న్యూఢిల్లీ: మహిళలపై జరిగిన నేరాలు ఘోరాలకు సంబంధించి 2022లో దాదాపుగా 31 వేల ఫిర్యాదులు అందాయని జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. 2014 తర్వాత ఇవే అత్యధికమని తెలిపింది. 2021లో 30,864 ఫిర్యాదులు అందితే , తర్వాత ఏడాదికి స్వల్పంగా పెరిగి 30,957 ఫిర్యాదులు అందాయి.
ఈ ఫిర్యాదుల్లో ఎక్కువగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినవే ఉన్నాయని, 9,710 వరకు ఆ ఫిర్యాదులేనని గణాంకాలు వెల్లడించాయి. ఆ తర్వాత గృహ హింసకు సంబంధించి 6,970 కేసులు, వరకట్నం వేధింపులు 4,600 ఫిర్యాదులు అందాయి.
ఇదీ చదవండి: సెల్ డ్రైవింగ్‌తో దేశవ్యాప్తంగా... ఏడాదిలో 1,040 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment