హౌస్‌ఫుల్‌ 4 బాక్సాఫీస్‌ రిపోర్ట్‌.. | Akshay Kumars Latest Release Housefull 4 Has Done A Great Opening At The Box Office | Sakshi
Sakshi News home page

హౌస్‌ఫుల్‌ 4 బాక్సాఫీస్‌ రిపోర్ట్‌..

Published Mon, Oct 28 2019 5:33 PM | Last Updated on Mon, Oct 28 2019 5:35 PM

Akshay Kumars Latest Release Housefull 4 Has Done A Great Opening At The Box Office - Sakshi

ముంబై : బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ నటించిన హౌస్‌ఫుల్‌ 4 బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుతోంది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ మూడో రోజు దీపావళి సెలవుతో భారీ వసూళ్లు సాధించింది. వారాంతంలో మొత్తం రూ 53.22 కోట్లు రాబట్టి వసూళ్లపరంగా సూపర్‌ హిట్‌గా నిలిచింది. శుక్రవారం తొలిరోజు రూ 19.08 కోట్లు రాబట్టిన హౌస్‌ఫుల్‌ 4 శనివారం రూ 18.81 కోట్లు, ఆదివారం రూ 15.33 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్‌ వద్ద నిలకడగా వసూళ్ల జోరును కొనసాగిస్తోంది. అక్షయ్‌తో పాటు కృతి సనన్‌, బాబీ డియోల్‌, కృతి కర్బందా, రితీష్‌ దేశ్‌ముఖ్‌, పూజాహెగ్డేలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని సాజిద్‌ నదియాద్‌వాలా, ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించాయి. రానున్న రోజుల్లో హౌస్‌ఫుల్‌ మూవీ మెరుగైన వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement