
కంగనా రనౌత్
కంగనా రనౌత్, హృతిక్ రోషన్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందని బాలీవుడ్ మీడియాకు తెలిసిందే. వీలు కుదిరినప్పుడల్లా హృతిక్‌పై మాటల తూటాలు పేల్చుతూనే ఉంటారు కంగనా. తాజాగా ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా మాట్లాడుతూ హృతిక్‌తో ఎవ్వరూ పని చేయకూడదు అని సంచలన వాఖ్యలు చేశారామె. ‘‘దర్శకుడు వికాస్ బాల్ విషయంలో వస్తున్న ఆరోపణలన్నీ నిజమే. మన ఇండస్ట్రీలో స్త్రీలతో సరిగ్గా ప్రవర్తించనివాళ్లు ఇంకా చాలామందే ఉన్నారు. వాళ్లందర్నీ శిక్షించాలి. తమ భార్యలను పతకాలుగా ఉంచుకొని యవ్వనంలో ఉన్న స్త్రీలను గర్ల్‌ఫ్రెండ్‌గా భావించేవాళ్లను కూడా శిక్షించాలి’’ అన్నారు. మీరు ఎవర్ని ఉద్దేశించి అంటున్నారు అని అడగ్గా ‘‘నేను హృతిక్ రోషన్ గురించే మాట్లాడుతున్నాను. అతనితో కలసి పని చేయడం మానేయాలి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment