Crimes against women
-
‘సత్వర న్యాయం’తోనే భద్రతపై భరోసా
న్యూఢిల్లీ: మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం లభించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వేగంగా న్యాయం చేకూర్చే పరిస్థితి ఉంటే భద్రత పట్ల మహిళలకు గొప్ప భరోసా దక్కుతుందని ఉద్ఘాటించారు. కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య, మహారాష్ట్రలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఢిల్లీలో శనివారం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జిల్లా న్యాయ వ్యవస్థపై ప్రారంభమైన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత రాజ్యాంగానికి దేశ న్యాయ వ్యవస్థను ఒక సంరక్షకురాలిగా పరిగణిస్తుంటామని చెప్పారు. సుప్రీంకోర్టుతోపాటు మొత్తం న్యాయ వ్యవస్థ ప్రజల అంచనాలకు తగ్గట్టుగా పని చేస్తే సమాజానికి మేలు జరుగుతుందని అన్నారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... క్రియాశీలకంగా మానిటరింగ్ కమిటీలు ‘‘దేశంలో మహిళలు, చిన్నారులపై వేధింపులు, నేరాలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. మహిళల భద్రత కోసం చట్టాల్లో కఠినమైన నిబంధనలు చేరుస్తున్నాం. 2019లో ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టుల పథకాన్ని ప్రారంభించాం. అడబిడ్డలపై జరిగే నేరాల విషయంలో తీర్పులు వేగంగా రావాలి. నేరగాళ్లకు శిక్షలు పడాలి. బాధితులకు సత్వర న్యాయం దక్కాలి. అలా జరిగితేనే జనాభాలో సగం మందికి వారి భద్రతపై ఒక భరోసా, నమ్మకం లభిస్తాయి. మహిళలపై నేరాలు అరికట్టే విషయంలో జిల్లా జడ్జి, మేజి్రస్టేట్, ఎస్పీతో కూడిన జిల్లా మానిటరింగ్ కమిటీల పాత్ర చాలా కీలకం. కింది కోర్టులే మొదటి మెట్టు దేశంలో రాజ్యాంగాన్ని, చట్టాల స్ఫూర్తిని న్యాయ వ్యవస్థ చక్కగా పరిరక్షిస్తోంది. సుప్రీంకోర్టు పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల దేశ ప్రజలు ఏనాడూ అపనమ్మకం వ్యక్తం చేయలేదు. న్యాయ వ్యవస్థపై వారికి ఎంతో విశ్వాసం ఉంది. దేశ న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థ ఒక బలమైన పునాది అనడంలో సందేహం లేదు. బాధితులకు న్యాయం చేకూర్చడంలో కింది కోర్టులే మొదటి మెట్టు. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాం. కోర్టులను ఆధునీకరిస్తున్నాం. పెండింగ్ కేసులను విశ్లేíÙంచడానికి, భవిష్యత్తులో రాబోయే కేసులను అంచనా వేయడానికి కృత్రిమ మేధ(ఏఐ), ఆప్టికల్ క్యారెక్టర్ రికగి్నషన్ వంటి నూతన సాంకేతికతలను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం’’ అని ప్రధానమంత్రి మోదీ ఉద్ఘాటించారు. భారత సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్మారక పోస్టల్ స్టాంప్, నాణేన్ని ఆవిష్కరించారు. బెయిల్ ఇవ్వడానికి అభ్యంతరమెందుకు: కపిల్ సిబల్ ఎలాంటి సంకోచాలు, పక్షపాతానికి తావులేకుండా తీర్పులు ఇచ్చేలా ట్రయల్ కోర్టులు, జిల్లా కోర్టులు, సెషన్స్ కోర్టులు బలోపేతం కావాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ చెప్పారు. క్షేత్రస్థాయిలోని కింది కోర్టులు ఒత్తిళ్లను తట్టుకొని స్థిరంగా నిలవకపోతే మొత్తం న్యాయ, రాజకీయ వ్యవస్థ సమగ్రత ప్రమా దంలో పడుతుందని అన్నారు. జిల్లా కోర్టులపై సదస్సులో ఆయన మాట్లాడుతూ... బెయిల్ ఒక నియమం, జైలు ఒక మినహాయింపు అంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును ప్రస్తావించారు. కీలకమైన కేసుల్లో నిందితులకు బెయిల్ ఇవ్వడానికి ట్రయల్ కోర్టులు, జిల్లా కోర్టులు నిరాకరిస్తున్నాయని ఆక్షేపించారు. తన వృత్తి జీవితంలో కింది కోర్టులు బెయిల్ ఇవ్వగా చూసిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇది కేవలం తన ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదని చెప్పారు. బెయిల్‌ను కింది కోర్టులు ఒక మినహాయింపుగా భావిస్తుండడంతో పై కోర్టులపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల చెప్పారని గుర్తుచేశారు. కింది కోర్టుల్లో బెయిల్ రాకపోవడంతో నిందితులు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని సూచించారు. జిల్లా కోర్టుల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని, న్యాయమూర్తుల వేతనా లు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కోర్టులే వెన్నెముక: జస్టిస్ చంద్రచూడ్ దేశంలో మొత్తం న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థ వెన్నుముక అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభివరి్ణంచారు. చట్టబద్ధ పాలనకు జిల్లా జ్యుడీíÙయరీ అత్యంత కీలకమని చెప్పారు. జిల్లా కోర్టులను కింది కోర్టులు అని పిలవడం ఆపేయాలని సూచించారు. జిల్లా కోర్టులపై జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లా న్యాయ వ్యవస్థలో కొన్నేళ్లుగా మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోందని అన్నారు. న్యాయాన్ని పొందడానికి ప్రజలకు మొదటి వేదిక జిల్లా కోర్టులేనని తెలిపారు. న్యాయ వ్యవస్థలో టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. 2023–24లో 46.48 కోట్ల పేజీల కోర్టు రికార్డులను డిజిటల్ రూపంలోకి మార్చామని వెల్లడించారు. 3,500 కోర్టు కాంప్లెక్స్‌లను, 22,000 కోర్టు రూమ్‌లను కంప్యూటరీకరించడానికి ఈ–కోర్టుల ప్రాజెక్టును ప్రారంభించినట్లు చెప్పారు. న్యాయమూర్తులపై ఒత్తిడి అధికంగా ఉంటుందని, వారు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. -
ఏపీలో నేరాలు తగ్గాయి: డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
గుంటూరు, సాక్షి: ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ మరింత సమర్థవంతంగా పనిచేసిందని.. ఫలితంగానే నేరాలు తగ్గాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP) రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గురువారం మంగళగిరి డీజీపీ కార్యాలయంలో ఇయర్ ఎండింగ్ ప్రెస్ మీట్ నిర్వహించి.. ఈ ఏడాది నమోదైన నేర గణాంకాల్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో నేరాల శాతం క్రమంగా తగ్గుతూ వస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హత్యలు తగ్గాయి. అలాగే దొంగతనాలు తగ్గాయి. టూ వీలర్ దొంగతనాలు తగ్గాయి. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గ్యాంగులను పట్టుకున్నాం. జిల్లా ఎస్పీ నుండి కానిస్టేబుల్, హోమ్ గార్డుల వరకూ తమ కర్తవ్యాన్ని సమర్థవతంగా నిర్వర్తించారు అని కిందిస్థాయి ఉద్యోగుల్ని అభినందించారాయన. రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించాం. బ్లాక్ స్పాట్స్ గుర్తించి నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలపై ప్రమాదాలు తగ్గేలా చేశాం. 7.83 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయి అని అన్నారాయన. మహిళలపై తీవ్ర నేరాలను భారీగా తగ్గించాం. మహిళలపై 168 మేజర్ కేసులను నేరుగా జిల్లా ఎస్పీలకు కేటాయించి పరిష్కరించాం. రేప్, పోక్సో, డౌరీ డెత్, మహిళా హత్యలపై జరిగిన నేరాలకు జీవిత ఖైదు శిక్షలు పడ్డ కేసులు 57.. 20ఏళ్లు శిక్ష పడిన కేసులు 49.. పదేళ్లు శిక్ష పడిన కేసులు 41.. ఏడేళ్లు శిక్ష పడినవి 15 కేసులు ఉన్నాయి. అలాగే.. వరకట్నం, పొక్సో కేసులు భారీగా తగ్గాయి. ఎస్సీ, ఎస్టీ కేసులు 15.2 శాతం తగ్గాయి లోక్ అదాలత్ లో 4,01,748 పెట్టీ కేసులు పరిష్కారం అయ్యాయి సైబర్ నేరాలు గణనీయంగా 25శాతం తగ్గాయి సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు చేయడం మంచి ఫలితాలనిచ్చింది ఎక్కువ సైబర్ నేరాలకు పాల్పడిన వారు రాజీకి వచ్చి క్షమాపణలు చెప్తున్నారు బ్యాంకుల సమన్వయంతో సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేస్తున్నాం యంగ్ ఆఫీసర్లకు సైబర్ నేరాల అరికట్టేందుకు అవసరమైన ట్రైనింగ్ ఇస్తున్నాం రౌడీ షీటర్స్ పై ఉక్కుపాదం మోపుతున్నాం మొత్తం 4 వేలమందిలో 1000 మంది జైల్లో ఉన్నారు ఈ ఏడాదిలోనే 900 మంది రౌడీషీటర్లు కన్విక్ట్ అయ్యారు 200 మందిపై పీడీ యాక్ట్ లు నమోదు చేశాం 10వేల ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం గంజాయి సాగు చేసేవారికి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం 2లక్షల 52వేల ఎకరాలను ట్రైబల్స్ కు అందించింది గంజాయి పెడలర్స్, స్మగ్లర్, కన్జ్యుమర్స్ ఎవరినీ వదిలి పెట్టట్లేదు ఈ మూడేళ్లలో 5లక్షల కేజీల సీజ్డ్ గంజాయిని ధ్వంసం చేశాం ఏపీలో మావోయిస్టుల కదలికలు కూడా తగ్గాయి క్రైమ్ గణాంకాలతో పాటు పోలీసుశాఖలో తీసుకున్న సంస్కరణలు, పోలీసు సంక్షేమం వంటి అంశాలపైనా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. -
మణిపూర్ కాదు.. మన సంగతేంది?
జైపూర్: మహిళలపై జరుగుతున్న అకృత్యాలకుగానూ.. సొంత ప్రభుత్వాన్ని, అదీ అసెంబ్లీ సాక్షిగా నిలదీసిన మంత్రికి గంటల వ్యవధిలోనే కేబినెట్ నుంచి ఉద్వాసన పలికింది రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం. శుక్రవారం ఈ పరిణామం చోటు చేసుకోగా.. ఆ నేత వ్యాఖ్యలతో ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. రెండున్నర నెలలుగా మణిపూర్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులు.. తాజాగా వెలుగులోకి వచ్చిన అకృత్యాలపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రంతో పాటు మణిపూర్ ప్రభుత్వం పైనా ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే.. అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించిన మంత్రి రాజేంద్ర సింగ్ గుధా.. రాజస్థాన్‌లో మహిళలపై జరుగుతున్న నేరాల కట్టడికి మన ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. ‘‘ఇక్కడ కఠిన వాస్తవం ఏంటంటే.. మన ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమవుతోంది. రాజస్థాన్‌లో మహిళలపై అకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. కాబట్టి.. మణిపూర్ అంశంపై దృష్టిసారించే బదులు ముందు నా సహచరులు ముందు మన సంగతి చూసుకోవడం ఉత్తమం’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. రాజస్థాన్ మినిమమ్ గ్యారెంటీ బిల్ 2023పై చర్చ సందర్భంగా గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖల మంత్రిగా ఉన్న గుధా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయ సంచలనానికి దారి తీయగా.. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించారు. రాజేంద్ర సింగ్ గుధాను మంత్రివర్గం నుంచి వెంటనే తొలగిస్తున్నట్లు రాజస్థాన్ రాజ్‌భవన్‌కు సిఫార్సు పంపగా.. గవర్నర్ కల్రాజ్ మిశ్రా దానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. గంట వ్యవధిలోనే ఈ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఇక ప్రతిపక్ష బీజేపీ రాజేంద్ర వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకుని.. కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తోంది. అంతకు ముందు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఆరంభానికి ముందు కూడా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లోనూ శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బ తింటున్నాయని, మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: మా దగ్గరా మణిపూర్‌లాంటి ఘటనే జరిగింది: బీజేపీ ఎంపీ -
మహిళలపై పెరుగుతున్న అరాచకాలు.. 2022లో 31వేల ఫిర్యాదులు
న్యూఢిల్లీ: మహిళలపై జరిగిన నేరాలు ఘోరాలకు సంబంధించి 2022లో దాదాపుగా 31 వేల ఫిర్యాదులు అందాయని జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. 2014 తర్వాత ఇవే అత్యధికమని తెలిపింది. 2021లో 30,864 ఫిర్యాదులు అందితే , తర్వాత ఏడాదికి స్వల్పంగా పెరిగి 30,957 ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల్లో ఎక్కువగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినవే ఉన్నాయని, 9,710 వరకు ఆ ఫిర్యాదులేనని గణాంకాలు వెల్లడించాయి. ఆ తర్వాత గృహ హింసకు సంబంధించి 6,970 కేసులు, వరకట్నం వేధింపులు 4,600 ఫిర్యాదులు అందాయి. ఇదీ చదవండి: సెల్ డ్రైవింగ్‌తో దేశవ్యాప్తంగా... ఏడాదిలో 1,040 మంది మృతి -
Hyderabad: మహిళలపై పెరుగుతున్న నేరాలు.. ఈ ఏడాదిలోనే ఎన్ని కేసులంటే!
సాక్షి, హైదరాబాద్: ‘మహిళల భద్రత, రక్షణే ప్రథమ కర్తవ్యం’ ఇదీ రాష్ట్ర పోలీసు యంత్రాంగం నినాదం. కానీ, ఇది ఆచరణలో ఆమడదూరంలో ఉంది. ఇంటా బయటా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎన్ని చట్టాలు, శిక్షలు అమలు చేస్తున్నా స్త్రీలకు భద్రత కరువైంది. గృహ హింస, అత్యాచారం, హత్యలు, వరకట్న మరణాలు, అపహరణలు ఇలా ఎన్నెన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఏటా మహిళలపై నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. గతేడాది గ్రేటర్లో మహిళలపై 7,459 నేరాలు జరగ్గా... ఈ ఏడాది 7,578 నేరాలు నమోదయ్యాయి. అన్ని రంగాల్లోనూ పురుషులతో పోటీ పడుతున్న ఈ రోజుల్లో కూడా స్త్రీలపై గృహ హింసలు, వేధింపులే జరగడం బాధాకరం. ఏటేటా ఈ తరహా కేసులు పెరుగుతుండటం గమనార్హం. గతేడాది హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్లలో కలిపి 4,674 వేధింపుల కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 4,891లకు పెరిగాయి. అయితే అత్యాచారాలు, పోక్సో కేసులు కాస్తా తగ్గుముఖం పట్టాయి. 2021లో 1,089 అత్యాచారాలు జరగ్గా.. ఈ ఏడాది 984లకు తగ్గాయి. అలాగే గతేడాది చిన్నారులపై 1,161 అఘాయిత్యాలు జరగగా.. ఈ ఏడాది 1,052 పోక్సో కేసులు నమోదయ్యాయి. తెలిసినోళ్లే తోడేళ్లు.. ఈ ఏడాది రాచకొండలో 372 అత్యాచారాలు జరగగా.. ఇందులో స్నేహితులు, కుటుంబ సభ్యులు రేప్ చేసిన సంఘటనలే ఎక్కువ. స్నేహితులు రేప్ చేసిన కేసులు 352 కాగా.. చుట్టుపక్కల వాళ్లు 4, కుటుంబ సభ్యులు 2 రేప్ కేసులున్నాయి. ఇతరుల చేసిన అత్యాచార కేసులు 14 ఉన్నాయని వార్షిక నివేదికలో వెల్లడైంది. సైబరాబాద్, హైదరాబాద్‌తో పోలిస్తే ఈ ఏడాది రాచకొండలో పోక్సో కేసులు ఎక్కువయ్యాయి. గతేడాది 394 పోక్సో కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 442కు పెరిగాయి. పోకిరీల భరతం.. విద్యా సంస్థలు, కార్యాలయాలు, బస్‌స్టాప్‌లు, రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రదేశాల్లో మహిళలను వేధిస్తున్న ఆకతాయిల భరతం పడుతుంది షీ టీమ్స్. ఈ ఏడాది 7,521 మంది పోకిరీలను మూడు కమిషనరేట్ల షీ టీమ్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆయా నిందితులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. రెండోసారి పోలీసులకు చిక్కిన ఆకతాయిలపై ఎఫ్ఐఆర్లు, పెట్టీ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది రాచకొండలో 176 మంది పోకీరీలపై ఎఫ్ఆర్లు, 195 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. అలాగే హైదరాబాద్‌లో 137 మందిపై ఎఫ్ఆర్లు, 426 మందిపై పెట్టీ కేసులు, సైబరాబాద్‌లో 82 మందిపై ఎఫ్ఆర్లు, 1,306 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. -
కన్నీటిని కన్నీటితోనే తుడవలేం! స్త్రీలపై జరిగే హింసకు వ్యతిరేకంగా పోరాడుదాం..
International Day for the Elimination of Violence against Women: ఒకరోజు వెనక్కి వెళితే... కేరళలోని ఎర్నాకుళంలో పర్వీన్ అనే లా స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. తన చేతిరాతతో కూడిన ఒక సూసైడ్ నోట్ సంఘటన స్థలంలో దొరికింది. భర్త, అత్తమామలు పెట్టే హింసను తట్టుకోలేక చనిపోతున్నానని రాసింది. రెండు రోజులు వెనక్కి వెళితే... కెన్యాలో అకియో అనే పేరుగల స్త్రీ హత్యకు గురైంది. చంపింది ఎవరో కాదు... భర్తే. అనుమాన పీడితుడైన భర్త అకియోను తరచు హింసించేవాడు. ఒకరోజు బాగా తాగి వచ్చి అందరూ చూస్తుండగానే భార్యను హత్య చేశాడు. కేరళ నుంచి కెన్యా వరకు, అమెరికా నుంచి చైనా వరకు...దేశాల మధ్య భౌగోళిక దూరాలు ఉండొచ్చుగానీ, స్త్రీలపై జరిగే హింస విషయంలో మాత్రం ఎలాంటి దూరాలు లేవు. ఇక్కడెంతో అక్కడంతే! అక్కడెంతో ఇక్కడ అంతే!! బాల్యవివాహాలు, వరకట్న వేధింపులు, వర్ణవివక్షతతో కూడిన హింస, లింగనిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యలు, పరువు హత్యలు... ఇలా వివిధ రూపాల్లో స్త్రీలపై జరిగే హింసను నిరోధించడానికి ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం స్త్రీ హింసా వ్యతిరేక దినం (నవంబర్ 25) సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది, ఈ సంవత్సరం ‘ఆరేంజ్ ది వరల్డ్: ఫండ్, రెస్పాండ్, ప్రివెంట్, కలెక్ట్’ గ్లోబల్ థీమ్‌తో నేటి నుంచి డిసెంబర్ 10 (మానవ హక్కుల దినోత్సవం) వరకు 16 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీటిలో ప్రపంచవ్యాప్తంగా 6000కు పైగా ఉమెన్ ఆర్గనైజేషన్స్, 180 దేశాల ప్రతినిధులు, మరెంతో మంది స్త్రీ ఉద్యమ కార్యకర్తలు పాల్గొంటారు. చదవండి: Winter Heart Attacks: అందుకే శీతాకాలంలో హార్ట్ అటాక్స్ అధికంగా సంభవిస్తాయి..! కన్నీటిని కన్నీటితోనే తుడవలేం...కార్యాచరణ కావాలి...ప్రణాళిక కావాలి. ఆచరణ వైపు వడివడిగా అడుగులు పడాలి. ఈ సమావేశాలు అలాంటి పనే చేస్తున్నాయి. లోకల్, కంట్రీ, గ్లోబల్ నేపథ్యంలో ఆలోచనలు, ఆచరణలను సమన్వయం చేస్తున్నాయి. ‘ఇదిగో మా దగ్గర ఇలా చేశాం. మీ దగ్గర మాత్రం ఎందుకు చేయరు’ అని ఒక సూచన ఇస్తాయి. హింసకు వ్యతిరేకంగా పోరాడే స్త్రీ యోధురాళ్ల ఉపన్యాసాలు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తాయి. ‘ఎక్కడో మహిళలపై జరిగే హింస గురించి మాట్లాడడానికి ముందు, మీ ఇంట్లో అలాంటి హింస జరగకుండా చర్యలు తీసుకోండి’ అని దేశ దేశాలకు ఉపదేశం ఇస్తాయి. కాలంతో పాటు హింసా రూపాలు మారుతున్నాయి. కొత్తగా ‘డిజిటల్ వయొలెన్స్’ వచ్చింది... ఇలాంటి ఎన్నో వికృతరూపాల గురించి ఈ సమావేశాలు లోతుగా చర్చిస్తాయి. నిర్మాణాత్మకమైన పరిష్కార మార్గాలు ఆలోచిస్తాయి. ‘ఎండ్ వయొలెన్స్ అగెనెస్ట్ ఉమెన్ నౌ’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదం ఇచ్చేలా చేస్తాయి. చదవండి: Octopus Unknown Facts: 9 మెదడులు, 3 గుండెలు.. ఐనా పాపం పిల్లలు పుట్టగానే మరణిస్తుంది!! -
తెలంగాణ: మహిళలపై నేరాలు జరిగే ప్రాంతాల గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రతకు కీలక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర పోలీసు విభాగం దానికోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగా అమలులోకి తీసుకువచ్చిన పోలీసు అంతర్గత యాప్ ‘షీ–టీమ్స్’లో కొత్త హంగులు చేర్చింది. యువతులు, మహిళలపై నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి జియోట్యాగింగ్ చేస్తోంది. ఈ మ్యాప్స్‌ను అప్లికేషన్లో ఉంచడం ద్వారా ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేక పర్యవేక్షణకు మార్గం సుగమమైంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఎక్కడైనా షీ–టీమ్స్ పనితీరు, స్పందన ఒకేలా ఉండేందుకు ఈ యాప్ వినియోగిస్తున్నారు. దీన్ని పోలీసు విభాగం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. నిఘా మూసధోరణిలో కాకుండా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 370 షీ–టీమ్స్ పనిచేస్తున్నాయి. ఈ బృందాలు మఫ్టీలో సంచరిస్తూ ఈవ్‌టీజర్లు, మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై నిఘా వేసి ఉంచుతున్నాయి. సాధారణంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో పాటు ఇతర పబ్లిక్ ప్లేసుల్లో ఈ బృందాలు సంచరిస్తుంటాయి. అన్ని వేళలా, అన్ని ప్రాంతాల్లోనూ ఉండటం సాధ్యం కాకపోవడంతో కొన్ని సందర్భాల్లో షీ–టీమ్స్ నిఘా మూస ధోరణిలో సాగుతోంది. ఉదాహరణకు హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కాలేజ్ బస్టాప్ వద్ద వీళ్లు ఎక్కువ నిఘా ఉంచితే... ముషీరాబాద్‌లో ఈవ్‌టీజింగ్ జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాలు, జిల్లాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే షీ–టీమ్స్ యాప్‌లో జియోట్యాగింగ్‌ను చేర్చారు. మ్యాప్‌పై ఆ ప్రాంతాలు ప్రత్యక్షం హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇలాంటి హాట్‌స్పాట్స్‌ను ఎప్పటికప్పుడు గుర్తిస్తుంటుంది. ఆయా ప్రాంతాల్లో నమోదైన కేసులు, వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా వీటిని గుర్తిస్తుంది. మ్యాప్‌పై ఆ వివరాలు పొందుపరుస్తూ జియోట్యాగింగ్ చేస్తుంది. రాష్ట్రంలోని అన్ని షీ–టీమ్స్ వద్ద ఈ యాప్ అందుబాటులో ఉంది. అందులోని మ్యాప్‌లో ఈవ్‌టీజింగ్ హాట్‌స్పాట్స్‌ను నిర్దేశిస్తుంటుంది. దీని ఆధారంగా ఆయా ప్రాంతాలను తెలుసుకునే సిబ్బంది వాటిపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. కాలమాన పరిస్థితులను బట్టి ఈ హాట్‌స్పాట్స్ మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఉమెన్ సేఫ్టీ వింగ్ ఈ మ్యాప్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ షీ–టీమ్స్‌ను సమాచారం అందేలా చేస్తుంటుంది. ఆ ఫిర్యాదులన్నీ ఈ యాప్‌లోకి.. ఈవ్‌టీజింగ్ తరహాలో మహిళలపై జరిగే నేరాలు, వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులనూ ఈ యాప్‌లోకి తీసుకువస్తున్నారు. షీ–టీమ్స్ కేంద్రాలు, భరోస కేంద్రాలు, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ వింగ్, సైబర్ క్రైమ్... ఇలా కేటగిరీల వారీగా మహిళలు, యువతులపై జరిగే నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు రాష్ట్రంలో ఎక్కడ వచ్చినా వాటిని షీ–టీమ్స్ యాప్‌లో పొందుపరుస్తారు. ఫిర్యాదులోని అంశాలను బట్టి ఆయా విభాగాలకు దీన్ని బదిలీ చేస్తారు. సదరు ఫిర్యాదుపై అధికారులు, సిబ్బంది స్పందించిన తీరు, సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలు, పరిష్కరించిన విధానాలను ఈ యాప్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. పోకిరీల వివరాలు, వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన ప్రాంతాలు, సమయం, తేదీలు ఇందులో నిక్షిప్తం అవుతాయి. వీటి ఆధారంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ పదేపదే ఈ తరహా నేరాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసుల నమోదుకు చర్యలు తీసుకుంటోంది. -
అత్యాచార భారతం
ముంబైలో మరో నిర్భయ, హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారి యూపీలో ఓ అబల, ఎంపీలో మరో నిస్సహాయురాలు ఎటు చూసినా మహిళల ఆక్రందనలే, వారి కన్నీటి కథలే గుండెల్ని పిండేస్తున్నాయి. కరోనా మహమ్మారి కాటేస్తున్న రోజుల్లోనూ కామాంధుల ఉన్మాదాలు ఆగలేదు. న్యూఢిల్లీ: 2020 సంవత్సరంలో మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలు, ఘోరాలతో పాటు దేశవ్యాప్తంగా నమోదైన నేరాలకు సంబంధించిన గణాంకాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) బుధవారం వెల్లడించింది. భారత్‌లో నేరాలు–2020 పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. గత ఏడాది మహిళలపై రోజుకి సగటున 77 అత్యాచారాలు జరిగాయి. దేశవ్యాప్తంగా 28,046 అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మహిళలపై జరిగిన వివిధ నేరాలకు సంబంధించి 3,71,503 కేసులు నమోదయ్యాయి. అయితే 2019 తో పోలిస్తే కొంతవరకు నేరాల సంఖ్య తగ్గింది. 2020లో మహిళలపై నేరాలు 8.3% తగ్గాయని నివేదిక వెల్లడించింది. 2019లో మహిళలపై నేరాల సంఖ్య 4,05,326 కాగా, 2018లో 3,78,236 కేసులు నమోదయ్యాయని ఎన్సీఆర్బీ గణాంకాలు వెల్లడించాయి. రాజస్తాలో మహిళలపై అత్యాచారాలు అధికంగా జరగగా.. ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నిలిచాయి. 2020లో కరోనా మహమ్మారి వణికించడం, నెలల తరబడి లాక్డౌన్ అమల్లో ఉండడంతో దొంగతనాలు, దోపిడీలు, మహిళలు, పిల్లలపై లైంగిక దాడులు వంటివి కాస్త తగ్గాయని ఎన్సీఆర్బీ అధికారిక గణంకాలు వెల్లడిస్తున్నాయి. కోవిడ్ నిబంధనలను యదేచ్ఛగా అతిక్రమించిన కేసులు గత ఏడాది అత్యధికంగా నమోదయ్యాయని ఎన్సీఆర్బీ ‘‘భారత్‌లో నేరాలు–2020’’ అన్న తన నివేదికలో పేర్కొంది. దేశంలో 28% పెరిగిన మొత్తం నేరాల సంఖ్య మొత్తం నేరాల సంఖ్య 2019లో 51,56,158 ఉండగా, 2020లో 28% పెరిగి 66,01,285కి చేరింది. అత్యధికంగా తమిళనాడులో 2019లో 4,55,094 కేసులు నమోదుకాగా, 2020లో 13,77,681కి నేరాల సంఖ్య చేరుకున్నాయి. దేశంలో రోజుకి సగటున 80 హత్యలు జరుగుతూ ఉంటే యూపీ టాప్‌లో ఉంది. దేశం మొత్తమ్మీద గత ఏడాది 29,193 హత్యలు జరిగితే యూపీలో 3,779 హత్యలు జరిగాయి. 2019తో పోల్చి చూస్తే హత్యలు ఒక్క శాతం పెరిగాయి. హత్యల్లో యూపీ తర్వాత స్థానంలో బిహార్ (3,150), మహారాష్ట్ర (2,163), మధ్యప్రదేశ్ (2,101) ఉన్నాయి. 11.8% పెరిగిన సైబర్ నేరాలు ఆన్లైన్లో జరిగే నేరాలు, ఘోరాలు పెరిగాయి. 2019తో పోలిస్తే 11.8% పెరుగుదల కనిపించింది. మొత్తంగా 50,035 కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లో 11,097 కేసులు నమోదు కాగా, కర్ణాటక (10,741), మహారాష్ట్ర (5,496), తెలంగాణ (5,024) తర్వాత స్థానాల్లో నిలిచాయి. నివేదికలో ఇతర అంశాలు ► మహిళలపై నేరాల్లో అత్యధికంగా భర్త, అత్తింటివారి క్రూరత్వానికి సంబంధించిన కేసులే ఎక్కువ. 1,11,549 కేసులు భర్త, బంధువుల క్రూరత్వానికి సంబంధించినవైతే, కిడ్నాప్ కేసులు 62,300 నమోద య్యాయి. లైంగిక దాడికి సంబంధించిన కేసులు 85,392 నమోదు కాగా, అత్యాచార యత్నం కేసులు 3,741 నమోదయ్యాయి. ఇక మహిళలపై గత ఏడాది 105 యాసిడ్ దాడులు జరిగాయి. 6,966 వరకట్నం మరణాలు సంభవించాయి. ► మధ్యప్రదేశ్ చిన్నారులకి ఏ మాత్రం రక్షణ కల్పించలేకపోతోంది. ఆ రాష్ట్రంలో పిల్లలపై 17,008 నేరాలు జరిగాయి. గిరిజన మహిళలపై అత్యాచార ఘటనల్లో కూడా 339తో మధ్యప్రదేశ్ టాప్‌లో ఉంది. ► 2019 సంవత్సరంతో పోల్చి చూస్తే ఎస్సీలపై నేరాల సంఖ్య 9.4% పెరిగితే, ఎస్టీలపై 9.3% పెరిగింది. ► పర్యావరణానికి సంబంధించిన నేరాల్లో ఈ ఏడాది 78% పెరుగుదల కనిపించింది. 2020లో దీనికి సంబంధించి 61,767 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరం 2019లో 34,676 కేసులు నమోదైనట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం (49,710 కేసులు), శబ్ద కాలుష్యం (7,318) కేసులు నమోదయ్యాయి. -
మమ్మీ.. ఆ అంకుల్ మంచోడు కాదు!
సాక్షి, హైదరాబాద్: చిన్నారులపై జరిగే లైంగికదాడుల్లో నిందితులు 99 శాతం తెలిసినవారే. ఈ విషయం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ)– 2019 రిపోర్టులో వెల్లడైంది. చిన్నారులను అసభ్యంగా తడమడం, లైంగికంగా వేధించడం, వారికి నీలిచిత్రాలు చూపించడం, లైంగికదాడికి పాల్పడటం, వారిని పెళ్లి, ప్రేమపేరుతో వంచించడం∙వంటి నేరాల్లో పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గతేడాది తెలంగాణలో పోక్సో యాక్ట్ సెక్షన్ 4, సెక్షన్ 6 కింద 1,180 కేసులు నమోదు కాగా.. మిగిలిన సెక్షన్లు కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 1,191గా ఉంది. మాటలతో మాయ చేసే మాయగాళ్ల చేతికి చిక్కుతున్నవారిలో టీనేజీ అమ్మాయిలే అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది వెలుగు చూసిన నేరాలను పరిశీలిస్తే.. ఇరుగింటి, పొరుగింటి వారు, వాచ్‌మన్, స్కూల్స్ డ్రైవర్లు, క్లీనర్లు, టీచర్లు, బంధువులే నిందితులు కావడం గమనార్హం. మొత్తం 1,180 నేరాలు నమోదు కాగా.. అందులో 1,177 మంది నిందితులు పైన పేర్కొన్నవారిలో ఎవరో ఒకరుగా తేలారు. నిందితుల్లో 664 మంది స్నేహితులు, 163 మంది కుటుంబసభ్యులు, మరో 350 మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారని పోలీసులు గుర్తించారు. వారిలో 99.7 శాతం తెలిసినవారే. 1,180 కేసుల్లో కేవలం ముగ్గురు మాత్రమే బాలికలకు తెలియనివారు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. తెలిసినవారే అధికం గతేడాది వెలుగు చూసిన నేరాలను పరిశీలిస్తే.. ఇరుగింటి, పొరుగింటి వారు, వాచ్‌మన్, స్కూల్స్ డ్రైవర్లు, క్లీనర్లు, టీచర్లు, బంధువులే నిందితులు కావడం గమనార్హం. మొత్తం 1,180 నేరాలు నమోదు కాగా.. అందులో 1,177 మంది నిందితులు పైన పేర్కొన్నవారిలో ఎవరో ఒకరుగా తేలారు. నిందితుల్లో 664 మంది స్నేహితులు, 163 మంది కుటుంబసభ్యులు, మరో 350 మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారని పోలీసులు గుర్తించారు. వారిలో 99.7 శాతం తెలిసినవారే. 1,180 కేసుల్లో కేవలం ముగ్గురు మాత్రమే బాలికలకు తెలియనివారు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. బాలికలపై జరిగిన అకృత్యాల వివరాలు మొత్తం నేరాలు: 1180 నిందితుల్లో తెలిసినవారు: 1177 కుటుంబ సభ్యులు: 163 అపరిచితులు: ముగ్గురు ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇరుగుపొరుగు, తదితరులు: 350 ప్రేమ– పెళ్లి పేరిట మోసం చేసినవారు: 664 తెలిసినవారి శాతం: 99.7 శాతం వయసుల వారీగా బాధితులు ఆరేళ్లలోపు బాలికలు: 26 ఆరు నుంచి 12 ఏళ్లలోపు బాలికలు: 75 12 నుంచి 16 ఏళ్లలోపు బాలికలు: 326 16 నుంచి 18 ఏళ్లలోపు బాలికలు: 764 మొత్తం బాధితులు: 1,191 -
నేరాలు పెరిగాయ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నేరాలు పెరిగాయి. ‘ఆమె’పై అఘాయిత్యాలు అధికమయ్యాయి. పిల్లల పరిస్థితీ అంతే. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ)–2019 తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. హింసాత్మక ఘటనలు, హత్యలు, కిడ్నాప్‌లు, మహిళలపై అఘాయిత్యాలు రాష్ట్రంలో పెరిగినట్లు ఎన్సీఆర్బీ గుర్తించింది. ఈ నేరాల్లో ఉత్తర్‌ప్రదేశ్ తొలిస్థానంలో నిలిచింది. పిల్లలు, వృద్ధులపై అఘాయిత్యాలు, అవినీతి, ఆర్థిక నేరాలు కూడా 2018తో పోలిస్తే అధికంగానే నమోదయ్యాయి. జువనైల్ కేసుల విషయంలో మాత్రం తగ్గుదల కనిపించడం గమనార్హం. సైబర్ నేరాల్లోనూ పెరుగుదల నమోదవగా, వాటిల్లో కర్ణాటక దేశంలోనే టాప్‌గా నిలిచింది. 2018, 2019లో తెలంగాణలో నమోదైన ఆయా నేరాలు, దేశంలోని మొత్తం నేరాల్లో మన రాష్ట్రానివి ఎంత శాతమనే వివరాలతోపాటు అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రాలు ఈ విధంగా ఉన్నాయి... -
మహిళలపై తరచు జరిగే తీవ్ర నేరాలు...సంబంధిత సెక్షన్లు
ఐపీసీ 304 బి: వరకట్న హత్యలను ఈ సెక్షన్ నేరంగా పరిగణిస్తుంది. వివాహం జరిగిన ఏడేళ్లలోగా ఒక మహిళ కాలిన గాయాలు లేదా శరీరంపై ఇతర గాయాల కారణంగా మరణించినట్లయితే, చట్టం వరకట్న హత్యగా పరిగణిస్తుంది. ఇలాంటి సంఘటనల్లో నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఐపీసీ 326 ఎ 326 బి: యాసిడ్ దాడుల సంఘటనల్లో నిందితులకు ఈ సెక్షన్ల కింద ఐదేళ్లకు తగ్గకుండా యావజ్జీవ శిక్ష వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. ఐపీసీ 354: బలప్రయోగం ద్వారా మహిళల గౌరవానికి భంగం కలిగించిన సంఘటనల్లో ఈ సెక్షన్ కింద ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. ఐపీసీ 354 ఎ: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే నిందితులకు ఏడాది వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ కలిపి కూడా విధించే అవకాశాలు ఉంటాయి. మహిళలను అసభ్యంగా తాకడం, అశ్లీల చిత్రాలను, దృశ్యాలను వారికి చూపడం, శృంగారం కోసం వేధించడం, మహిళలపై అశ్లీల వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలు ఈ సెక్షన్ కింద లైంగిక వేధింపులుగా పరిగణిస్తారు. ఐపీసీ 354 బి: బలవంతంగా మహిళల దుస్తులను తొలగించేందుకు ప్రయత్నించడం లేదా దుస్తులను విడిచిపెట్టేలా మహిళలను బలవంతపెట్టడం, దుస్తులను తొలగించే ఉద్దేశంతో మహిళలపై దాడి చేయడం ఈ సెక్షన్ కింద నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. ఐపీసీ 354 సి: మహిళలు ఏకాంతంగా దుస్తులు మార్చుకుంటుండగా లేదా స్నానం చేస్తుండగా చాటు నుంచి వారిని గమనించడం, రహస్యంగా లేదా అనుమతి లేకుండా, వారి ఏకాంతంలోకి జొరబడి వారి ఫొటోలు తీయడం, వీడియోలు తీయడం వంటి చర్యలను ఈ సెక్షన్ కింద నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. ఐపీసీ 354 డి: ఒక మహిళ తన నిరాసక్తతను, అయిష్టతను స్పష్టంగా తెలియజేసినా, ఆమెను అదేపనిగా వెంటాడటం, ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించడం, ఆమె సోషల్ మీడియా, ఇంటర్నెట్ కార్యకలాపాలను నిరంతరం గమనిస్తూ ఉండటం వంటి చర్యలను ఈ సెక్షన్ కింద నేరంగా పరిగణిస్తారు. మొదటిసారి ఈ నేరానికి పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. మరోసారి కూడా ఇదే నేరానికి పాల్పడితే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. ఐపీసీ 366: బలవంతపు పెళ్లి కోసం లేదా అనైతిక శృంగారం కోసం మహిళలను కిడ్నాప్ చేయడాన్ని ఈ సెక్షన్ కింద నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి పాల్పడిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. ఐపీసీ 366 ఎ: బలవంతపు శృంగారం కోసం లేదా మాయమాటలతో మభ్యపెట్టి శృంగారంలో పాల్గొనేలా చేయడం కోసం పద్దెనిమిదేళ్ల లోపు బాలికలను ఒక చోటి నుంచి మరో చోటుకు తరలించుకుపోవడాన్ని ఈ సెక్షన్ కింద నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి పదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. ఐపీసీ 366 బి: బలవంతపు శృంగారం కోసం లేదా అనైతిక శృంగారం కోసం విదేశాల నుంచి లేదా జమ్ము కశ్మీర్ నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల లోపు వయసున్న యువతులను భారతదేశంలోకి తీసుకు రావడం నేరం. దీనికి పదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటాయి. ఐపీసీ 372: పద్దెనిమిదేళ్ల లోపు వయసు బాలికలను వ్యభిచారం కోసం లేదా అనైతిక శృంగారం కోసం ఇతరులకు విక్రయించడం లేదా ఇతరుల వద్ద డబ్బు తీసుకుని మైనర్ బాలికలతో వ్యభిచారం చేయించడం వంటి చర్యలు నేరం. ఈ నేరానికి పాల్పడే వారికి పదేళ్ల వరకు జైలు, జరిమానా ఉంటాయి. ఐపీసీ 373: పద్దెనిమిదేళ్ల లోపు వయసు బాలికలను వ్యభిచారం కోసం లేదా అనైతిక శృంగారం కోసం కొనుగోలు చేయడం లేదా డబ్బు చెల్లించి వారిని వ్యభిచారం కోసం వాడుకోవడం వంటి చర్యలను ఈ సెక్షన్ కింద నేరాలుగా పరిగణిస్తారు. ఈ నేరానికి పాల్పడే వారికి పదేళ్ల వరకు జైలు, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. ఐపీసీ 375: ఒక మహిళ ఇష్టానికి విరుద్ధంగా, ఆమె అంగీకారం లేకుండా శృంగారం జరపడాన్ని ఈ సెక్షన్ అత్యాచారంగా పరిగణిస్తుంది. బెదించడం ద్వారా అంగీకారం పొంది శృంగారం జరిపినా, మత్తులో ఉన్నప్పుడు శృంగారం జరిపినా, మైనర్ బాలికను ఆమె అంగీకారంతోనే శృంగారం జరిపినా ఈ సెక్షన్ అత్యాచారంగానే పరిగణిస్తుంది. ఈ సెక్షన్ అత్యాచారానికి పూర్తి నిర్వచనమిస్తుంది. ఐపీసీ 376: పోలీసు అధికారులు, జైలు అధికారులు, ఆర్మీ అధికారులు, సైనికులు సహా ఏయే వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడే అవకాశం ఉందో ఈ సెక్షన్ విపులీకరిస్తుంది. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే నిందితులకు ఏడేళ్ల నుంచి యావజ్జీవ శిక్ష విధించే అవకాశాలు ఉంటాయి. ఐపీసీ 376 ఎ: అత్యాచారం జరపడంతో పాటు బాధితురాలిని తీవ్రంగా గాయపరచి, ఆమెను శాశ్వత వికలాంగురాలయ్యేలా చేసినా, నిందితుడు చేసిన గాయాల కారణంగా బాధితురాలు మరణించినా ఈ సెక్షన్ కింద ఇరవయ్యేళ్ల జైలు శిక్ష నుంచి మరణ శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఐపీసీ 376 బి: వేరుగా ఉంటున్న మహిళపైన లేదా విడాకులు పొందిన మహిళపైన ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఆమె భర్త శృంగారం జరిపినట్లయితే, ఈ సెక్షన్ దానిని అత్యాచారంగానే పరిగణిస్తుంది. ఈ నేరానికి రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. ఐపీసీ 376 సి: అధికారంలో ఉన్న వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు లేదా బాధితురాలిపై అధికారం చలాయించే పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు ఆమెను లొంగదీసుకుని శృంగారంలో పాల్గొనడాన్ని ఈ సెక్షన్ అత్యాచారంగా పరిగణిస్తుంది. ఈ సెక్షన్ కింద నిందితులకు ఆరేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. ఐపీసీ 376 డి: ఒకరి కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒక మహిళపై అత్యాచారం జరపడాన్ని ఈ సెక్షన్ సామూహిక అత్యాచారంగా పరిగణిస్తుంది. సామూహిక అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు ఇరవై ఏళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఐపీసీ 376 ఇ: ఒకసారి అత్యాచార కేసులో దోషిగా తేలిన వ్యక్తి తిరిగి మరోసారి అదే నేరానికి పాల్పడినట్లయితే ఈ సెక్షన్ కింద యావజ్జీవ శిక్ష లేదా మరణ శిక్ష విధించే అవకాశాలు ఉంటాయి. ఐపీసీ 498 ఎ: వరకట్న నిషేధ చట్టం–1961లోని సెక్షన్ 324 కింద వరకట్నం అడగడం, ఇవ్వడం కూడా నేరమే. వరకట్నం కోసం భర్త, అత్తమామలు, ఆడపడుచులు లేదా భర్త తరఫు ఇతర బంధువులెవరైనా ఒక మహిళను వేధింపులకు గురిచేస్తే ఐపీసీ 498 ఎ సెక్షన్‌తో పాటు వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 3, 4 కింద కేసులు నమోదు చేస్తారు. ఐపీసీ 498 ఎ: భర్త లేదా అతని తరఫు బంధువులు ఒక మహిళను శారీరకంగా లేదా మానసికంగా హింసించడాన్ని, ఆమె పట్ల క్రూరంగా ప్రవర్తించడాన్ని ఈ సెక్షన్ నేరంగా పరిగణిస్తుంది. ఈ నేరానికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. ►వరకట్నం కోసం భర్త ఆమె తరఫు బంధువులు ఒక మహిళను హింసించినట్లు నేరం రుజువైతే, ఐపీసీ 498– సెక్షన్‌తో పాటు వరకట్న నిషేధ చట్టంలోని 3, 4 సెక్షన్ల కింద ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. అలాగే కట్నం కింద తీసుకున్న డబ్బును, నష్టపరిహారాన్ని బాధితురాలికి చెల్లించాల్సి ఉంటుంది. ►వివాహిత మహిళను ఆత్మహత్యకు పురిగొల్పేంతగా వేధించడాన్ని, శారీరకంగా, మానసికంగా గాయపరచడాన్ని చట్టం క్రూరత్వంగానే పరిగణిస్తుంది. ►ఉద్దేశపూర్వకంగా ఆమె ఆరోగ్యానికి భంగం కలిగేలా ప్రవర్తించడం.. ఉదా: తిండి పెట్టకపోవడం, అనారోగ్యంగా ఉన్నప్పుడు చికిత్స జరిపించకపోవడం వంటివి.. ►బాధితురాలి పుట్టింటి నుంచి ఆస్తి కోసం, విలువైన వస్తువులు, కానుకల కోసం మాటలతో, చేతలతో వేధించడం వంటి చర్యలు క్రూరత్వం కిందకే వస్తాయి. -
సినిమా వేరు.. జీవితం వేరు..
‘మేం చూసిన క్రైం సీరియళ్లు, సినిమాల్లో నేర సన్నివేశాల ప్రేరణతో దిశను చంపిన తరువాత ఆధారాలు మాయం చేయాలనుకున్నాం. అందుకే శవాన్ని చటాన్‌పల్లికి తీసుకెళ్లి పెట్రోల్‌తో కాల్చాం’ అని దిశ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు విచారణలో పోలీసులకు తెలిపారు. ‘దంగల్ సినిమా చూశాక.. నా కూతురిని స్కేటింగ్‌లో జాయిన్ చేశాను. ఏడాది ప్రాక్టిస్ తరువాత 2018 ఔరంగాబాద్ నేషనల్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించడం జీవితంలో మరువలేని అనుభూతిని ఇచ్చింది’ అని ఓ తండ్రి తన కూతురిని చూసి మురిసిపోయాడు. సినిమా, టీవీ సీరియళ్లు చాలా శక్తిమంతమైన మాధ్యమాలు. ఇవి రెండువైపులా పదును ఉన్న కత్తుల వంటివి. వీటి ప్రభావం సమాజంపై అధికంగా ఉంటుంది. ప్రజల ఆలోచనలను ఇవి మార్చగలవు. ప్రభుత్వాలను పడగొట్టగలవు. మంచి వ్యక్తులను తయారుచేయగలవు. 2016లో దంగల్ సినిమా విడుదలయ్యాక మైదానాలకు వచ్చి ప్రాక్టీస్ చేసే యువతులు, బాలికల సంఖ్య పెరిగింది. అయితే మంచి కంటే చెడు త్వరగా వ్యాపించడం ఆందోళనకరంగా మారింది. సినిమాలు, యూట్యూబ్, ఇతర వెబ్ సిరీస్‌లు, క్రైం సీరియళ్లు ప్రజలను ముఖ్యంగా టీనేజర్లను కలుషితం చేస్తున్నాయి. మితిమీరిన హింస, విశృంఖలతతో పెడదోవ పట్టిస్తున్నాయి. మనిషిని మృగం కంటే భయానకంగా మారుస్తున్నాయి. 2014లో విడుదలైన దృశ్యం సినిమా హత్యోదంతాన్ని అనేక మంది హంతకులు వాడుకున్న తీరు విస్మయం గొలుపుతోంది. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో నమోదైన పలు హత్య కేసుల్లో నిందితులు శవాన్ని, సాక్ష్యాలను మాయం చేసిన తీరు ఆ సినిమాలో చూపినట్లే ఉండటం ఆందోళన కలిగించే అంశం. కానీ, సినిమాలో హీరో కాబట్టి దొరకలేదు. నిజ జీవితంలో మాత్రం వారంతా 24 గంటల్లో పోలీసులకు పట్టుబడటం గమనార్హం. నియంత్రణ కరువు యూట్యూబ్, వెబ్ చానళ్లు సెన్సార్ పరిధిలోకి రావు. అందుకే హత్యలు, అశ్లీల సన్నివేశాలతో నింపేసి ట్రైలర్లను ముందు యూట్యూబ్‌లో వదులుతున్నారు. సినిమా సెన్సార్‌కు వెళ్లినప్పు డు ఆ దృశ్యాలకు కత్తెరపడుతోంది. యూట్యూబ్‌లో వ్యూస్ కారణంగా వీరు పెట్టిన డబ్బులు వచ్చేస్తున్నా యి. అందుకే నిర్మాతలు లాభాల కోసం ఇలాంటి సినిమాలు తీస్తున్నారు. యూట్యూబ్, వెబ్ చానళ్లు సెన్సార్ బోర్డు కిందకి రాకపోవడంతో వాటిలో ప్రసారమయ్యే సీరియళ్లు, సినిమాల్లో ఎలాంటి కత్తెర ఉండదు. ఇప్పుడు ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో యూట్యూబ్, వెబ్ చానళ్ల యాప్‌లు డీఫాల్ట్‌గా వచ్చేస్తున్నాయి. ఫోన్లో ఉచిత డేటా కూడా ఉంటుంది. అవే యువతను పక్కదారి పట్టిస్తున్నాయి. వెబ్ చానళ్లలో ప్రసారమయ్యే పలు సీరిస్‌లలో అధికశాతం విదేశాలవే. అక్కడ వీటికి అంతర్జాతీయ నిబంధనల ప్రకారం.. సెన్సార్ సర్టిఫికెట్లు ఉంటాయి. కానీ, అందులో కంటెంట్ భారతీయ సంస్కృతి, కుటుంబ వ్యవస్థకు విఘాతం కలిగించేలా ఉండటమే ఇక్కడ సమస్య. పైగా నేరాలు చేసి ఎలా తప్పించుకోవాలో చిత్రీకరించి మరీ చూపిస్తున్నారు. వీటి వల్ల వివాహేతర సంబంధాలు, చిన్నారులపై లైంగిక దాడులు, అనైతిక బంధాలు, అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్‌లు వంటి నేరాలు ఎక్కువవుతున్నాయి. ఇటీవల జరిగిన దిశ హత్యాచారం, హయత్‌నగర్ ఉదంతాలే దీనికి నిదర్శనంగా మారాయంటే అతిశయోక్తి కాదు. – సాక్షి, హైదరాబాద్ చట్టాలు చేయాలి ప్రస్తుతం ఇంటర్నెట్లో ప్రసారమవుతున్న పలు వెబ్ సిరీస్‌లు మన దేశానికి సంబంధించినవి కావు. వారి దేశాల్లో అలాంటి సన్నివేశాలు తప్పు కాదు. సమస్యల్లా అవి మన దేశంలో ప్రసారం కావడమే. అందుకే, వీటిపై మరింత నిఘా పెరగాలి. పలు యాప్స్ కూడా టీనేజీ పిల్లలను పెడదోవపట్టిస్తున్నాయి. విపరీతంగా నేరాలు, అడల్ట్ కంటెంట్‌తో వారి బుర్రలను పాడుచేస్తున్నాయి. వీటికి కళ్లెం వేసేందుకు ‘ఒక ప్రభుత్వ నియంత్రిత వ్యవస్థ’ఏర్పాటు కావాలి. ఆ బాధ్యత కేంద్రం చేతుల్లోనే ఉంది. -అనిల్ రాచమల్ల,ఎండ్ నౌ ఫౌండేషన్ త్వరలో నిర్మాత, రచయితలతో సమావేశం సినిమాలు టీనేజీ పిల్లలపై బాగా ప్రభావం చూపుతాయి. కొన్ని సినిమాల వల్ల వీరిపై చెడు ప్రభావం పడుతోంది. వీటి వల్ల సంభవించే నేరాల్లో అమాయక ఆడపిల్లలు బలవుతున్నారు. ఒక్కోసారి వారే నిందితులవుతున్నారు. అందుకే, వీటిపై బాధ్యత తీసుకోవాల్సిందే. సినిమాల్లో హింస, అశ్లీలత, ఇతర అభ్యంతర సన్నివేశాలకు పగ్గాలు వేయాలి. దీనికి సంబంధించి త్వరలోనే నిర్మాత, రచయితలతో సమావేశం ఏర్పాటు చేసి చెడు సినిమాల వల్ల సమాజంపై పడుతున్న దుష్ప్రభావాన్ని వివరించాలనుకుంటున్నాం. – ఐజీ స్వాతి లక్రా పశ్చాత్తాపం కనబడదు సినిమాలు, ఇతర వీడియోలు చూసి నేరాలకు పాల్పడేవారిది చాలా భయంకర మనస్తత్వం. తమకు కావాల్సిన దానికోసం ఎంత కైనా తెగిస్తారు. పోలీసులకు చిక్కినందుకు బాధపడతారు తప్ప.. చేసిన తప్పుకు చింతించరు. వారి చర్యల వల్ల ఎదుటివారు ఇబ్బందులు పడతార న్న చింత వారిలో అణువంతైనా ఉండదు. ఏది ఏమైనా.. వారు అనుకున్నదే చేస్తారు. అందుకే వీరి నేరాలకు కన్నవారు, కట్టుకున్నవారు బలవుతుంటారు. – వీరేందర్, సైకాలజిస్ట్ -
ఇంత జాప్యమా?!
ఉత్తరప్రదేశ్‌లో అధికారం అండదండలున్న ఓ సన్యాసి తనపై లైంగిక నేరానికి పాల్పడుతున్నాడని, అతన్ని తక్షణం అరెస్టు చేయాలని ఫేస్బుక్లో ఓ వీడియో ద్వారా నెలక్రితం వెల్లడించి అదృశ్యమైన 23 ఏళ్ల యువతి పోరాటం ఫలించింది. ఆయన బీజేపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి చిన్మయా నందేనని వెనువెంటనే తెలిసినా ఎఫ్ఐఆర్ నమోదుకు ఇన్నాళ్లూ వెనకాడిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు శుక్రవారం ఆయన్ను అరెస్టు చేసింది. న్యాయశాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఆ యువతి నేరుగా ప్రధాని నరేంద్ర మోదీనుద్దేశించి ఆ వీడియోలో న్యాయం చేయమని విన్నవించ డమే కాదు... తన ప్రాణానికి ముప్పు ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది మీడియాలో విస్తృతంగా రావడంతో సుప్రీంకోర్టు తనంత తానే ఈ కేసును పరిగణనలోకి తీసుకుంది. ఐజీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. అయినా నిందితుడి అరెస్టుకు ఇన్ని రోజులు పట్టడం మన దేశంలో వ్యవస్థల పని తీరుకు అద్దం పడుతుంది. నిందితుడిని అరెస్టు చేయ కపోతే ఆత్మాహుతి చేసుకుంటానని ఆ యువతి హెచ్చరించిన రెండురోజుల తర్వాతే ఈ అరెస్టు సాధ్యమైందని గుర్తుంచుకోవాలి. ఒకపక్క అదే రాష్ట్రంలోని ఉన్నావ్‌లో బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సెంగార్‌పై వచ్చిన అత్యాచారం ఆరోపణల విషయంలో ఎడతెగని జాప్యం చేసినందుకు ఫలితం ఏమిటో కనబడుతూనే ఉన్నా ప్రభుత్వం ఈ కేసులో ఓపట్టాన ముందుకు కదల్లేదు. ఉన్నావ్ కేసు బాధితురాలు రెండేళ్లుగా న్యాయం కోసం ఎడతెగని పోరాటం చేస్తోంది. న్యాయస్థానాల చుట్టూ తిరుగుతోంది. ఎన్నో ఒత్తిళ్ల తర్వాత నిందితుణ్ణి అరెస్టు చేసినా బాధితురాలి కుటుంబానికి కష్టాలు తప్పలేదు. మొన్న జూలైలో కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తున్నప్పుడు వారు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టి ఆమె పిన్ని, మేనత్తలను బలి తీసుకుంది. బాధితురాలు, ఆమె న్యాయవాది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. అప్పటికే తండ్రిని దుండగులు కొట్టి చంపారు. కుటుంబానికి అండగా నిలిచిన బాబాయ్ కేసుల్లో చిక్కుకుని జైలు పాలయ్యాడు. ఉన్నావ్ ఉదంతంలో జరిగిన ఘటనలు కళ్లముందు కనబడుతున్నా చిన్మయానంద అరెస్టులో యూపీ ప్రభుత్వం ప్రదర్శించిన అలసత్వం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. యువతి చేసిన ఆరోపణలు సాధారణమైనవి కాదు. వాటిని రుజువు చేయగల 43 వీడియో క్లిప్పింగ్‌లను ఆమె తండ్రి అధికారులకు అందజేశారు. అందులో ఆమె పట్ల చిన్మయానంద అసభ్యంగా ప్రవర్తించడం, మాట్లాడటం, ఆమెతో మసాజ్ చేయించు కోవడం వంటివి ఉన్నాయి. ఆమెకూ, చిన్మయానందకూ మధ్య జరిగిన 200 ఫోన్ సంభాషణల రికార్డులు కూడా సిట్ అధికారుల అధీనంలో ఉన్నాయి. తనలాగే ఎందరో యువతులు ఆయన ఆశ్రమాల్లో చిక్కుకుని నిస్సహాయ స్థితిలో ఉన్నారని యువతి తెలిపింది. తనకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని తండ్రి చెబుతున్నాడు. ఏదైనా నేరంలో ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు మాత్రమే దానికి సంబంధించిన దర్యాప్తు ప్రారంభమైనట్టు లెక్క. ఫిర్యాదు వచ్చిన వెంటనే బాధితురాలు చెబు తున్నదేమిటో రికార్డు చేసుకుని, నేరం జరిగిందో లేదో ప్రాథమికంగా నిర్ధారించుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన పోలీసులు ఇంత తాత్సారం చేయడం దారుణం. ఆరోపణలొచ్చినవారు సాధారణ పౌరులైనా, పలుకుబడి ఉన్నవారైనా ఈ విషయంలో వ్యత్యాసం చూపించకూడదు. ఇదే రాష్ట్రంలోని బారాబంకీలో పాఠశాల విద్యార్థినులను చైతన్యవంతం చేసేందుకు తాము నిర్వహించిన సదస్సులో పదకొండో తరగతి చదువుతున్న బాలిక ఏం మాట్లాడిందో గమనంలోకి తీసుకుని ఉంటే పోలీసులు ఇలా వ్యవహరించేవారు కాదు. సమాజంలో జరుగుతున్న నేరాలనూ, వాటికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడవలసిన అవసరాన్ని పోలీసు ఉన్నతాధికారి సదస్సులో వివరిస్తుండగా నేరం చేసిన వ్యక్తి మంత్రి లేదా మరో శక్తిమంతమైన వ్యక్తి అయిన పక్షంలో చర్య ఎందుకు తీసుకోలేకపోతున్నారని ఆమె ప్రశ్నించింది. ఉన్నావ్ ఉదంతాన్ని ప్రస్తావించింది. ఆ విద్యార్థిని ప్రసంగిస్తుంటే తోటి బాలికలంతా చప్పట్లతో ఆమెను ప్రశంసించారు. కానీ ఉన్నావ్ ఉదంతంలో ఏం జరిగిందో తాజా కేసులోనూ అదే జరిగింది. చిన్మయానందపై ఆరోపణలు రావడం ఇది మొదటిసారి కాదు. 2011లో కూడా ఒక మహిళ ఇలాంటి ఆరోపణలే చేసింది. తన లాగే ఎందరో చిన్మయానంద ఆశ్రమాల్లో దారుణమైన స్థితిలో బతుకీడుస్తున్నారని తెలిపింది. అత్యాచారాలు బయటకు పొక్కకుండా బాధితులను ఆ ఆశ్రమాల్లో పనిచేసేవారికిచ్చి పెళ్లిళ్లు చేస్తు న్నారని వెల్లడించింది. కేసు దాఖలై ఏడేళ్లు కావస్తున్నా అతీగతీ లేదు. సరిగదా నిరుడు ఆమె పేరిట షాజహాన్‌పూర్ కోర్టులో కేసు ఉపసంహరించుకుంటున్నట్టు అఫిడవిట్ దాఖలైంది. అది దాఖలు చేసింది తాను కాదని ఆమె మొత్తుకుంటోంది. చిత్రమేమంటే, రెండు కేసుల్లోనూ బాధిత యువ తులపై చిన్మయానంద మనుషులు దొంగతనం, బ్లాక్‌మెయిలింగ్ ఆరోపణలు చేశారు. అధికారంలోకొచ్చిన కొత్తలో వరస ఎన్కౌంటర్లతో నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నానని యోగి ఆదిత్యనాథ్ తరచు చెప్పుకునేవారు. కానీ యూపీలో నేరాల గ్రాఫ్ పైపైకి పోతోంది. మహిళలపై జరిగే నేరాల్లో యూపీ అగ్రభాగాన ఉన్నదని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్ హెచ్ఎస్) ఇటీవల వెల్లడించింది. యాసిడ్ దాడి కేసుల్లో పశ్చిమ బెంగాల్ తర్వాత స్థానం యూపీదే. లైంగిక నేరారోపణల్లో చిక్కుకున్న బడా నాయకుల్ని రక్షించడానికి తాపత్రయపడే ధోరణి వల్ల నేరాల కట్టడిలో పోలీసుల్లో అలసత్వం పెరుగుతుంది. నేరగాళ్లలో భరోసా ఏర్పడుతుంది. సాధారణ ప్రజానీకం ఇబ్బందుల్లో పడతారు. సర్వోన్నత న్యాయస్థానం తనకు తానుగా జోక్యం చేసుకుని ఆదేశాలిచ్చినా ఇంత జాప్యం చోటుచేసుకోవడం క్షమార్హం కానిది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి. తన ధోరణిని మార్చుకోవాలి. -
భయధైర్యాలు
చెయ్యి వేసినా ఏం కాదనే ధైర్యం, చెయ్యి వేస్తే ఏమౌతుందోనన్న భయం.. ఈ భయ ధైర్యాలను.. స్త్రీలపై లైంగిక నేరాలు జరగడానికి, జరగకపోవడానికి కారణాలు కానివ్వని సంస్కరణ అయితే సమాజానికి ఒకటి అవసరం. మాధవ్ శింగరాజు మనుషులు ఎవరి పని వారు చేసుకుపోతే, చట్టానికి తన పని తాను చేసుకుపోయే అవసరం ఉండదు. చట్టం తన పని తాను చేసుకుపోతోందంటేనే.. ‘ఓరి దేవుడా’ అనుకోవాలి.. మనుషులెవరో తాము చేయవలసిన పని చేయకుండా ఉండడమో, చేయ తగని పనిని చేసి ఉండడమో జరిగిందని! బిహార్‌లోని బుద్ధగయలో ఒక కేసు విషయంలో చట్టం ఇప్పుడు తన పని తను చేసుకుపోతోంది. బుద్ధగయలోని మహాబోధి ఆలయం ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేతం. ఆలయ దర్శనానికి దేశవిదేశాల నుంచి భక్తులు వచ్చివెళుతుంటారు. ఇటీవల 32 ఏళ్ల చైనా మహిళ ఒకరు షాంఘై నుంచి ఒంటరిగా ఈ పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు గైడ్‌నని చెప్పుకున్న పాతికేళ్ల యువకుడు ఆమెతో అభ్యంతరకరమైన రీతిలో ప్రవర్తించాడు. ‘‘మీరిక్కడ చూడవలసినవి, చాలామందికి తెలియనివి అనేకం ఉన్నాయి’’ అని తీసుకెళ్లి సీసీ కెమెరాల లేని ప్రదేశంలో ఆ మహిళ చెయ్యి పట్టుకున్నాడు. ఆమె నిర్ఘాంతపోయారు. పవిత్ర బుద్ధ భగవానుని సన్నిధిలోనూ ఇలా చేసేవాళ్లుంటారా అని నిశ్చేష్టులయ్యారు. ఆలయ నిర్వహణ కమిటీ కార్యదర్శి ఎన్.దోర్జే వెంటనే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ఆమె చేత కంప్లయింట్ రాయించుకుని, కేస్ ఫైల్ చేశారు. బుద్ధగయలో అధికారిక గైడ్లు ఉంటారు. కానీ ఎలాగో ఆమె ఆ నకిలీ గైడ్ ట్రాప్‌లో పడిపోయారు. బహుశా అధికారిక గైడ్ నిర్లక్ష్యానికి భిన్నంగా అతడు ఎంతో మర్యాద ఇచ్చి, ఆమెకు నమ్మకాన్ని కలిగించి ఉంటాడు. చాలాసార్లు ఇలాగే జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న గైడ్లు ఉద్యోగానికి అలవాటు పడిపోయి, టూరిస్టులతో.. ‘వస్తే వచ్చారు... పోతే పోయారు’ అన్నట్లు వ్యవహరిస్తుంటారు. ప్రైవేటు గైడ్లు అలా కాదు. శ్రద్ధ తీసుకుంటారు. దగ్గరుండి అన్నీ చూపిస్తారు. డబ్బెంత తీసుకుంటారన్నది ముఖ్యంగా కనిపించదు. విధేయంగా ఉన్నాడా లేదా అన్నదే భాష తెలియనివారికి ముఖ్యం అవుతుంది. షాంఘై మహిళ నుంచి కంప్లయింట్ తీసుకున్నాక బుద్ధగయ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. రిమాండ్‌లో పెట్టారు. ఇక అతడికి శిక్ష వేస్తారు అనుకుంటుండగా.. షాంఘై వెళ్లిపోయిన ఆ మహిళ నుంచి ఇక్కడి పోలీసులకు ఒక లెటర్ వచ్చింది. యువకుడిని శిక్షించవద్దని, అతడిలో పరివర్తన తెచ్చే ప్రయత్నాలు చేయమని ఆమె అభ్యర్థన! ‘‘నేను బౌద్ధమతాన్ని విశ్వసిస్తాను. అందుకే అంతదూరం వచ్చాను. కానీ ఒక చేదు అనుభవం ఎదురైంది. అపరాధిని క్షమించమని బౌద్ధం చెబుతోంది. మీరు ఇప్పుడు అతడిని శిక్షిస్తే సంస్కరణ అతడితో ఆగిపోతుంది. శిక్షించకుండా సత్ప్రవర్తనపై శిక్షణ ఇప్పిస్తే అతడు మారడమే కాదు, మరికొందరిలో మార్పునకు కారణం అవుతాడు. అధికారులను నేను ఒకటే కోరుతున్నాను. అతడికి మంచి చదువును అందించండి. జీవితంలో మంచి పనులు చేసేలా అతడిలో ఆలోచన కలిగించండి. ఆ విధంగా బుద్ధగయను దర్శించుకునే ఒంటరి మహిళలకు, ఒంటరిగా ప్రయాణించి వచ్చే మహిళలకు భద్రతను, భరోసాను కలుగజేయండి’’ అని రాశారు షాంఘై మహిళ. అయితే ఆమె కోరినట్లు ఇప్పుడేమీ జరగబోవడం లేదు. డిస్ట్రిక్ట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్.ఎస్.పి) రాజీవ్ మిశ్రా.. చట్టం తన పని తను చేసుకుపోయే యంత్రాంగంలో ఉద్యోగధర్మగ్రస్తుడైన ఒక నిమిత్త మాత్రపు చోదకశక్తిగానే ఉండబోతున్నారు. ‘‘భావోద్వేగాలకు చట్టంలో చోటు ఉండదు. తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడి తీరవలసిందే. బాధితురాలు క్షమాభిక్ష ప్రసాదించినప్పటికీ, బాధితురాలి తరఫున క్షమాభిక్ష ప్రసాదించడానికి చట్టానికి హక్కు లేదు’’ అని ఆయన నిక్కచ్చిగా చెప్పేశారు. నేడో రేపో ఆ యువకుడిపై చార్జిషీటు వేయబోతున్నారు. దానిని కోర్టుకు సమర్పించగానే శిక్ష ఖరారవుతుంది. ఉరిశిక్షేం వెయ్యరు కానీ.. శిక్షయితే వేస్తారు. చట్టం తన పని తాను చేసుకుపోవడానికి ఒక కంప్లయింట్ అయితే అవసరమే కానీ, కంప్లయింట్‌ని వెనక్కు తీసుకుని చట్టం చేత ఆ పనిని ఆపించడం తేలిక కాదు. పోలీసులు నిందితుడి పట్టుకుని, కోర్టులో నిందితుడిని హాజరు పరిచి, కోర్టు రెండు వైపుల వాదనలు వినీ.. ఇన్ని జరగడానికి ఎంతో విలువైన వివిధ శాఖల సమయం ఖర్చవుతుంది. తీరా శిక్ష విధిస్తున్నప్పుడు.. ‘స్టాప్.. ఆపండి’ అని వస్తే ఆ శాఖలు మందలిస్తాయి. ఒక్కోసారి ఆగ్రహిస్తాయి. షాంగ్ మహిళ రాసిన లెటర్లో ఒక పాయింట్ ‘అవున్నిజమే’ అనిపించేలా ఉంది. ‘అపరాధిని శిక్షిస్తే అతడొక్కడే మారతాడు. అపరాధిని సంస్కరిస్తే ఎందరినో మారుస్తాడు’ అని ఆమె రాశారు. చట్టానికి కావలసిందీ అదే. నేరం జరగకుండా ఉండడం. అయితే ఇదే విషయాన్ని చట్టం మరోలా చెబుతుంది. ‘అపరాధిని శిక్షిస్తే భయంతో సమాజం మారుతుంది. అపరాధిని సంస్కరించి వదిలేస్తే శిక్ష ఉండదన్న ధైర్యంతో మారాల్సి అవసరం లేదనుకుంటుంది’ అని! ఎవరి పాయింట్ కరెక్ట్? రెండు పాయింట్లూ కరెక్టే. అయితే చెయ్యి వేసినా ఏం కాదనే ధైర్యం, చెయ్యి వేస్తే ఏమౌతుందోనన్న భయం.. ఈ భయ ధైర్యాలను.. స్త్రీలపై లైంగిక నేరాలు జరగడానికి, జరగకపోవడానికి కారణాలు కానివ్వని సంస్కరణ అయితే సమాజానికి ఒకటి అవసరం. ఆ సంస్కరణను శిక్షే తెచ్చినా, శిక్షణే తెచ్చినా. -
సైబర్ నేరగాళ్లకు ‘డేటా’..!
సాక్షి, అమరావతి: ‘‘హలో.. మీరు నాగరాజు గారేనా.. మేం బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం.. మీ ఆధార్ నెంబరు ఇదేనా.. అకౌంట్ నెంబర్ ఇదేనా.. ఆర్బీఐ ఆదేశాల మేరకు కేవైసీ పరిశీలనలో భాగంగా ఆథార్తో సహా అన్ని వివరాలను చూస్తున్నాం.. ఇప్పుడు మీ ఫోన్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. అది మాకు చెబితే ఈ–కేవైసీ వెరిఫికేషన్ అయిపోతుం దంటూ అవతల వ్యక్తి నుంచి కాల్ వస్తుంది. మనకు సంబంధించిన అన్ని వివరాలు ఖచ్చితంగా చెప్పారు కదా.. బ్యాంకు అధికారులే అయి ఉంటారనుకుని ఓటీపీ చెప్పడం.. ఆ వెంటనే మన బ్యాంకు ఖాతాలోంచి డబ్బులు మాయమైపోవడం క్షణాల్లో జరిగిపోతుంది. ఆ తర్వాత సదరు నెంబర్‌కు ఫోన్‌చేసినా కాల్ కలవదు. డబ్బులు పోయినవాళ్లు లబోదిబోమంటూ బ్యాంకులు, పోలీసుల చుట్టూ తిరగడం మామూలైపోయింది’’. .. ఈ మధ్య ఇలాంటి సంఘటనలు మనం తరచూ చూస్తూనే వింటూనే ఉన్నాం. రెండు మూడేళ్లుగా రాష్ట్రంలో పెరిగిపోతున్న ఈ తరహా సైబర్ నేరాలకు.. ఫొటోల మార్ఫింగ్ ద్వారా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఇటీవల వెలుగుచూసిన డేటా స్కాంకు పెద్ద లింకే ఉన్నట్లు తెలుస్తోంది. పౌరుల వ్యక్తిగత సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోవడమే ఇందుకు కారణమని నిపుణులు తేల్చిచెబుతున్నారు. అదెలాగంటే.. రెండు తెలుగు రాష్ట్రాలను గత కొద్దిరోజు లుగా ఓ కుదుపు కుదుపుతున్న డేటా స్కాం బాగోతం ఇప్పుడు పలు చీకటి కోణాలనూ ఆవిష్కరిస్తోంది. ఈ వ్యవహారం ఓట్ల మార్పులు, చేర్పులకు మాత్రమే పరిమితం కాకుండా అనేకానేక సైబర్ నేరాలకు కేంద్రంగా నిలుస్తోంది. పౌరుల వ్యక్తిగత సమాచారం ఒక్క ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్ సంస్థల వద్దే పరిమితం కాకుండా వీరి నుంచి సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయినట్లు రాష్ట్రంలో గత రెండేళ్లుగా చోటుచేసుకుంటున్న నేరాల తీరుబట్టి స్పష్టమవుతోంది. సర్వే పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చేయడం, ట్రేడింగ్ సలహాలంటూ బయట రాష్ట్రాలతోపాటు విదేశీ కాల్స్, కుప్పలుతెప్పలుగా స్పామ్ మెయిల్స్ ఇటీవల దాదాపు అందరికీ రావడం బాగా పెరిగిపోయాయి. ప్రజలకు సంబంధించిన.. ప్రభుత్వం వద్ద గోప్యంగా ఉండాల్సిన అంత్యంత కీలకమైన వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లడంవల్లే ఈ కాల్స్, స్పామ్ మెయిల్స్ ద్వారా చేసే మోసాలు ఏటా భారీగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉండాల్సిన ఆధార్, ఫోన్ నెంబర్లు, ఈ మెయిల్ చిరునామా, బ్యాంకు అకౌంట్ నెంబర్లు, బయోమెట్రిక్ వంటి సమస్త వ్యక్తిగత సమాచారం రాష్ట్ర ప్రభుత్వ దన్నుతో ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్ ద్వారా ఆర్థిక మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిందన్నది సైబర్ నేరాల పెరుగుదల ద్వారా స్పష్టమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం తన పార్టీ అవసరాలను పర్యవేక్షించే ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ వద్ద రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం ఉందన్న విషయం బహిర్గతం కావడం.. సరిగ్గా రెండేళ్ల నుంచే రాష్ట్రంలో రకరకాలుగా ఆర్థిక నేరాలు పెరగడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. రాష్ట్రంలో పోలీసు శాఖ విడుదల చేసిన సైబర్ నేరాల సంఖ్య సైతం ఇదే స్పష్టం చేస్తోంది. నేరాలు ఇలా పెరిగాయి.. – తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ ఐదేళ్లలో సైబర్ నేరాల్లో 573 శాతం పైగా వృద్ధి పెరిగింది. – 2013లో 148గా ఉన్న సైబర్ నేరాల సంఖ్య గడచిన ఐదేళ్లలో 2018 నాటికి 1,314కి చేరిందంటే ఏ స్థాయిలో పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. – 2017లో సైబర్ నేరాల్లో 45 శాతం, 2018లో 25 శాతం చొప్పున పెరుగుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. – నమోదవుతున్న నేరాల్లో అత్యధికంగా వన్‌టైమ్ పాస్వర్డ్కి సంబంధించిన కేసులే ఉంటున్నాయని రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఇటీవలే వెల్లడించడం గమనార్హం. – అంతేకాదు.. లాటరీలు వచ్చాయని, ఇన్‌కం ట్యాక్స్ రిఫండ్స్ అంటూ ఈ మెయిల్స్ రావడం.. వివరాలు ఇవ్వగానే అకౌంట్లోంచి డబ్బులు మాయమవుతున్న సంఘటనలూ భారీగానే పెరుగుతున్నాయి. – గడిచిన రెండేళ్ల నుంచి ఇలా స్పామ్ మెయిల్స్ రావడం బాగా పెరిగిందని, దీనికి వ్యక్తిగత డేటా చోరీ కావడమే కారణం కావచ్చని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహిళల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ.. మహిళల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ వారి జీవితాన్ని నరకప్రాయం చేస్తున్న సంఘటనలు కొంతకాలంగా విపరీతంగా పెరిగిపోయాయి. మీ వ్యక్తిగత వివరాలు, ఫొటోలు మా వద్ద ఉన్నాయంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారనే ఫిర్యాదులు అధికమవుతున్నాయి. పరువు మర్యాదలు, పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయనే భయంతో చాలామంది మహిళలు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను బయటకు చెప్పుకోలేక వారిలో వారు కుమిలిపోతున్నారు. ఇలాంటి వ్యవహారాలకు డేటా చోరీ ఓ ప్రధాన కారణమై ఉండవచ్చని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఐటీ గ్రిడ్స్ వద్ద ఓటర్ల కలర్ ఫొటోల మాస్టర్ డేటా ఉండడం ఇందుకు బలం చేకూరుస్తోంది. భూరికార్డులపైనా ఆందోళన ఆధార్‌లాగే రాష్ట్రంలోని భూములకు భూధార్ పేరుతో ఒక నెంబర్‌ను కేటాయించడమే కాకుండా భూ రికార్డులన్నీ ఆన్లైన్లో చేర్చడం, ఇప్పుడు ఈ సమాచారం అంతా కూడా ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిందన్న వార్తలపై రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ వంటి పథకాల పేరుతో భూముల వివరాలు, బ్యాంకు ఖాతాల నెంబర్లతో పాటు ఆదాయ వ్యయాలన్నీ సేకరించి ఆర్టీజీఎస్కు పంపించారని, అక్కడ నుంచి ఈ సమాచారం ఐటీ గ్రిడ్స్‌కు చేరడం ఈ భయాందోళనలకు ప్రధాన కారణం. ఇప్పటికే బ్యాంకు ఖాతాల వివరాలతో సైబర్ నేరగాళ్లు ఖాతాల నుంచి డబ్బులు లాగేస్తున్నారని, అలాగే ఫాం–7 పేరుతో తమకు తెలియకుండానే ఓట్లు తొలగించేస్తున్నారని.. అదే విధంగా ఇప్పుడు భూ రికార్డులను కూడా తారుమారు చేస్తే మా పరిస్థితి ఏంటని విజయవాడకు చెందిన రామలింగేశ్వరరావు అనే రైతు ఆందోళన వ్యక్తంచేశాడు. ముందు ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్‌ను అరెస్టుచేసి ఆ తర్వాత ఈ సమాచారం ఎవరెవరి చేతుల్లోకి వెళ్లిందో అన్నదానిపై సమగ్ర విచారణ జరిపించి వ్యక్తిగత సమాచార భద్రతపై భరోసా కల్పించాలన్న డిమాండ్ రాష్ట్రంలో ఇప్పుడు ఊపందుకుంటోంది. రాష్ట్రంలో గత ఐదేళ్లలో సైబర్ నేరాలు పెరిగిన తీరు.. –––––––––––––––––––––––––––––––––––––––––––––––– సంవత్సరం సైబర్ నేరాల సంఖ్య –––––––––––––––––––––––––––––––––––––––––––––––– 2013 148 2014 195 2015 266 2016 718 2017 1,051 2018 1,314 –––––––––––––––––––––––––––––––––––––––––––––––– -
మహిళలపై 34 శాతం పెరిగిన నేరాల సంఖ్య
ఎన్ని ప్రత్యేక చట్టాలు తెచ్చినా మహిళలపై వేధింపులు, నేరాల పర్వం కొనసాగుతూనే ఉంది. అందుకు ఇటీవల నేషనల్ క్రైమ్ బ్యూరో వెల్లడించిన నివేదికలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహరాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గత నాలుగేళ్ళలో మహిళలపై వేధింపులు, అత్యాచారాల కేసులు 34 శాతం పెరిగిపోయినట్లు తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్, మహరాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గత నాలుగు సంవత్సరాల్లో మహిళలపై నేరాలు 34 శాతం పెరిగిపోయినట్లు తాజా నివేదికల్లో వెల్లడైంది. ముఖ్యంగా భర్తలు, బంధువుల క్రూరత్వంతోనే మహిళలపై జరుగుతున్న నేరాల కేసులు అధికంగా నమోదవుతున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మొత్తం మహిళా జనాభాను బట్టి నిర్వచించగా.. 2012 నుంచి 2015 మధ్య నేరాల రేటు 41.7 నుంచి 53.9 కు చేరినట్లు తెలుస్తోంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్న నేరాలు ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. అమ్మాయిలపై అత్యాచారాలు, మహిళలపై వేధింపుల్లో ఆ రాష్ట్రం ముందున్నట్లు తాజా గణాంకాలు చెప్తున్నాయి. ఎన్సీఆర్బీ గణాంకాలనుబట్టి మహిళలపై నేరాల రేటు పెరిగినట్లు తెలుస్తున్నా... మహిళల్లో పెరిగిన ఆత్మవిశాసంతోనే వారిపై జరిగే నేరాలను ధైర్యంగా వెల్లడిస్తున్నారని, దీంతో అధిక కేసులు నమోదవుతున్నట్లు నిపుణులు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో 2015లో భర్త, బంధువుల క్రూరత్వంపై 34 శాతం కేసులు నమోదవ్వగా గత నాలుగేళ్ళతో పోలిస్తే 6 శాతం వృద్ధి చెంది, 2012 లో 106,527 గా ఉన్న సంఖ్య 2015 నాటికి 113,403 కి చేరుకుంది. జాతీయ క్రైమ్ రికార్డ్స్ 2015 ప్రకారం 2012 నుంచి నమోదైన డేటాను.. మహిళా జనాభా ఆధారంగా విభజించి నేరాల సంఖ్యను లెక్కించి తాజా నివేదికల్లో పేర్కొన్నారు. అయితే మహిళలు మౌనంగా బాధను భరించడాన్ని నిరాకరిస్తుండటంతోనే కేసుల సంఖ్య పెరిగుతున్నట్లు ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారి వర్షా శర్మ అక్టోబర్ 2014 లో ఓ నివేదికలో పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలపై నేరాలు 2015 లో ఉత్తరప్రదేశ్, మహరాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అత్యధికంగా నమోదైనట్లు తాజా నివేదికలు చెప్తున్నాయి. పశ్చిమ బెంగాల్ తర్వాత రాజస్థాన్ అత్యధిక నేరాల చిట్టాల్లో అత్యధిక స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. -
పద్నాలుగు సెకన్లు చూస్తే జైలుకే
తిరువనంతపురం: అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు కేరళలోని ఓ ఎక్సైజ్ కమిషనర్ రిషిరాజ్ సింగ్ చేసిన సూచనను కొంతమంది మెచ్చుకోగా ఎక్కువమంది మాత్రం సెటైర్లు వేశారు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా కొచ్చిలో ఏర్పాటుచేసిన ఓ బహిరంగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన వేధింపులపై అమ్మాయిలకు పలు సూచనలు చేశారు. ఎవరైనా ఒక అబ్బాయి పద్నాలుగు సెకన్లపాటు తదేకంగా ఒకమ్మాయి కళ్లలోకి చూస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చని.. బహుశా ఈ విషయం ఎవరికీ తెలియదేమో అన్నారు. అయినా.. ఇప్పటి వరకు అలాంటి కేసు ఒక్కటీ నమోదుకాలేదని, అలా జరగాలంటే అమ్మాయిలు వేధింపులను అరికట్టే విషయంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని అన్నారు. కేరళలో మహిళలు, యువతులపై జరుగుతున్న ఆకృత్యాలను తన ప్రసంగంలో స్పృషించిన ఆయన ఎవరైనా అసభ్యంగా తాకినా, అభ్యంతరకర భాష వాడినా.. వెనుకాలే ఫాలో అవుతున్నా వెంటనే అమ్మాయిలు స్పందించాలని, వారికి అక్కడే బుద్ధి చెప్పాలని అన్నారు. అయితే, మిగితా వ్యాఖ్యల గురించి ఎవరూ పట్టించుకోకున్నా.. ఆయన చెప్పిన 14 సెకన్ల లాజిక్ పై మాత్రం చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర క్రీడల మంత్రి ఈపీ జయరాజన్ స్పందిస్తూ తొలుత ఆయన న్యాయ చట్టాలన్నింటిని తెలుసుకుంటే మంచిదని అన్నారు. ఆయన ఈ పాయింట్ అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అని అనుమానం వ్యక్తం చేశారు. మరీ సన్ గ్లాసెస్ పెట్టుకున్నవాళ్లు అమ్మాయిలను చూస్తున్నారని తెలుసుకునేదలా? అని ప్రశ్నించారు. అమ్మాయిలు ఇక అలారం పెట్టుకోవల్సి వస్తుందేమో అని మరికొందరు సెటైర్లు వేశారు. ఇంకొందరమే ఆయన చేసిన సలహా బానే వుంది కానీ.. 14 సెకన్ల లాజిక్ అవసరం లేదని అన్నారు. -
మహిళల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
లక్నో: యూపీలో మహిళలపై దాడులు, అత్యాచారాలకు తెగబడుతున్న దుండగులను శిక్షించేందుకు త్వరలతో పాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఉన్నతాధికారి శనివారం లక్నోలో వెల్లడించారు. జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాలలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం సీఎం అఖిలేష్ యాదవ్ అధ్యక్షత జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన... రాష్ట్రంలో మహిళలపై నానాటికి దాడులు, అత్యాచార ఘటనలు... పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు, నిందితులకు శిక్షలు పడేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని అఖిలేష్ ప్రభుత్వం భావించింది. అందుకు అనుమతి కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి లేఖ రాసింది. ప్రభుత్వ లేఖపై సీజేఐ సానుకూలంగా స్పందించారు. దాంతో యూపీలో త్వరలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫాస్ట్ కోర్టుల కోసం ఏడాదికి రూ. 15.15 కోట్లు ఖర్చు అవుతుందని ఉన్నతాధికారి తెలిపారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 5 తాత్కాలిక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పర్మినెంట్ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని వెల్లడించారు. -
మరింత శ్రద్ధ వహిస్తున్నాం
న్యూఢిల్లీ: డిసెంబర్, 16 నాటి సామూహిక అత్యాచార ఘటన అనంరతం మహిళలపై నేరాల విషయంలో మరింత శ్రద్ధ వహిస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సి పేర్కొన్నారు. మహిళా సాధికారత అంశంపై స్థానిక ఫిక్కి హౌస్‌లో ఫిక్కి మహిళా సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. డిసెంబర్, 16 నాటి సామూహిక అత్యాచార కేసు నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నామన్నారు. అంతకుముందు బాధితురాలు అయిష్టత వ్యక్తం చేస్తే తమ సిబ్బంది కేసులు నమోదు చేసేవారు కాదని, అయితే 2013లో చట్టంలో చేసిన సవరణల కారణంగా ఇప్పుడు విధిగా కేసు నమోదు చేయాల్సిందేనన్నారు. ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీసులు నిరాకరించకూడదని అన్నారు. దీంతో కేసుల నమోదు దాదాపు 500 శాతం మేర పెరిగిందన్నారు. 2012లో నగరంలో మొత్తం 706 అత్యాచార కేసులు నమోదయ్యాయన్నారు. 2013లో వీటి సంఖ్య 1,636కు చేరుకుందన్నారు. 2014 సంవత్సరంలో ఇప్పటిదాకా దాదాపు 984 కేసులు నమోదయ్యాయన్నారు. జూన్ నాటికి ఇందులో 759 కేసులను పరిష్కరించామన్నారు. అనేక కేసులపై తాను కూడా స్వయంగా దృష్టి సారిస్తూనే ఉన్నానన్నారు. బాధితురాలు, నిందితుడి మధ్య పరిచయమున్న కేసులు కూడా తమ వద్దకు వస్తున్నాయని, వీటి సంఖ్య కూడా బాగా పెరిగిపోయిందన్నారు. మరింత మంది మహిళా సిబ్బంది అవసరం తమ శాఖలో మహిళా సిబ్బంది కొరత సమస్య తీవ్రంగా ఉందని బస్సి పేర్కొన్నారు. డిసెంబర్, 16 నాటి సామూహిక అత్యాచార ఘటన అనంతరం మహిళా సిబ్బంది ప్రాధాన్యం తెలిసొచ్చిందన్నారు. అందువల్లనే వివిధ ర్యాంకుల్లో మొత్తం రెండు వేల మంది మహిళా సిబ్బందిని నియమించుకున్నామన్నారు. -
మహిళలపై అకృత్యాల్లో ఉమ్మడి ఏపీ టాప్
తాజాగా విడుదలైన ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడి 2013లో మహిళలపై జరిగిన నేరాల కేసులు 32,809 హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో మహిళలపై జరిగిన నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజాగా వెల్లడించిన 2013 గణాంకాల ప్రకారం మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2012 నాటి లెక్కలతో పోలిస్తే... మహిళలపై నేరాలకు సంబంధించి దాదాపు ప్రతి అంశంలోనూ పెరుగుదల నమోదైంది. 2012లో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు వ్యతిరేకంగా సంబంధించి 28, 171 కేసులు నమోదు కాగా... 2013 నాటికి ఆ సంఖ్య 32,809కి చేరింది. 2012లో దేశంలోనే అత్యధిక కేసులతో ప్రథమ స్థానంలో నిలిచిన పశ్చిమ బెంగాల్ 2013లో 29,826 కేసులతో రెండో స్థానానికి వచ్చింది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 10.59 శాతం కేసులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే రాష్ట్రంలోనే రిజిస్టరయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏడాది కాలంలో 1,635 అత్యాచారాలు (2012లో 1,341), 1,595 కిడ్నాప్‌లు (2012లో 1,403), 492 మంది వరకట్న వేధింపుల మరణాలు (2012 లో 504) నమోదయ్యాయి. మహిళలపై జరుగుతున్న నేరాల్లో సగానికిపైగా పరిచయస్తులు, బంధువులవల్లే జరిగినవని ఎన్సీఆర్బీ వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీలపై దాడుల్లో నాలుగో స్థానం ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించిన కేసుల నమోదులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్ (7078), బీహార్ (6,721), రాజస్థాన్ (6,475) తరవాత ఆంధ్రప్రదేశ్‌లో 3,270 కేసులు నమోదయ్యాయి. -
పోలీసులపై ఫైర్
సాక్షి, న్యూఢిలీ:ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల మధ్య విభేదాలు మరోసారి వార్తల్లోకెక్కాయి. ఢిల్లీ పోలీసులు తమ మాట వినడం లేదన్న మాజీ సీఎం షీలాదీక్షిత్ మాటలనే కొత్త ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉద్ఘాటించారు. డెన్మార్క్‌కు చెందిన 51 ఏళ్ల పర్యాటకురాలిపై మంగళవారం జరిగిన గ్యాంగ్‌రేప్ సహా ఇటీవల కాలంలో మహిళలపై నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసుల వైఖరిని కేజ్రీవాల్ ఎండగట్టారు. ప్రజాభద్రత విషయంలో పోలీసులు బాగా రాజీపడ్డారని ఘాటుగా విమర్శించారు. నగరంలో చిన్నాచితక నేరాలేమైనా జరగట్లేదంటే అందుకు దేవుడి దయే కారణమన్నారు. సీఎం కేజ్రీవాల్ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి ఢిల్లీ పోలీసులు ఏ విధంగా సహకరించడం లేదో మంత్రులతోనే చెప్పించారు. ముఖ్యమంత్రి పక్కనే కూర్చున్న మంత్రులు సోమనాథ్ భారతి, రాఖీ బిర్లా... ఢిల్లీ పోలీసులు తమ ఆదేశాలను పాటించడం లేదంటూ తమ అనుభవాలను వివరించారు. హౌజ్‌రాణి, ఖిడ్కీలలో మాదక ద్రవ్యాల రాకెట్, సెక్స్ రాకెట్ నడుపుతున్న విదేశీయులపై చర్య తీసుకోవడానికి మాలవీయనగర్ పోలీసులు నిరాకరించారని న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి చెప్పారు. పీసీఆర్ వ్యాన్ తనవెంట తీసుకెళ్లి గాలించాలని కోరినప్పటికీ, వారు ఆ పని చేయలేదని తెలిపారు. అవసరమైతే తనను బదిలీ చేసుకోవచ్చని స్థానిక ఎస్హెచ్ఓ సవాలు చేశారని సోమనాథ్ చెప్పారు. ఇందిరాపుర్లో కోడల్ని సజీవ దహనం చేయబోయిన అత్తింటివారిని అరెస్టు చేయడానికి సాగర్‌పుర్ పోలీస్ స్టేషన్ అధికారులు నిరాకరించిన ైవె నాన్ని రాఖీ బిర్లా వివరించారు. ఈ రెండు ఘటనలు బుధవారం రాత్రి జరిగాయి. డెన్మార్క్ మహిళపై గ్యాంగ్‌రేప్ ఘటనపై మౌనం వహించినందుకు అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ విధి నిర్వహణలో ఢిల్లీ పోలీసుల అలసత్వమే నగరంలో భద్రతా వైఫల్యానికి కారణమని చెప్పారు. మాదక ద్రవ్యాలు, సెక్స్ రాకెట్లను నడిపే ముఠాలను పోలీసులు పట్టుకోవడం లేదని, ఇటువంటి నేరాలే అత్యాచారాలకు పాల్పడే ధోరణులకు దారితీస్తాయన్నారు. మాదక ద్రవ్యాల వ్యాపారులను శిక్షించి, రోడ్డుపై మహిళలను రక్షించాల్సిన బాధ్యత పోలీసులది కాదా అని ఆయన ప్రశ్నించారు. మంత్రి ఆదేశించినా వ్యభిచార రాకెట్ నడిచే ఇంటిపై దాడి చేయడానికి పోలీసులు నిరాకరించారని చెప్పారు. కేజ్రీవాల్ తన మంత్రుల చర్యలను సమర్థించారు. మంత్రులు తమ విధులలో జోక్యం చేసుకున్నారన్న పోలీసుల ఆరోపణలను ఆయన ఖండిం చారు. మంత్రులు తమ పని చేశారని ఆయన చెప్పారు. ఢిల్లీ పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదని ఈ ఘటనలు చెబుతున్నాయన్నారు. ఢిల్లీ పోలీసులు తమ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రజలు పోలీసుల నిర్లక్ష్యాన్ని చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. సెక్స్, మాదక ద్రవ్యా ల ముఠాలపై చర్యలు చేపట్టడానికి, మహిళను సజీవ దహనం చేయడానికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవడానికి నిరాకరించిన నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ విషయమై లెఫ్టినెంట్ గవర్నర్, పోలీసు కమిషనర్‌ను కలవనున్నట్లు ఆయన చెప్పారు. బాగానే పనిచేస్తున్నాం: బస్సీ నగరవాసుల భద్రత కోసం పోలీసు వ్యవస్థ సమర్ధంగా పనిచేస్తోందని పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ స్పష్టం చేశారు. నగరం సురక్షితంగా లేదని, పోలీసులు పట్టించుకోవడం లేదన్న కేజ్రీవాల్ విమర్శలను బస్సీ వద్ద మీడియా ప్రస్తావించగా ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. అయితే తాము చెప్పిన పోలీసులు పట్టించుకోలేదని ఇద్దరు ఆప్ మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇంకా తనకు తెలియదన్నారు. మంత్రులు చెప్పినా వినని పోలీసులు విషయంలో పూర్తి సమాచారం లేదని, తగిన సమయంలో చర్య తీసుకుంటామన్నారు. కాగా, ఆప్ మంత్రులపై ఎల్జీని కలిసి ఫిర్యాదుచేస్తామని పోలీసులు తెలిపారు.