![Akshay Kumar and team wrap up Housefull 4 - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/23/pooja.jpg.webp?itok=ThrwGh2E)
అక్షయ్ కుమార్,పూజా హెగ్డే
షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేశారు ‘హౌస్‌ఫుల్ 4’ టీమ్. దర్శక ద్వయం ఫర్హాద్ సామ్జీ తెరకెక్కించిన చిత్రమిది. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, కృతీసనన్, కృతీ కర్భందా, బాబీ డియోల్, రానా, పూజా హెగ్డే కీలక పాత్రలు చేశారు. ‘‘హౌస్‌ఫుల్ 4 షూటింగ్ పూర్తయింది. ఇంత పెద్ద మల్టీస్టారర్‌లో నటిస్తానని ఊహించలేదు. మంచి క్వాలిటీస్ ఉన్న అక్షయ్ సార్‌తో కలిసి నటించడం ఫుల్ హ్యాపీ. ఆయనతో గేమ్స్ ఆడకండి. ఎందుకుంటే ఎక్కువ శాతం గెలుపు ఆయనదే అవుతుంది’’ అని పేర్కొన్నారు పూజా. ‘‘షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది థియేటర్స్‌లో కలుద్దాం’’ అన్నారు అక్షయ్. ఈ సినిమాకు తొలుత సాజిద్ ఖాన్ దర్శకుడిగా వ్యవహరించారు. కానీ ‘మీటూ’ ఆరోపణల వల్ల ఆయన తప్పుకున్నారు. అలాగే నానా పటేకర్ ప్లేస్‌లో రానా నటించారు.
Comments
Please login to add a commentAdd a comment