Kidnappings
-
Hyderabad: నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన వెబ్‌సిరీస్ చూసి.. కిడ్నాప్ చేసి..
సాక్షి, హైదరాబాద్: నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘మనీ హెయిస్ట్’ చూసి కిడ్నాప్‌లకు తెగబడి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ తప్పించుకుంటున్న ఓ ఘరానా నేరగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘరానా నిందితుడితోపాటు అతడి గ్యాంగ్‌ను ఆసిఫ్‌నగర్ పోలీసులు పట్టుకున్నట్లు కొత్వాల్ సీవీ ఆనంద్ వెల్లడించారు. మెహిదీపట్నంలోని భోజగుట్టకు చెందిన గుంజపోగు సురేశ్ 2011 నుంచి నేరాలు చేయడం మొదలెట్టాడు. ఇతడిపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో 14 చోరీ కేసులు నమోదయ్యాయి. 2019 డిసెంబర్లో జైలుకు వెళ్లి 2020 ఫిబ్రవరిలో బయటకు వచ్చాడు. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘మనీ హెయిస్ట్’వెబ్ సిరీస్ అతడిని ఆకర్షించింది. దీంతో అదే పంథాలో అపహరణలు చేసి బాధితుల నుంచి డబ్బు రాబట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ వ్యవహారంలో తనకు సహకరించడానికి భోజగుట్ట ప్రాంతానికే చెందిన ఎం.రోహిత్, ఐ.జగదీశ్, కె.కునాల్‌లతోపాటు జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన శ్వేతాచారిని ఏర్పాటు చేసుకున్నాడు. వీరికి ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు జీతాలు ఇచ్చేవాడు. తన స్నేహితుల ద్వారా పరిచయమైన వారి ఫోన్ నంబర్లు సంగ్రహించేవాడు. వారితో సంప్రదింపులు జరపడానికి ప్రత్యేకంగా ఫోన్, నంబర్ ఏర్పాటు చేసుకున్నాడు. శ్వేతాచారి ఫొటోను డీపీగా పెట్టి, ఆమెతోనే వాయిస్ మెసేజ్‌లు సందేశాలు పంపి టార్గెట్ చేసిన వ్యక్తుల్ని ముగ్గులోకి దించేవాడు. పగటిపూట ఆమెతో, రాత్రిళ్లు స్వయంగా చాటింగ్ చేసేవాడు. అడుగడుగునా జాగ్రత్తలు: ఓ దశలో డేటింగ్ కోసం కలుద్దామంటూ శ్వేతతో సందేశం పంపించి ఏదో ఒక చోటుకు బాధితులను రప్పించేవాడు. అక్కడకు వచ్చిన తర్వాత తన గ్యాంగ్‌తో కలసి కిడ్నాప్ చేసేవాడు. గుర్తుపట్టకుండా ఉండటానికి తమతోపాటు బాధితులకూ మాస్కులు, ఫేస్కవర్లు చేయించేవాడు. బాధితుడి ఫోన్ నుంచి కాల్స్ చేయడమో, అతడి నుంచి హాట్‌స్పాట్ తీసుకుని తన ఫోన్ ద్వారా వాట్సాప్ కాల్స్ చేసి బాధితుల కుటుంబాన్ని బెది రించేవాడు. డిమాండ్ చేసిన నగదును బాధితుడి ఖాతాలో వేయించి, బాధితుడితోనే ఏటీఎంల నుంచి డ్రా చేయించి డబ్బు తీసుకున్నాక అతడిని విడిచిపెట్టేవాడు. ఇలా 2021 నుంచి సంగారెడ్డి జిల్లా సదాశివపేట, హైదరాబాద్‌లోని లంగర్‌హౌ స్, జీడిమెట్ల, ఆసిఫ్‌నగర్, రాజేంద్రనగర్‌తోపాటు తెనాలి రూరల్‌లో ఆరు నేరాలకు పాల్పడ్డాడు. సురేశ్ ఒక్కోసారి బాధిత కుటుంబీకులను డబ్బులు తీసుకొని హైదరాబాద్‌లోని అవుటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)కిందకు రమ్మనేవాడు. కిందికి తాడు సహాయంతో డబ్బు సంచిని పైకి లాగి తీసుకునేవాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని ఈ నెల 5న కిడ్నాప్ చేసి, రూ.50 వేలు వసూలు చేశాక మరుసటిరోజు విడిచి పెట్టాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఆసిఫ్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తన కోసం గాలిస్తున్నారనే విషయం తెలుసుకున్న సురేశ్ తన కారును కర్నూలులో రిపేరుకు ఇచ్చి ఆ షెడ్ యజమాని నుంచి తాత్కాలికంగా మరో వాహనం తీసుకున్నాడు. ఇలా పది రోజులుగా సంచరిస్తున్న సురేశ్ హైదరాబాద్ చేరుకోగానే ఆసిఫ్‌నగర్ పోలీసులు పట్టుకున్నారు. సురేశ్ ముఠాను కూడా అదుపులోకి తీసుకున్నారు. శ్వేత కోసం గాలిస్తున్నారు. -
నేరాలు పెరిగాయ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నేరాలు పెరిగాయి. ‘ఆమె’పై అఘాయిత్యాలు అధికమయ్యాయి. పిల్లల పరిస్థితీ అంతే. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ)–2019 తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. హింసాత్మక ఘటనలు, హత్యలు, కిడ్నాప్‌లు, మహిళలపై అఘాయిత్యాలు రాష్ట్రంలో పెరిగినట్లు ఎన్సీఆర్బీ గుర్తించింది. ఈ నేరాల్లో ఉత్తర్‌ప్రదేశ్ తొలిస్థానంలో నిలిచింది. పిల్లలు, వృద్ధులపై అఘాయిత్యాలు, అవినీతి, ఆర్థిక నేరాలు కూడా 2018తో పోలిస్తే అధికంగానే నమోదయ్యాయి. జువనైల్ కేసుల విషయంలో మాత్రం తగ్గుదల కనిపించడం గమనార్హం. సైబర్ నేరాల్లోనూ పెరుగుదల నమోదవగా, వాటిల్లో కర్ణాటక దేశంలోనే టాప్‌గా నిలిచింది. 2018, 2019లో తెలంగాణలో నమోదైన ఆయా నేరాలు, దేశంలోని మొత్తం నేరాల్లో మన రాష్ట్రానివి ఎంత శాతమనే వివరాలతోపాటు అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రాలు ఈ విధంగా ఉన్నాయి... -
తప్పటడుగులు.. బంగారు భవిషత్తు ఛిద్రం
ఏడో తరగతి చదువుతున్న ఆ చిన్నారికి పాఠశాలకు వెళ్లే దారిలో ఓ స్టిక్కరింగ్ షాపు నిర్వాహకుడి(23)తో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో దగ్గరైన అతగాడితో కలిసి ఓ రోజు ఇంట్లో చెప్పకుండా పరారైంది. తండ్రి లేకపోవడంతో తల్లి బంధువులు, స్నేహితుల ఇళ్లన్నీ గాలించి చివరకు బందరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. పోలీసులు వారిని పట్టుకుని ఆ చిన్నారికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లి దగ్గరకు పంపారు. ఓ కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న బాలికకు సోషల్ మీడియాలో కాకినాడకు చెందిన ఓ 26 ఏళ్ల యువకునితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వీడియో చాటింగ్ ఆపై వీడియోలు, నగ్న చిత్రాలు పంపే వరకు వెళ్లింది. వీటిని అడ్డం పెట్టుకుని ఆ యువకుడు బ్లాక్మెయిల్ చేయడంతో.. ఇంట్లో దొంగతనం చేసి విలువైన వస్తువులు, డబ్బులు పంపేది. విషయం గ్రహించిన ఆ బాలిక తండ్రి నిలదీయడంతో అసలు విషయం బయటపెట్టింది. బందరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. కుటుంబ, సామాజిక పరిస్థితులు.. కొరవడిన తల్లి దండ్రుల పర్యవేక్షణ.. స్నేహితులు, సినిమాలు, స్మార్ట్ ఫోన్ ప్రభావంతో ఆకర్షణకు లోనై కొందరు టీనేజర్స్ బంగారు భవిష్యత్‌ను ఛిద్రం చేసుకుంటున్నారు. ప్రేమ పేరుతో జిల్లాలో నమోదవుతున్న అదృశ్యం, కిడ్నాప్ కేసులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సాక్షి, మచిలీపట్నం: జిల్లాలో గత కొన్నేళ్లుగా బాలికల అదృశ్యం, కిడ్నాప్ కేసులు పెరుగుతున్నాయి. వీటిలో 90 శాతానికి పైగా ప్రేమ పేరుతో ఆకర్షణకు లోనై అదృశ్యమవుతున్నట్టుగా విచారణలో తేలుతున్నాయి. ముఖ్యంగా వారిలో ఎక్కువగా 12–16 మధ్య వయస్సున్న వారే కావడం గమనార్హం. గడిచిన మూడేళ్లుగా ఈ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఇదీ కేసుల సరళి.. ►మహిళల మిస్సింగ్, బాలికల కిడ్నాప్ కేసులు గతేడాది 274 కేసులు నమోదైతే.. ఈ ఏడాది సెపె్టంబర్ 20 నాటికి 306 కేసులు నమోదయ్యాయి. ♦ప్రధానంగా కిడ్నాప్ కేసులు గతేడాది 94 నమోదైతే.. ఈ ఏడాది 88 కేసులు రిపోర్టయ్యాయి. ♦ఇక బాలికల అదృశ్యం కేసులు గతేడాది 180 నమోదైతే.. ఈ ఏడాది ఇప్పటికే 218 కేసులు నమోదయ్యాయి. ♦కిడ్నాప్ కేసులు నూజివీడు డివిజన్లో అత్యధికంగా నమోదైతే.. మిస్సింగ్ కేసులు గుడివాడలో రిపోర్టయ్యాయి. ♦కాగా ఈ మొత్తం కేసుల్లో 18–25 ఏళ్లలోపు యువతులు 130 మంది ఉంటే, 15–17 ఏళ్లలోపు వారు ఏకంగా 150 మంది ఉన్నారు. ఇక 15 ఏళ్లలో 25 మంది వరకు ఉన్నారు. 26–60 ఏళ్ల లోపు వయస్సు ఉన్న మహిళలు 70 మంది ఉన్నారు. 90 శాతం అవే కేసులు.. బాలికల అదృశ్యం. కిడ్నాప్ కేసుల్లో 90 శాతం ఆకర్షణ పేరుతో ప్రేమ మోజులో పడి ఇంట్లో నుంచి పరారైన ఘటనలే ఎక్కువగా ఉంటున్నాయి. తల్లిదండ్రులు టీనేజ్‌లో ఉన్న తమ పిల్లలపై నిఘా ఉంచాలి. వారి కదలిక లను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. – ఎం.రవీంద్రనాథ్‌బాబు, జిల్లా ఎస్పీ స్మార్ట్ఫోన్ల ప్రభావమే ఎక్కువ టీనేజ్‌లోకి వచ్చే చిన్నారులపై స్మార్ట్ ఫోన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. లాక్డౌన్ వల్ల స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. ఆన్లైన్ క్లాసుల వల్ల పిల్లలకు ప్రత్యేకంగా ఫోన్లు ఇవ్వాల్సిన పరిస్థితి. 13–18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువతీ, యువకుల కదిలకలు, పరిచయాలపై నిఘా ఉంచాలి. యాప్‌లకు లాక్పెట్టి ఓపెన్ చేస్తే మీకు అలర్ట్ వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. –డాక్టర్ బి. ప్రభురామ్, మానసిక వైద్య నిపుణుడు, జిల్లా ఆస్పత్రి, బందరు -
హత్యలు 80 రేప్‌లు 91 కిడ్నాప్‌లు 289
న్యూఢిల్లీ: 80 హత్యలు.. 91 అత్యాచారాలు... 289 కిడ్నాప్‌లు! ఒక్కరోజులో భారతదేశం మొత్తమ్మీద నమోదవుతున్న నేరాలు ఘోరాల సగటు ఇది. 2018లో దేశంలో జరిగిన నేరాలపై∙నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వార్షిక నివేదిక చెబుతున్న కఠోర వాస్తవం ఇది. 2018లో మొత్తమ్మీద నేరాల సంఖ్య సగటున 1.3 శాతం ఎక్కువైంది. అయితే ప్రతి లక్ష జనాభాకు నమోదైన కేసుల సంఖ్య మాత్రం 388.6 (2017) నుంచి 383.5(2018)కు తగ్గిందని ఎన్సీఆర్బీ తన నివేదికలో తెలిపింది. ఎక్కువైన వ్యవసాయ రంగం ఆత్మహత్యలు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారిలో గత ఏడాది సుమారు 10,349 మంది బలవన్మరణాలకు పాల్పడినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తెలిపింది. దేశం మొత్తమ్మీద వేర్వేరు కారణాల వల్ల సుమారు 1.34 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడగా.. ఇందులో వ్యవసాయ రంగంలో ఉన్న వారు 7.7 శాతం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2017 సంవత్సరం నాటి రైతుల ఆత్మహత్యలతో పోల్చితే 2018లో ఆత్మహత్యలు 3.6 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ‘పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా, ఉత్తరాఖండ్, మేఘాలయా, గోవా, చండీగఢ్, దామన్ అండ్ దయ్యూ, ఢిల్లీ, లక్షద్వీప్, పుదుచ్చెరిలలో రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలుదారులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడలేదు’ అని ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. వ్యవసాయ కూలీఉలు మొత్తం 4,586 మంది ఆత్మహత్యలకు పాల్పడగా వీరిలో 4071 మంది పురుషులు, 515 మంది మహిళలు ఉన్నారు. అన్ని రకాల ఆత్మహత్యల్లో 17,972తో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది. తమిళనాడు (13,896), పశ్చిమబెంగాల్ (13,255) రాష్ట్రాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. వివాదాలతోనే ఎక్కువ హత్యలు 2018లో 29,017 హత్య కేసులు నమోదయ్యాయని, ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 1.7 శాతం ఎక్కువని నివేదిక తెలిపింది. వివాదాల కారణంగా జరిగిన హత్యలు 9,623 కాగా, వ్యక్తిగత ద్వేషం, పగ వంటి కారణాలతో 3,875 మంది హత్యకు గురయ్యారు. లాభం కోసం చేసిన హత్యల సంఖ్య 2,995. కిడ్నాపింగ్, ఎత్తుకెళ్లడం వంటి నేరాల సంఖ్య 2018లో ఎక్కువైంది. 2017లో మొత్తం 95,893 కిడ్నాప్ కేసులు నమోదు కాగా, 2018లో ఈ సంఖ్య 10.3 శాతం పెరిగి 1.05 లక్షలకు చేరింది. కిడ్నాపైన వారిలో 80 వేల కంటే ఎక్కువ మంది మహిళలు కాగా, పురుషుల సంఖ్య 24,665 మాత్రమే. అంతేకాదు.. కిడ్నాపైన మొత్తం 1.05 లక్షల మందిలో 63,356 మంది బాలబాలికలు కావడం గమనార్హం. కిడ్నాపైన వారిలో 92,137 మంది (22,755 మంది పురుషులు, 69, 382 మంది మహిళలు)ని పోలీసులు కిడ్నాప్ చెర నుంచి విడిపించగలిగారు. మొత్తం 91, 709 మందిని సజీవంగా వెనక్కు తీసుకు రాగలిగితే.. 428 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. -
ఆడ బిడ్డల ఆర్తనాదాలు
సాక్షి, హైదరాబాద్: నేరం..ఈ ఏడాది రాష్ట్రంపై పడగ విప్పింది. ప్రశాంత జీవనాన్ని తన ఉనికితో ఉలికిపాటుకి గురిచేస్తూ మానవత్వాన్ని మృగ్యం చేసింది. మానవ సంబంధాల విలువల్ని తుంచు తూ వికృత చేష్టలతో మనిషంటే ఓ భరోసా అన్న నమ్మకాన్ని సడలించింది. అవినీతి కేసులు, వివాహేతర సంబంధాలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు, ఎన్కౌంటర్లు, హత్యలతో అన్ని రకాల నేరాలకూ రాష్ట్రం ఆలవాలమైంది. రాజధానిలో చోటుచేసుకు న్న కొన్ని నేరాలు దేశం దృష్టిని ఆకర్షించాయి. వరుసగా వెలుగుచూసిన అత్యాచారాలు, హత్యలతో ఒక దశలో మహిళలు, చిన్నారుల రక్షణ సందేహం లో పడింది. ముఖ్యంగా ‘దిశ’కేసులో నిందితులు ఆమెను చంపిన తీరు..దేశవ్యాప్త ఉద్యమానికి దారి తీసింది. అదేరోజు వరంగల్‌లో మానస, అదేవారంలో ఆసిఫాబాద్‌లో ‘సమత’ అత్యాచారం అ నంతరం దారుణహత్యలకు గురయ్యారు. జూన్‌లో వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై లైంగికదాడి హత్య తో ప్రజలు కోపంతో రగిలిపోయారు. మరోవైపు యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హా జీపూర్లో శ్రీనివాసరెడ్డి.. ముగ్గురు మైనర్లపై అ త్యాచారం జరిపి, తన వ్యవసాయబావిలో పూడ్చి న ఘటన కలకలం రేపింది. ఈ ఏడాది జరిగిన నేరాలన్నింటినీ సింహావలోకనం చేసుకుంటే... ► కోస్టల్‌బ్యాంక్ డైరెక్టర్, ఎన్ఆర్ఐ, ప్రముఖ వ్యాపార వేత్త చిగురుపాటి జయరాం (55) జనవరి 31న హత్యకు గురయ్యారు. తెలంగాణలో హత్యచేసి మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్‌లో వదిలివేశారు. తెలంగాణకు కేసు బదిలీఅయ్యాక ప్ర ధాన నిందితుడు రాకేశ్‌రెడ్డి, అతని అ నుచరులను అరెస్టు చేశారు. సహకరిం చిన ఇద్దరు పోలీసులపై వేటుపడింది. ► డేటా చౌర్యం కేసులో మాదాపూర్‌లోని ఐటీ గ్రీడ్ కార్యాలయాన్ని మార్చి 8న పోలీస్ లు సీజ్ చేశారు. ఈ కేసు తెలంగా ణ, ఏపీలో సంచలనం సృష్టిం చింది. రెండు తెలుగు రా ష్ట్రాల రాజకీయ పార్టీల తో ముడిపడి ఉన్న కేసు దర్యాప్తునకు ప్రభుత్వం ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్ ఏర్పాటు చే సింది. దర్యాప్తు కొనసాగుతోంది. ► యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో సైకో శ్రీనివాస్ రెడ్డి ముగ్గు రు బాలికలను అపహరించి అత్యాచారం చేసి న విషయం ఏప్రిల్ 26న వెలుగుచూసింది. ఊరికి రవాణా సదుపాయం లేకపోవడంతో లిఫ్ట్ ఇస్తానని చెప్పి, బాలికలను తన వ్యవసా య బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేసి అక్కడే మృతదేహాల్ని పాతిపెట్టాడు. ► టీవీ9 యాజమాన్య బదిలీ విషయంలో పలు అడ్డంకులు సృష్టించిన కేసులో ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాశ్‌పై మే 9న పోలీసులు కేసు లు నమోదు చేశారు. టీవీ9 చానల్‌ను ఏబీసీఎల్ నుంచి అలందా మీడియాకు బదిలీ కా కుండా నటుడు శివాజీతో ప లు నకిలీ పత్రాలు సృష్టించారని రవిప్రకాశ్, శివాజీలపై కేసు నమోదైంది. ఈ కేసులో నిం దితులిద్దరూ పోలీసులకు చిక్కకుండా పరారవడం, అపుడప్పుడూ వీడియోలు విడుదల చేయడం సంచలనం రేపింది. ► హన్మకొండ కుమార్‌పల్లిలో తల్లిపక్కనే నిద్రపోతున్న 9 నెలల పసిపాపను ప్రవీణ్ అనే యువకుడు జూన్ 30న ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి, చంపేశాడు. పోలీసులు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు లో 48 రోజుల్లో నిందితుడి నేరం నిరూపిం చారు. అతనికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆపై దాన్ని హైకోర్టు జీవితఖైదుగా మార్చింది. ► కుమరంభీం జిల్లా సార్సాల అటవీ అధికారిణి అనితపై కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీటీ సీ సభ్యుడు కోనేరు కృష్ణారావు తన అనుచరులతో జూన్ 30న దాడి చేశారు. ► పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో టీఆర్ ఎస్ ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టు లు జూలై9న అపహరించి కాల్చిచంపారు. కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బెస్తకొత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ► జూలై 10న ఏసీబీ దాడుల్లో కేశంపేట తహసీల్దార్ వి.లావణ్య వద్ద ఏకంగా రూ.93 లక్షల నగదు 40 తులాల బంగారం లభించింది. ► ఎంసెట్ పేపర్ లీకేజీలో సీఐడీ పోలీసులు జూలై 16న చార్జిషీటు దాఖలు చేశారు. ► భద్రాద్రి జిల్లా గుండాలలో జూలై 31న ఎన్కౌంటర్లో న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి లింగన్న మరణించాడు. ► ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య,కుటుంబ సమస్యల కారణంగా కోడెల హైదరాబాద్‌లోని సొంతింట్లో ఆగస్టు 16వ తేదీన ఉరేసుకుని మరణించారు. ► ఈఎస్ఐలోని ఐఎంఎస్ కుంభకోణంలో 700 కోట్ల మేరకు అవతవకలు ఆరోపణల నేపథ్యంలో ఆగస్టు 29న మాజీ డైరెక్టర్ దేవికారా ణి, మాజీ జేడీ పద్మలను ఏసీబీ అరెస్టు చేసిం ది. ఇప్పటిదాకా 21 మంది అరెస్టయ్యారు. ► హయత్‌నగర్‌లో..ప్రియుడు శశికుమార్ బ్లాక్‌మెయిలింగ్‌కు తలొగ్గిన కీర్తి అనే యువతి అక్టోబరు 28న తల్లి రజితను చంపి, శవాన్ని మాయం చేసిన ఘటన వెలుగుచూసింది. ► అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని భూవివాదంలో కూర సురేశ్ నవంబరు 4న పెట్రోల్ పోసి నిప్పంటించాడు. విజయారెడ్డి అక్కడికక్కడే మరణించగా, నిందితుడు సురేశ్, డ్రైవర్ గురునాథం, అ టెండర్ చంద్రయ్య తరువాత మరణించారు. ► కాచిగూడలో హంద్రీనీవా– ఎంఎంటీఎస్ రైళ్లు కాచిగూడలో నవంబరు 11న ఎదురెదురుగా ఢీకొన్నాయి. 8 మంది గాయపడ్డారు. లోకోపైలెట్ చంద్రశేఖర్ చికిత్స పొందుతూ మరణించాడు. ► ఆసిఫాబాద్ జిల్లాలో సమతపై ముగ్గురు టేకు చెక్కల స్మగ్లర్లు నవం బరు 24న లైంగికదాడి చేసి, కత్తితో గొంతుకోసి చంపారు. దీనిపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ► రాష్ట్రంలో ఒకేరోజు వెటర్నరీ వైద్యురాలు దిశ, వరంగల్‌లో డిగ్రీ విద్యార్థిని మానసలు నవం బరు 27 అపహరణకు గురై అత్యాచారం అనంతరం హత్యకు గురయ్యారు. ► దిశ కేసులో నిందితులు నలుగురు ఎన్కౌంటర్లో మరణించారు. డిసెంబరు 6న చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో నిందితు లు మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీ న్, చింతకుంట చెన్నకేశవులు పోలీసులపై దాడి చేసి, తుపాకులు లాక్కున్నారు. పోలీ సుల ఎదురుకాల్పుల్లో నలుగురు హతమయ్యారు. దీనిపై సిట్ విచారణ నడుస్తోంది. -
219మంది అమ్మాయిలను ఎత్తుకెళ్తే ఏం చేశారు?
లండన్: ప్రపంచ నాయకులపై నోబెల్ శాంతి బహుమతి విజేత, అక్షర సాహసి మలాలా యూసఫ్‌జాయ్ అసహనం వ్యక్తం చేసింది. బోకోహారమ్ ఉగ్రవాదులు 219 మంది అమ్మాయిలను ఎత్తుకెళ్లిపోయి ఏడాది అవుతున్నా మీరంతా ఏం చేస్తున్నారని నైజీరియన్ నేతలను, ఇతర ప్రపంచ నేతలను నిలదీసింది. పాకిస్థాన్‌లో బాలికల విద్యకోసం ఉద్యమించి ఉగ్రవాదుల బుల్లెట్ దాడులనుంచి ప్రాణాలతో బయటపడిన మలాలా గతేడాది నోబెల్ శాంతిపురస్కారం దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రపంచంలో బాలికలు, మహిళలు ఎదుర్కొనే సమస్యలపై నిత్యం తాను స్పందిస్తూనే ఉంటానని చెప్పిన మలాలా.. బోకోహారమ్ ఘటన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రపంచ అగ్ర నేతలకు లండన్ నుంచి బహిరంగ లేఖ రాసింది. 'ఇప్పటివరకు మిమ్మల్ని రక్షించేందుకు నైజీరియాతో సహా ప్రపంచ నేతలు కూడా ప్రయత్నించలేదు. మీ సంకెళ్లు వీడలేదు. నాయకులు మిమ్మల్ని విడిపించేందుకు ఎంతో చేయాల్సి ఉంది. వారిపై ఒత్తిడి తెచ్చేవారిలో నేను ఒకదాన్ని. ధీరబాలికలారా మీరంతా ధైర్యంగా ఉండండి. మీపై నేను ఎంతో ప్రేమతో, సానుభూతితో ఉన్నాను' అని లేఖలో పేర్కొంది. అదే సమయంలో వారిని విడిపించేందుకు కృషిచేయాలని ప్రపంచ నేతలను కోరింది. గత ఏడాది నైజీరియా నుంచి 219 మంది పాఠశాల విద్యార్థినులను బోకోహారమ్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. -
రాజధాని... నేరాల గని
సాక్షి, సిటీబ్యూరో : వరుస దారుణాలతో రాజధాని నగరం హడలెత్తుతోంది. నిత్యం ఏదో ఒక చోట హత్యలు, లైంగికదాడులు, దోపిడీలు, కిడ్నాప్‌లు, చైన్‌స్నాచింగ్‌లు చోటు చేసుకుంటుండడంతో నగరజీవికి కంటి మీద కునుకు కరువవుతోంది. ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే క్షేమంగా ఇంటికి చేరతామా.. అన్న సంశయం ఆందోళనకు గురిచేస్తోంది. వీటికి తోడు సైబర్‌నేరాలు, బాలికలపై లైంగిక దాడులు, హత్యలు పోలీసులకే సవాలుగా నిలుస్తున్నాయి. ఆర్థిక నేరగాళ్ల ఉచ్చుల్లో చిక్కుకుంటున్న అభాగ్య జీవుల పరిస్థితి వర్ణనాతీతం. ఇన్ని అకృత్యాలు జరుగుతున్నా నగర పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమౌతున్నారు. చాలీచాలని సిబ్బంది శాంతిభద్రతల పరిరక్షణకు ఏమూలకూ సరిపోవడం లేదు. ఠాణాలు, సౌకర్యాల లేమి కూడా వారి పాలిట శాపంగా మారుతోంది. శాంతిభద్రతల తీరుపై జనాభా పెదవి విరుస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో దీనిపైనే ప్రధాన పార్టీల అభ్యర్థులను నిలదీయనున్నారు. జనాభాకు అనుగుణంగా లేని పోలీసులు హైదరాబాద్ నగరం దేశంలోని ఇతర నగరాలతో పోటీపడి మరీ అభివృద్ధి చెందింది. హైటెక్ హంగులతో మహానగరంగా ఎదిగింది. జనాభా కోటికి చేరువలో ఉంది. నేరాలూ అదే స్థాయిలో పెరిగాయి. కానీ శాంతిభద్రతలను పర్యవేక్షించే పోలీసు సిబ్బంది సంఖ్య మాత్రం పెరగలేదు. దేశ స్వాతంత్య్ర సమయం నాటి సిబ్బందైనా ప్రస్తుతానికి లేకపోవడం దారుణం. ఫలితంగా నేరాలు, ఘోరాలను కట్టడి చేయాల్సిన పోలీసు సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. మొత్తం పనిభారమంతా ఉన్న సిబ్బందిపైనే పడడంతో బాధితులకు సరైన సమయంలో న్యాయం చేయలేక సతమతమవుతున్నారు. ఫలితంగా సిబ్బంది, అధికారులు అనారోగ్యాలకు గురౌతున్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణకే ఉన్న పోలీసు సిబ్బంది సరిపోవటం లేదంటే.. రాజకీయ పార్టీల కార్యక్రమాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు, ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలకూ వీరినే వినియోగించాల్సి వస్తోంది. వీటన్నిటినీ పకడ్బందీగా ఎదుర్కోవాలంటే నగరంలో ఇప్పుడున్న పోలీసుల సంఖ్య ఏ కోశానా సరిపోదు. సిటీలో ప్రస్తుతం 8698 మంది పోలీసులే ఉన్నారు. అంటే సుమారు 900 మందికి ఒక పోలీసు చొప్పున ఉన్నారు. కోల్‌కతా, ముంబై, చెన్నై, బెంగుళూరు పట్టణాల్లో సుమారు 500 నుంచి 600 మందికి ఒక పోలీసు చొప్పున ఉన్నారు. 1947 జనాభాకు అనుగుణంగా కమిషనర్ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు వివిధ పోస్టులకు కేటాయించిన సిబ్బంది సంఖ్య 12,401 ఉండగా.. 8698 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. ఇంకా ఖాళీగా ఉన్న 3703 పోస్టులను నేటికీ కూడా భర్తీ చేయలేదు. ఈ పోస్టుల భర్తీతో పాటు పెరిగిన జనాభాకు అనుగుణంగా పోలీసు సిబ్బంది సంఖ్య ఇంకా సుమారు 12 వేలు పెరగాల్సి ఉంది. అంటే ఇతర పట్టణాలతో పోలిస్తే ప్రస్తుత జనాభాకు నగర పోలీసు సిబ్బంది సంఖ్య సుమారు 24 వేల మంది ఉండాలి. ఈ లెక్కన పరిశీలిస్తే ఇంకా 65 శాతం సిబ్బందిని పెంచాలి. అప్పుడే సిటీలో నేరాలను అదుపు చేయడం, బందోబస్తును చక్కగా నిర్వహించడం జరుగుతుంది. తద్వారా బాధితులకు సకాలంలో సరైన న్యాయం అందించవచ్చు. మహిళా పోలీసుల సంఖ్య మరీ దారుణం జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు అనుగుణంగా మహిళా పోలీసుల సంఖ్య లేదు. ప్రస్తుతం నగరంలో 511 మంది మహిళా పోలీసు సిబ్బంది (సీఐ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు) ఉండాలి. అయితే కేవలం 273 మాత్రమే ఉన్నారు. ఇంకా 238 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇదంతా 1947 జనాభా లెక్కల ప్రకారం. ఇక పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకుంటే మహిళా సిబ్బంది పోస్టుల సంఖ్య సుమారు 1300కి పెంచాల్సి ఉంది. -
అంతర్జిల్లా దొంగ అరెస్ట్
కేసముద్రం, న్యూస్‌లైన్ : జల్సాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి డబ్బు కోసం అనేక అడ్డదారులు తొక్కాడు. సులువుగా డబ్బు సంపాదించి సమాజంలో ఉన్నత హోదాలో జీవించాలనే ఆశతో నక్సలైట్ అవతారం ఎత్తి రాష్ర్టంలోని పలు జిల్లాల్లో కిడ్నాప్‌లు, దొంగతనాలకు పాల్పడి చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. ఈ మేరకు మానుకోట సీఐ వాసాల సతీష్, ఎసై ్స రంజిత్‌రావు బుధవారం నిందితుడి వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన వానపాకుల రాంబాబు(అలియాస్ ఆజాద్, బాబు) గతంలో అదే మండలంలోని మైనేని మోహన్‌తో తొలుత 9 మందితో ప్రజాసేవా దళాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మారుమూల గ్రామం నుంచి 2002లో ఆరు సింగిల్ ఫోర్ పిస్టళ్లను కొనుగోలు చేసి ఖమ్మం జిల్లా పాల్వచ పరిసర ప్రాంతాలైన బంగారుచెలుక, ఉల్వనూరు, రేగులగూడెం అటవీ ప్రాంతాల్లో దళ సభ్యులంతా కొద్ది రోజులుగా షూటింగ్‌పై శిక్షణ పొందారు. అనంతరం రాంబాబు పాల్వంచ ప్రాంతంలోని కేటీపీఎస్ కాంట్రాక్టర్ రమేష్‌ను బెదిరించి రూ.2 లక్షలు వసూలు చేశారు. టేకులపల్లిలోని ఓ క్వారీ యజమానిని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తుండగా అక్కడి పోలీసులు అరెస్టు చేసి 6 పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే కొన్ని నెలల పాటు జైలులో ఉండి బెయిల్‌పై వచ్చిన రాంబాబు అదే ఏడాది ఓ కాంట్రాక్టర్‌ను కిడ్నాప్ చేసి మళ్లీ పోలీసులకు చిక్కాడు. అనంతరం 2007లో పాల్వంచలోని కృషి బార్ షాప్ యజమాని రాంమోహన్‌రావును బెదిరించి రూ.లక్ష, 2008లో నర్సంపేటలోని రూపా పేపర్ బైండింగ్ ఓనర్ లింగస్వామివద్ద రూ.20 వేలు వసూలు చేశాడు. 2012లో ఖానాపురంలోని అగ్రహర్ కాలనీలో రాజు అనే వ్యక్తి ఇంట్లో ఉన్న ఎల్‌సీడీని, ఖమ్మం జిల్లాలోని మారెమ్మగుడిలో రూ.30 వేలతోపాటు, 2013 జూన్ 23న వెస్ట్ గోదావరి జిల్లాలోని గొల్లప్రోలు గ్రామానికి చెందిన గుండెపల్లి పోలీస్ అనే రైస్ మిల్లు వ్యాపారిని కొట్టి రూ.6.30 లక్షలను వసూలు చేసి పరారయ్యాడు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం బీహర్‌లో కొనుగోలు చేసిన ఎయిర్‌గన్‌ను చూపిస్తూ వరంగల్, ఖమ్మం, నల్లగొండ, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, కష్ణా జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లోని వ్యాపారులను, కిరాణం షాపు యజమానులను, క్వారీ ఓనర్లను బెదిరిస్తూ రూ.2వేల నుంచి మొదలుకుని లక్షల వరకు డిమాండ్ చేస్తూ వస్తున్నాడు. అలాగే పలు చోట్ల చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతూ దొంగతనాలు చేస్తూ వచ్చాడు. హత్య కేసులోనూ నిందితుడు.. పాల్వంచ గ్రామానికి చెందిన నాగేంద్రమ్మ అనే మహిళ ఖమ్మం శివారులో హోటల్ నడుపుతోంది. ఆమె తన అల్లుడైన చింతల సత్యనారాయణతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో పెద్దకొడుకు కృష్ణ వీరి వివాహేతర సంబంధానికి అడ్డుతగులుతూ వస్తున్నాడు. అయితే నాగేంద్రమ్మ హోటల్‌కు తరచూ వస్తున్న రాంబాబును వారు సంప్రదించి తమనుంచి కష్ణ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కృష్ణను చంపితే రూ.2లక్షలు ఇస్తామని నాగేంద్రమ్మ, సత్యనారాయణలు ఆశ చూపడంతో రాంబాబు దానికి సరేనన్నాడు. ఈ నేపథ్యంలో 2013 నవంబర్ 11న రాంబాబు.. కృష్ణకు మద్యం తాగించేందుకు బయటికి తీసుకెళ్లి బండరాయితో మోది హతమార్చాడు. కేసముద్రంలో చిక్కిందిలా.. రాంబాబు కేసముద్రం మండలంలోని తిమ్మంపేటకు చెందిన పిట్టల శ్రీనివాస్ అనే వ్యక్తితో కలిసి గతంలో పలు దొంగతనాలను పాల్పడ్డాడు. అయితే శ్రీనివాస్ అతడి నుంచి దూరంగా ఉండడంతో రాంబాబు ఒంటరిగా బెదిరింపులకు దిగుతూ దొంగతనాలు చేస్తున్నాడు. గత ఏడాది అక్టోబర్ 24 కేసముద్రం మార్కెట్ ఎదురుగా ఉన్న ఎలక్ట్రికల్ షాపులో కాపర్ వైరు దొంగిలించాడు. అనంతరం ఓ పల్లి వ్యాపారిని బెదిరించి రూ.14 వేలు, ఈ నెలలో తిమ్మంపేట గ్రామంలోని ఓ ఇటుక బట్టి వ్యాపారిని బెదిరించి రూ.2వేలు వసూలు చేశాడు. తోట పుల్లయ్య అనే పల్లి వ్యాపారిని కూడా ఎయిర్‌గన్‌తో బెదిరించి తనకు రూ.5 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. అయితే వ్యాపారులందరూ ఇస్తే తాను కూడా డబ్బులు ఇస్తానని చెప్పడంతో వెళ్లిపోయాడు. తర్వాత పసుపు వ్యాపారి రాజన్నను కూడా బెదిరించడంతో అతడు రూ.2వేలు ఇచ్చాడు. ఈ క్రమంలో గత జనవరి 30న సదరు వ్యాపారి రాంబాబు బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు రాంబాబు ఎదురుపడ్డాడు. అయితే రాంబాబును పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా చేతిలో ఉన్న ఎయిర్‌గన్‌ను చూపిస్తూ బెదిరించాడు. దీంతో కానిస్టేబుల్ మంగీలాల్ వెనకవైపు నుంచి వచ్చి అతడిని చాకచక్యంగా పట్టుకున్నాడు.