
తనుశ్రీ దత్తా చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో గత కొంతకాలంగా వార్తల్లో నిలిచిన నానా పటేకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘హౌజ్‌ఫుల్ 4’ సినిమా నుంచి నుంచి వైదొలుగుతున్నట్టు శుక్రవారం ప్రకటించారు. ఈ సినిమా దర్శకుడు సాజిద్‌ఖాన్‌పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో.. ‘అత్యాచార, లైంగిక వేధింపుల ఆరోపణల్లో దోషులుగా తేలినవారితో తాను నటించను’ అని ‘హౌజ్‌ఫుల్ 4’ హీరో అక్షయ్‌కుమార్ సినిమా నిర్మాతల వద్ద చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు అక్షయ్ ట్వీట్ చేశారు. నిందితులపై విచారణ జరిగేవరకు సినిమా చిత్రీకరణకు తాత్కాలికంగా విరామం ఇవ్వాలని అక్షయ్ నిర్మాతలను కోరడంతో నానా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కాగా, తనపై వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు తేలేంతవరకు దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు సాజిద్‌ఖాన్ శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించారు. సహాయ దర్శకురాలు సలోని చోప్రా, నటి రేచల్, మరో నటి సాజిద్‌పై వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు సాజిద్ తెలిపారు.
బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా లేవనెత్తిన లైంగిక వేధింపుల పర్వం భారత్‌లో #మీటు ఉద్యమానికి దారులు వేసిన సంగతి తెలిసిందే. పని ప్రదేశాల్లో తమకు ఎదురైన లైంగిక వేధింపులను ఎందరో మహిళలు సోషల్ మీడియా వేదికగా గళం విప్పుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment