసనన్, కృతీ కర్భందా ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం లండన్‌లో షూటింగ్ జరుగుతోంది. తొలుత సాంగ్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఫర్హా ఖాన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ బార్బర్ పాత్రలో కనిపించనున్నారు. సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
కి.. పోయి కృ.. వచ్చె
ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు హీరోయిన్ కృతీ కర్భందా. హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో రానున్న ఫోర్త్ పార్ట్ ‘హౌస్‌పుల్ 4’లో ఆమె ఒక కథానాయికగా నటించనుండటమే ఇందుకు కారణం. ఫస్ట్ అండ్ సెకండ్ హౌస్ఫుల్స్కు దర్శకత్వం వహించిన సాజిద్ ఖాన్నే ‘హౌస్‌ఫుల్ 4’ను డైరెక్ట్ చేయనున్నారు. థర్డ్ పార్ట్‌కు సాజిద్ సామ్జీ అండ్ ఫర్హాద్ సామ్జీ కలిసి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, పూజా హెగ్డే, చుంకీ పాండే ముఖ్య తారలుగా నటించనున్న ‘హౌస్‌ఫుల్ 4’ టీమ్‌లోకి తాజాగా కృతీ కర్భందా ఎంపికయ్యారు. అక్షయ్‌కుమార్ సరసన ఈమె కనిపించనున్నారట. ‘‘బాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కామెడీ ఫ్రాంచైజీస్‌లో హౌస్‌ఫుల్ ఒకటి. ఇంతమంది స్టార్స్ ఉన్న సినిమాలో నేనింత వరకు నటించలేదు. అలాగే ఇలాంటి డిఫరెంట్ స్టోరీ కూడా నేను వినలేదు. ఈ సినిమాలో భాగమైనందుకు హ్యాపీ’’ అని పేర్కొన్నారు కృతీ. నిజానికి కియారా అద్వానీని అనుకున్న ప్లేస్‌లో ఫైనల్‌గా కృతీ భాగమయ్యారని బీటౌన్ టాక్. కి పోయి కృ వచ్చె అన్నమాట. ఇదివరకు ‘బోణి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ నెక్ట్స్ ‘తీన్మార్, బ్రూస్ లీ’ లాంటి సినిమాలతో తెలుగు తెరపై మెరిశారు. -
భళి భళి భళి రా భళి...
... సాహోరే బాహుబలి.. పాట ఎంత బాగుంటుందో కదా. ‘బాహుబలి–2’లోని ఈ పాటను తెర మీద చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా ‘బాహుబలి’గా మారనున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ! ‘బాహుబలి’ బహు భాషల్లో విడుదలైంది కాబట్టి, హిందీలో రీమేక్ అయ్యే అవకాశం లేదు. మరి.. అక్షయ్‌కుమార్ ‘బాహుబలి’గా మారడం ఏంటి? అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే... అక్షయ్‌కుమార్ మెయిన్ లీడ్‌లో రూపొందిన ‘హౌస్‌ఫుల్’ చిత్రం గురించి తెలిసే ఉంటుంది. ఇప్పటివరకూ ఈ సినిమాకి సంబంధించిన మూడు భాగాలు వచ్చాయి. ఇప్పుడు ‘హౌస్‌ఫుల్ 4’ రూపొందనుంది. ఫస్ట్, సెకండ్ పార్ట్‌లకు దర్శకత్వం వహించిన సాజిద్ ఖాన్ నాలుగో భాగానికి దర్శకత్వం వహించనున్నారు. మూడో భాగం సాజిద్ ఫర్హాద్ దర్శకత్వంలో రూపొందింది. ‘హౌస్‌ఫుల్’ సిరీస్‌ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న సాజిద్ నడియాడ్వాలా ఫోర్త్ మూవీని త్వరలో ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ చిత్రం ప్రజెంట్, పాస్ట్.. రెండు నేపథ్యాలలో రూపొందనుంది. పాస్ట్ స్టోరీ ‘బాహుబలి’ కాలంలో ఉంటుంది. అక్షయ్‌కుమార్ గుర్రపు స్వారీ. కత్తి యుద్ధం చేస్తారట. ‘బాహుబలి’ తారలు ఎలాంటి కాస్ట్యూమ్స్ వాడారో అలాంటివే డిజైన్ చేయిస్తున్నారట. ఆ ఎపిసోడ్ మొత్తం ‘బాహుబలి’ని తలపించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకూ తమ సంస్థ నుంచి వచ్చిన అన్ని కామెడీ ఎంటర్టైనర్స్కన్నా సాజిద్ నడియాడ్వాలా ఈ ఎంటర్టైనర్ని ఎక్కువ బడ్జెట్లో తీయనున్నారు. మరి.. ‘బాహుబలి’లా అంటే.. హయ్యస్ట్ బడ్జెట్ అవకుండా ఉంటుందా? -
హౌస్‌ఫుల్ 4లో బ్రెట్ లీ..?
క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తరువాత నటుడిగా స్థిరపడే ప్రయత్నాల్లో ఉన్నాడు ఆస్ట్రేలియన్ బౌలర్ బ్రెట్ లీ. ఇప్పటికే మ్యూజిక్ వీడియోస్‌తో ఆకట్టుకున్న బ్రెట్ లీ, అన్ ఇండియన్ పేరుతో తెరకెక్కుతున్న ఇండో ఆస్ట్రేలియన్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇండియాలో పర్యటిస్తున్న బ్రెట్ లీకి మరో ఇంట్రస్టింగ్ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ సక్సెస్ ఫుల్ కామెడీ సీరీస్ హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో వస్తున్న నాలుగో భాగంలో బ్రెట్ లీని నటింప చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బ్రెట్ లీని కలిసిన నిర్మాత సాజిద్ నదియావాలా తమ సినిమాలో నటించాల్సిందిగా కోరారు. బ్రెట్ లీ మాత్రం హౌస్‌ఫుల్ 4కు తాను అంగీకరించేది, లేనిది ఇప్పట్లో చెప్పలేనంటూ దాటవేశాడు. అనుపమ్ శర్మ దర్శకత్వంలో బ్రెట్ లీ, తనీష్టా చటర్జీ, సుప్రియా పాటక్, గుల్షన్ గ్రోవర్లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న అన్ ఇండియన్ సినిమా ఆగస్టు 19న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ తరువాతే బ్రెట్ లీ చేయబోయే ఇతర ప్రాజెక్ట్‌ల విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు.