
కృతీసనన్
‘పర్‌ఫెక్ట్ టైమింగ్‌లో కరెక్ట్ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వకపోతే కామెడీ పండదు. కామెడీ పాత్రలు చేయడం అంత సులువేం కాదు’ అంటున్నారు కృతీసనన్. హిందీ చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’లో ఆమె పాత్రలో మంచి కామిక్ యాంగిల్ ఉందట. ఈ విషయం గురించి కృతీ చెబుతూ– ‘‘ఇవాళ్టి పరిస్థితుల్లో అందరి జీవితాల్లోనూ ఏదో రకమైన స్ట్రెస్ ఉంటోంది. అందుకే మా సినిమాలకు వచ్చే ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసి బాగా నవ్వించాలి. ఇప్పుడు నేను చేస్తున్న ‘హస్‌ఫుల్ 4, అర్జున్ పటియాలా’ చిత్రాల్లోని నా పాత్రలో మంచి కామిక్ యాంగిల్ ఉంది. మనలో ఎంత యాక్టింగ్ స్కిల్ ఉన్నప్పటికీ కామెడీ చేయడానికి మాత్రం టైమింగ్ చాలా ముఖ్యం. లొకేషన్‌లో అక్షయ్‌కుమార్, రితేష్ దేశ్‌ముఖ్‌ల కామెడీ టైమింగ్‌ను చూసి ఎంతో నేర్చుకున్నాను’’ అన్నారు కృతీ సనన్.
Comments
Please login to add a commentAdd a comment