UnIndian
-
'ఇది నా సెకండ్ ఇన్నింగ్స్'
ముంబై: తనకు క్రికెట్‌పై ఉన్న అభిమానం ఇప్పటికీ అలానే ఉందని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ స్పష్టం చేశాడు. చాలాకాలం క్రికెట్ ఆడిన తనకు ఆ గేమ్‌తో ఉన్న బంధం విడదీయరానిదిగా పేర్కొన్నాడు. అయితే క్రికెటర్‌గా విరామం తీసుకున్న తరువాత సినిమాల్లో నటించే అవకాశం దక్కడం తన జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ గా అభివర్ణించాడు. దీనిలో భాగంగా టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లిపై బ్రెట్ లీ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం విరాట్ అత్యుత్తమ క్రికెటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. అతని దూకుడు నిజంగా అద్భుతమని కొనియాడాడు. 'అన్ ఇండియన్' పేరుతో తెరకెక్కుతున్న ఇండో- ఆస్ట్రేలియన్ సినిమాలో హీరోగా నటిస్తున్న బ్రెట్ లీ.. మూవీ ప్రమోషన్ కోసం భారత్ లో పర్యటిస్తున్నాడు. 'ఇదొక రొమాంటిక్ కామెడీ మూవీ. ఇందులో చాలా సన్నివేశాలు నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. కల్చరల్ రిలేషన్షిప్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది' అని బ్రెట్ లీ తెలిపాడు. తన సినిమా ఇన్నింగ్స్ ద్వారా ప్రజలకు అత్యంత వినోదాన్ని కల్గించాలని కోరుకుంటున్నట్లు ఈ మాజీ క్రికెటర్ పేర్కొన్నాడు. -
హౌస్‌ఫుల్ 4లో బ్రెట్ లీ..?
క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తరువాత నటుడిగా స్థిరపడే ప్రయత్నాల్లో ఉన్నాడు ఆస్ట్రేలియన్ బౌలర్ బ్రెట్ లీ. ఇప్పటికే మ్యూజిక్ వీడియోస్‌తో ఆకట్టుకున్న బ్రెట్ లీ, అన్ ఇండియన్ పేరుతో తెరకెక్కుతున్న ఇండో ఆస్ట్రేలియన్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇండియాలో పర్యటిస్తున్న బ్రెట్ లీకి మరో ఇంట్రస్టింగ్ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ సక్సెస్ ఫుల్ కామెడీ సీరీస్ హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో వస్తున్న నాలుగో భాగంలో బ్రెట్ లీని నటింప చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బ్రెట్ లీని కలిసిన నిర్మాత సాజిద్ నదియావాలా తమ సినిమాలో నటించాల్సిందిగా కోరారు. బ్రెట్ లీ మాత్రం హౌస్‌ఫుల్ 4కు తాను అంగీకరించేది, లేనిది ఇప్పట్లో చెప్పలేనంటూ దాటవేశాడు. అనుపమ్ శర్మ దర్శకత్వంలో బ్రెట్ లీ, తనీష్టా చటర్జీ, సుప్రియా పాటక్, గుల్షన్ గ్రోవర్లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న అన్ ఇండియన్ సినిమా ఆగస్టు 19న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ తరువాతే బ్రెట్ లీ చేయబోయే ఇతర ప్రాజెక్ట్‌ల విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు. -
బాలీవుడ్ తెరపై బ్రెట్ లీ
ముంబై: ఫాస్ట్ బౌలింగ్ తో క్రికెటర్లను గడగడలాడించిన ఆస్ట్రేలియా బౌలర్ బ్రెట్ లీ ఓ రొమాంటిక్ కామెడి చిత్రానికి పచ్చ జెండా ఊపారు. 'అన్ ఇండియన్' చిత్రంలో బాలీవుడ్ తార తనీష్టా చటర్జీ సరసన బ్రెట్ లీ నటించనున్నారు. భారత, ఆసీస్ లు ఆస్ట్రేలియా ఇండియా ఫిల్మ్ ఫండ్ (ఏఐఎఫ్ఎఫ్) పేరుతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం అక్టోబర్ మాసంలో సిడ్నీలో ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని టోని అబాట్ భారత పర్యటన సందర్భంగా గురువారం ఈ ప్రకటన వెలువడింది. దేవేంద్ర గుప్తా, యతీందర్ గుప్తాలు నిర్మిస్తున్న అన్ ఇండియన్ చిత్రానికి అనుపమ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.