హౌస్ఫుల్ 4లో బ్రెట్ లీ..? | Brett Lee been approached for Housefull 4 | Sakshi
Sakshi News home page

హౌస్ఫుల్ 4లో బ్రెట్ లీ..?

Published Fri, Jul 29 2016 11:45 AM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

హౌస్ఫుల్ 4లో బ్రెట్ లీ..?

హౌస్ఫుల్ 4లో బ్రెట్ లీ..?

క్రికెట్కు గుడ్ బై చెప్పిన తరువాత నటుడిగా స్థిరపడే ప్రయత్నాల్లో ఉన్నాడు ఆస్ట్రేలియన్ బౌలర్ బ్రెట్ లీ. ఇప్పటికే మ్యూజిక్ వీడియోస్తో ఆకట్టుకున్న బ్రెట్ లీ, అన్ ఇండియన్ పేరుతో తెరకెక్కుతున్న ఇండో ఆస్ట్రేలియన్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇండియాలో పర్యటిస్తున్న బ్రెట్ లీకి మరో ఇంట్రస్టింగ్ ఆఫర్ వచ్చింది.

బాలీవుడ్ సక్సెస్ ఫుల్ కామెడీ సీరీస్ హౌస్ఫుల్ ఫ్రాంచైజీలో వస్తున్న నాలుగో భాగంలో బ్రెట్ లీని నటింప చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బ్రెట్ లీని కలిసిన నిర్మాత సాజిద్ నదియావాలా తమ సినిమాలో నటించాల్సిందిగా కోరారు. బ్రెట్ లీ మాత్రం హౌస్ఫుల్ 4కు తాను అంగీకరించేది, లేనిది ఇప్పట్లో చెప్పలేనంటూ దాటవేశాడు.

అనుపమ్ శర్మ దర్శకత్వంలో బ్రెట్ లీ, తనీష్టా చటర్జీ, సుప్రియా పాటక్, గుల్షన్ గ్రోవర్లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న అన్ ఇండియన్ సినిమా ఆగస్టు 19న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ తరువాతే బ్రెట్ లీ చేయబోయే ఇతర ప్రాజెక్ట్ల విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement