సాక్షి, హైదరాబాద్: నేరం..ఈ ఏడాది రాష్ట్రంపై పడగ విప్పింది. ప్రశాంత జీవనాన్ని తన ఉనికితో ఉలికిపాటుకి గురిచేస్తూ మానవత్వాన్ని మృగ్యం చేసింది. మానవ సంబంధాల విలువల్ని తుంచు తూ వికృత చేష్టలతో మనిషంటే ఓ భరోసా అన్న నమ్మకాన్ని సడలించింది. అవినీతి కేసులు, వివాహేతర సంబంధాలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు, ఎన్‌కౌంటర్లు, హత్యలతో అన్ని రకాల నేరాలకూ రాష్ట్రం ఆలవాలమైంది. రాజధానిలో చోటుచేసుకు న్న కొన్ని నేరాలు దేశం దృష్టిని ఆకర్షించాయి.
వరుసగా వెలుగుచూసిన అత్యాచారాలు, హత్యలతో ఒక దశలో మహిళలు, చిన్నారుల రక్షణ సందేహం లో పడింది. ముఖ్యంగా ‘దిశ’కేసులో నిందితులు ఆమెను చంపిన తీరు..దేశవ్యాప్త ఉద్యమానికి దారి తీసింది. అదేరోజు వరంగల్‌లో మానస, అదేవారంలో ఆసిఫాబాద్‌లో ‘సమత’ అత్యాచారం అ నంతరం దారుణహత్యలకు గురయ్యారు. జూన్‌లో వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై లైంగికదాడి హత్య తో ప్రజలు కోపంతో రగిలిపోయారు. మరోవైపు యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హా జీపూర్‌లో శ్రీనివాసరెడ్డి.. ముగ్గురు మైనర్లపై అ త్యాచారం జరిపి, తన వ్యవసాయబావిలో పూడ్చి న ఘటన కలకలం రేపింది. ఈ ఏడాది జరిగిన నేరాలన్నింటినీ సింహావలోకనం చేసుకుంటే...
► కోస్టల్‌బ్యాంక్ డైరెక్టర్, ఎన్‌ఆర్‌ఐ, ప్రముఖ వ్యాపార వేత్త చిగురుపాటి జయరాం (55) జనవరి 31న హత్యకు గురయ్యారు. తెలంగాణలో హత్యచేసి మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్‌లో వదిలివేశారు. తెలంగాణకు కేసు బదిలీఅయ్యాక ప్ర ధాన నిందితుడు రాకేశ్‌రెడ్డి, అతని అ నుచరులను అరెస్టు చేశారు. సహకరిం చిన ఇద్దరు పోలీసులపై వేటుపడింది.
► డేటా చౌర్యం కేసులో మాదాపూర్‌లోని ఐటీ గ్రీడ్ కార్యాలయాన్ని మార్చి 8న పోలీస్ లు సీజ్ చేశారు. ఈ కేసు తెలంగా ణ, ఏపీలో సంచలనం సృష్టిం చింది. రెండు తెలుగు రా ష్ట్రాల రాజకీయ పార్టీల తో ముడిపడి ఉన్న కేసు దర్యాప్తునకు ప్రభుత్వం ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్ ఏర్పాటు చే సింది. దర్యాప్తు కొనసాగుతోంది.
► యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో సైకో శ్రీనివాస్ రెడ్డి ముగ్గు రు బాలికలను అపహరించి అత్యాచారం చేసి న విషయం ఏప్రిల్ 26న వెలుగుచూసింది. ఊరికి రవాణా సదుపాయం లేకపోవడంతో లిఫ్ట్ ఇస్తానని చెప్పి, బాలికలను తన వ్యవసా య బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేసి అక్కడే మృతదేహాల్ని పాతిపెట్టాడు.
► టీవీ9 యాజమాన్య బదిలీ విషయంలో పలు అడ్డంకులు సృష్టించిన కేసులో ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాశ్‌పై మే 9న పోలీసులు కేసు లు నమోదు చేశారు. టీవీ9 చానల్‌ను ఏబీసీఎల్ నుంచి అలందా మీడియాకు బదిలీ కా కుండా నటుడు శివాజీతో ప లు నకిలీ పత్రాలు సృష్టించారని రవిప్రకాశ్, శివాజీలపై కేసు నమోదైంది. ఈ కేసులో నిం దితులిద్దరూ పోలీసులకు చిక్కకుండా పరారవడం, అపుడప్పుడూ వీడియోలు విడుదల చేయడం సంచలనం రేపింది.
► హన్మకొండ కుమార్‌పల్లిలో తల్లిపక్కనే నిద్రపోతున్న 9 నెలల పసిపాపను ప్రవీణ్ అనే యువకుడు జూన్ 30న ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి, చంపేశాడు. పోలీసులు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు లో 48 రోజుల్లో నిందితుడి నేరం నిరూపిం చారు. అతనికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆపై దాన్ని హైకోర్టు జీవితఖైదుగా మార్చింది.
► కుమరంభీం జిల్లా సార్సాల అటవీ అధికారిణి అనితపై కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీటీ సీ సభ్యుడు కోనేరు కృష్ణారావు తన అనుచరులతో జూన్ 30న దాడి చేశారు.
► పోలీసు ఇన్‌ఫార్మర్ నెపంతో టీఆర్ ఎస్ ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టు లు జూలై9న అపహరించి కాల్చిచంపారు. కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బెస్తకొత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది.
► జూలై 10న ఏసీబీ దాడుల్లో కేశంపేట తహసీల్దార్ వి.లావణ్య వద్ద ఏకంగా రూ.93 లక్షల నగదు 40 తులాల బంగారం లభించింది.
► ఎంసెట్ పేపర్ లీకేజీలో సీఐడీ పోలీసులు జూలై 16న చార్జిషీటు దాఖలు చేశారు.
► భద్రాద్రి జిల్లా గుండాలలో జూలై 31న ఎన్‌కౌంటర్‌లో న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి లింగన్న మరణించాడు.
► ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య,కుటుంబ సమస్యల కారణంగా కోడెల హైదరాబాద్‌లోని సొంతింట్లో ఆగస్టు 16వ తేదీన ఉరేసుకుని మరణించారు.
► ఈఎస్‌ఐలోని ఐఎంఎస్ కుంభకోణంలో 700 కోట్ల మేరకు అవతవకలు ఆరోపణల నేపథ్యంలో ఆగస్టు 29న మాజీ డైరెక్టర్ దేవికారా ణి, మాజీ జేడీ పద్మలను ఏసీబీ అరెస్టు చేసిం ది. ఇప్పటిదాకా 21 మంది అరెస్టయ్యారు.
► హయత్‌నగర్‌లో..ప్రియుడు శశికుమార్ బ్లాక్‌మెయిలింగ్‌కు తలొగ్గిన కీర్తి అనే యువతి అక్టోబరు 28న తల్లి రజితను చంపి, శవాన్ని మాయం చేసిన ఘటన వెలుగుచూసింది.
► అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని భూవివాదంలో కూర సురేశ్ నవంబరు 4న పెట్రోల్ పోసి నిప్పంటించాడు. విజయారెడ్డి అక్కడికక్కడే మరణించగా, నిందితుడు సురేశ్, డ్రైవర్ గురునాథం, అ టెండర్ చంద్రయ్య తరువాత మరణించారు.
► కాచిగూడలో హంద్రీనీవా– ఎంఎంటీఎస్ రైళ్లు కాచిగూడలో నవంబరు 11న ఎదురెదురుగా ఢీకొన్నాయి. 8 మంది గాయపడ్డారు. లోకోపైలెట్ చంద్రశేఖర్ చికిత్స పొందుతూ మరణించాడు.
► ఆసిఫాబాద్ జిల్లాలో సమతపై ముగ్గురు టేకు చెక్కల స్మగ్లర్లు నవం బరు 24న లైంగికదాడి చేసి, కత్తితో గొంతుకోసి చంపారు. దీనిపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటైంది.
► రాష్ట్రంలో ఒకేరోజు వెటర్నరీ వైద్యురాలు దిశ, వరంగల్‌లో డిగ్రీ విద్యార్థిని మానసలు నవం బరు 27 అపహరణకు గురై అత్యాచారం అనంతరం హత్యకు గురయ్యారు.
► దిశ కేసులో నిందితులు నలుగురు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. డిసెంబరు 6న చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిందితు లు మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీ న్, చింతకుంట చెన్నకేశవులు పోలీసులపై దాడి చేసి, తుపాకులు లాక్కున్నారు. పోలీ సుల ఎదురుకాల్పుల్లో నలుగురు హతమయ్యారు. దీనిపై సిట్ విచారణ నడుస్తోంది.
ఆడ బిడ్డల ఆర్తనాదాలు
Published Sun, Dec 29 2019 5:57 AM | Last Updated on Sun, Dec 29 2019 5:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment