'ఇది నా సెకండ్ ఇన్నింగ్స్' | Virat Kohli the best cricketer at the moment says Brett Lee | Sakshi
Sakshi News home page

'ఇది నా సెకండ్ ఇన్నింగ్స్'

Published Fri, Jul 29 2016 3:43 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

'ఇది నా సెకండ్ ఇన్నింగ్స్'

'ఇది నా సెకండ్ ఇన్నింగ్స్'

ముంబై: తనకు క్రికెట్పై ఉన్న అభిమానం ఇప్పటికీ అలానే ఉందని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ స్పష్టం చేశాడు. చాలాకాలం క్రికెట్ ఆడిన తనకు ఆ గేమ్తో ఉన్న బంధం విడదీయరానిదిగా పేర్కొన్నాడు. అయితే క్రికెటర్గా విరామం తీసుకున్న తరువాత సినిమాల్లో నటించే అవకాశం దక్కడం తన జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ గా అభివర్ణించాడు. దీనిలో భాగంగా టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లిపై బ్రెట్ లీ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం విరాట్ అత్యుత్తమ క్రికెటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. అతని దూకుడు నిజంగా అద్భుతమని కొనియాడాడు. 

 

'అన్ ఇండియన్' పేరుతో తెరకెక్కుతున్న ఇండో- ఆస్ట్రేలియన్ సినిమాలో హీరోగా నటిస్తున్న బ్రెట్ లీ.. మూవీ ప్రమోషన్ కోసం భారత్ లో పర్యటిస్తున్నాడు.  'ఇదొక రొమాంటిక్ కామెడీ మూవీ. ఇందులో చాలా సన్నివేశాలు నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. కల్చరల్ రిలేషన్షిప్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది'  అని బ్రెట్ లీ తెలిపాడు. తన సినిమా ఇన్నింగ్స్ ద్వారా ప్రజలకు అత్యంత వినోదాన్ని కల్గించాలని కోరుకుంటున్నట్లు ఈ మాజీ క్రికెటర్ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement