ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ముంబై : దేశీయ ఎయిర్‌లైన్స్ ఇండిగో మరోసారి ఇబ్బందుల్లో పడింది. ఇండిగో విమాన ప్రయాణంలో ఓ అమ్మాయి పట్ల అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తి పట్ల చర్యలు తీసుకునేందుకు నిరాకరించింది. బాధితురాలు ఫిర్యాదు చేయకుండా తామేమీ చేయలేమని ప్రకటించడం వివాదానికి దారి తీసింది. దీనిపై అసహనం వ్యక్తం చేసిన కొంతమంది.. ఈ వ్యవహారంలో స్పందించేవరకు తాము ఇండిగో విమానంలో ప్రయాణించమంటూ ట్విటర్ ద్వారా తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంఘటన వివరాల్లోకి వెళితే.. ట్విటర్ యూజర్ ప్రశాంత్ అందించిన సమాచారం ప్రకారం..18 ఏళ్ల టీనేజర్ ఇండిగో విమానంలో ఒంటరిగా ప్రయాణం చేస్తోంది. ఇది గమనించిన విమానంలో పక్క సీట్లో ఉన్న మధ్య వయస్సున్న ప్రబుద్ధుడు అనుచితంగా తాకుతూ ఆ అమ్మాయిపై లైంగిక వేధింపులకు దిగాడు. అదేమిటని ప్రశ్నిస్తే..మరింత బరి తెగించాడు. తన కాళ్లను ఆమె ఒళ్లో పెట్టి రెచ్చిపోయి ప్రవర్తించాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావ్.. నా ఒళ్లో తల పెట్టుకుని పడుకో అంటూ తీవ్రంగా వేధించాడు. ఈ వ్యవహారంపై ఇండిగోను సంప్రదించగా వేధింపులపై విమానంలో ఉండగా ఫిర్యాదు చేయకుండా తామేమి చేయలేమంటూ ఎయిర్‌లైన్ సమాధానమిచ్చిందని ట్వీట్ చేశారు. ఇండిగో సంస్థ ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించిందని ఆయన ఆరోపించారు. మరోవైపు ఇది రెండు నగరాల పరిధిలో ఉన్నందువల్ల ఫిర్యాదు చేసే విషయం గందరగోళంగా ఉందని వాపోయారు. అలాగే తను ఒంటరిగానే తిరిగి రావాల్సి ఉందని... కానీ ఈసారి ఇండిగో విమానంలో మాత్రం కాదని స్పష్టం చేశారు. దీంతో ఆయనకు మద్దతుగా పలువురు స్పందిస్తున్నారు. వేధింపులపై ఇండిగో తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడంతోపాటు..ఈ సమస్యను పరిష్కరించేవరకు తాము ఇండిగో విమానంలో ప్రయాణించబోమని తెగేసి చెప్పారు.
అయితే దీనిపై ఇండిగో విమానయాన సంస్థ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
Sexual harassment of a teenager on a flight: no action could be taken. Airline said it cannot act unless victim complains during flight while she is being harassed. Police complaint complex, involving 2 cities. My 18yo niece is flying back alone this week, but not again on Indigo https://t.co/hfs3ObHLdB
— PKR | প্রশান্ত | پرشانتو (@prasanto) April 9, 2019
Comments
Please login to add a commentAdd a comment