మమ్మీ.. ఆ అంకుల్‌ మంచోడు కాదు! | National Crime Records Bureau Releases List Of Crimes On Lady Girl | Sakshi
Sakshi News home page

మమ్మీ.. ఆ అంకుల్‌ మంచోడు కాదు!

Published Mon, Oct 5 2020 3:20 AM | Last Updated on Mon, Oct 5 2020 4:23 AM

National Crime Records Bureau Releases List Of Crimes On Lady Girl - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చిన్నారులపై జరిగే లైంగికదాడుల్లో నిందితులు 99 శాతం తెలిసినవారే. ఈ విషయం నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ)– 2019 రిపోర్టులో వెల్లడైంది. చిన్నారులను అసభ్యంగా తడమడం, లైంగికంగా వేధించడం, వారికి నీలిచిత్రాలు చూపించడం, లైంగికదాడికి పాల్పడటం, వారిని పెళ్లి, ప్రేమపేరుతో వంచించడం∙వంటి నేరాల్లో పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గతేడాది తెలంగాణలో పోక్సో యాక్ట్‌ సెక్షన్‌ 4, సెక్షన్‌ 6 కింద 1,180 కేసులు నమోదు కాగా.. మిగిలిన సెక్షన్లు కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 1,191గా ఉంది. మాటలతో మాయ చేసే మాయగాళ్ల చేతికి చిక్కుతున్నవారిలో టీనేజీ అమ్మాయిలే అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.  

గతేడాది వెలుగు చూసిన నేరాలను పరిశీలిస్తే.. ఇరుగింటి, పొరుగింటి వారు, వాచ్‌మన్, స్కూల్స్‌ డ్రైవర్లు, క్లీనర్లు, టీచర్లు, బంధువులే నిందితులు కావడం గమనార్హం. మొత్తం 1,180 నేరాలు నమోదు కాగా.. అందులో 1,177 మంది నిందితులు పైన పేర్కొన్నవారిలో ఎవరో ఒకరుగా తేలారు. నిందితుల్లో 664 మంది స్నేహితులు, 163 మంది కుటుంబసభ్యులు, మరో 350 మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ ఉన్నారని పోలీసులు గుర్తించారు. వారిలో 99.7 శాతం తెలిసినవారే. 1,180 కేసుల్లో కేవలం ముగ్గురు మాత్రమే బాలికలకు తెలియనివారు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. 

తెలిసినవారే అధికం

బాలికలపై జరిగిన అకృత్యాల వివరాలు
మొత్తం నేరాలు: 1180
నిందితుల్లో తెలిసినవారు: 1177
కుటుంబ సభ్యులు: 163
అపరిచితులు: ముగ్గురు
ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇరుగుపొరుగు, తదితరులు: 350 
ప్రేమ– పెళ్లి పేరిట మోసం చేసినవారు: 664
తెలిసినవారి శాతం: 99.7 శాతం 

వయసుల వారీగా బాధితులు
ఆరేళ్లలోపు బాలికలు: 26 
ఆరు నుంచి 12 ఏళ్లలోపు బాలికలు: 75 
12 నుంచి 16 ఏళ్లలోపు బాలికలు: 326 
16 నుంచి 18 ఏళ్లలోపు బాలికలు: 764 
మొత్తం బాధితులు: 1,191 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement