Kangana Ranaut Drags Hrithik Roshan Of Kissing Vir Das Revolver Rani - Sakshi
Sakshi News home page

Kangana Ranaut Kissing: ఆ హీరో తర్వాత ఇతనితో కూడా అలా రెచ్చిపోయానా అంటూ కంగనా సెటైర్స్‌

Jul 25 2023 1:09 PM | Updated on Jul 25 2023 2:36 PM

Kangana Ranaut Drags Hrithik Roshan Of Kissing Vir Das Revolver Rani - Sakshi

బాలీవుడ్ వివాదాస్పద క్వీన్ కంగనా రనౌత్ ఎప్పుడూ లైమ్‌లైట్‌లోనే ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కంగనా తన బ్లాగ్‌లో ఏదో ఒకటి రాస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు తన కోపాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా వెళ్లగక్కుతుంది. తాజాగా కంగనా పేరు మరోసారి  వైరల్‌ అవుతుంది. ఈసారి 2014లో రిలీజ్‌ అయిన 'రివాల్వర్ రాణి'లోని తన ముద్దు సీన్‌ను తెరపైకి తెస్తూ.. బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్‌ పేరును మరోసారి తెరపైకి తీసుకురావడంతో బాలీవుడ్‌లో మళ్లీ రచ్చ మొదలైంది.

(ఇదీ చదవండి: ఈ సినిమా బడ్జెట్‌నే రూ. 200 కోట్లు.. నెట్‌ఫ్లిక్స్‌ ఎంతకు కొన్నదో తెలిస్తే)

ఇటీవల ఓ వార్తా సంస్థ కంగనా -  వీర్ దాస్ జంటగా నటించిన  'రివాల్వర్ రాణి' సినిమాలోని ముద్దు సన్నివేశం గురించి ఓ వార్తను ప్రచురించింది.  ఆ సినిమాలో  హీరో వీర్ దాస్‌ను కంగనా ముద్దు పెట్టుకున్న సీన్‌ గురించి కథనం వచ్చింది. అంత వరకు బాగానే ఉన్నా.. ఆ సన్నివేశంలో  వీర్ దాస్ పెదవుల నుంచి రక్తం వచ్చేలా కంగనా రనౌత్ ముద్దుపెట్టిందంటూ ఆ వార్త కథనంలో పేర్కొన్నారు. ఇంకేముంది అది చూసిన కంగనా వెంటనే   ఆ వార్తకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ కామెంట్‌ కూడా ఇలా చేసింది. 'హృతిక్ రోషన్ తర్వాత నేను దాడి చేసింది ఈ పూర్‌ 'వీర్ దాస్' పైనా..! అయ్యో ఇది ఎప్పుడు జరిగిపోయింది..?' అంటూ ఫన్నీ ఎమోజీలను కూడా అక్కడ జత చేసింది.

హృతిక్ రోషన్‌తో కంగనా గొడవ
ఆ ముద్దు సీన్‌ పక్కన పెడితే ఆ సినిమాకు ఎలాంటి సంబంధం లేని హృతిక్ రోషన్‌ పేరు ఎందుకు తెచ్చిందనే కదా సందేహం... కంగనా- హృతిక్ రోషన్‌ జంటగా 2010లో వచ్చిన  క్రిష్ 3 చిత్రంలో నటించారు. తర్వాత వీరిద్దరూ డేటింగ్‌ చేశారని టాక్‌ నడిచింది. 2016 సమయంలో ఇదే విషయం స్పందిస్తూ.. హృతిక్‌తో డేటింగ్‌ చేశానని కంగనా బహిరంగంగానే చెప్పడం కూడా జరిగింది. అప్పట్లో ఈ విషయంపై బాలీవుడ్‌లో పెద్ద దుమారమే చెలరేగింది. కంగనా చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని హృతిక్ రోషన్ ఖండించాడు. ఇదే విషయంపై ఆయన కోర్టుకు వెళ్లాడు. ఆమెపై పరువు నష్టం కేసు కూడా దాఖలు చేశాడు. ఇలా ఆ సమయంలో వారి మధ్య మాటల యుద్దం కొన్నాళ్ల పాటు సాగింది.  తాజాగా మళ్లీ ఇలాంటి వ్యవహారంలో హృతిక్ రోషన్ పేరును కంగనా లాగడంతో బాలీవుడ్‌లో మళ్లీ చర్చనీయాంశమైంది. మరి హృతిక్ రోషన్ ఎలా రియాక్ట్‌ అవుతారో వేచి చూడాలి.

(ఇదీ చదవండి: యాంకర్‌ రష్మీపై వల్గర్‌ కామెంట్‌ చేసిన కమెడియన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement