
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నేరాలు పెరిగాయి. ‘ఆమె’పై అఘాయిత్యాలు అధికమయ్యాయి. పిల్లల పరిస్థితీ అంతే. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ)–2019 తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. హింసాత్మక ఘటనలు, హత్యలు, కిడ్నాప్‌లు, మహిళలపై అఘాయిత్యాలు రాష్ట్రంలో పెరిగినట్లు ఎన్‌సీఆర్‌బీ గుర్తించింది. ఈ నేరాల్లో ఉత్తర్‌ప్రదేశ్ తొలిస్థానంలో నిలిచింది.
పిల్లలు, వృద్ధులపై అఘాయిత్యాలు, అవినీతి, ఆర్థిక నేరాలు కూడా 2018తో పోలిస్తే అధికంగానే నమోదయ్యాయి. జువనైల్ కేసుల విషయంలో మాత్రం తగ్గుదల కనిపించడం గమనార్హం. సైబర్ నేరాల్లోనూ పెరుగుదల నమోదవగా, వాటిల్లో కర్ణాటక దేశంలోనే టాప్‌గా నిలిచింది. 2018, 2019లో తెలంగాణలో నమోదైన ఆయా నేరాలు, దేశంలోని మొత్తం నేరాల్లో మన రాష్ట్రానివి ఎంత శాతమనే వివరాలతోపాటు అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రాలు ఈ విధంగా ఉన్నాయి...