డేటింగ్‌ రూమర్స్‌పై హృతిక్‌ క్లారిటీ | Disha Patani defends Hrithik Roshan, says it's childish and irresponsible gossip | Sakshi
Sakshi News home page

నిజం తెలుసుకోండి!

Published Fri, Aug 31 2018 10:51 AM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

Disha Patani defends Hrithik Roshan, says it's childish and irresponsible gossip - Sakshi

దిశా పటానీ, హృతిక్‌ రోషన్‌

‘‘సినిమాలో అవకాశం కావాలంటే నాతో డేటింగ్‌కు రావాలి’ అంటూ బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీని అగ్ర హీరో హృతిక్‌ రోషన్‌ బెదిరించాడు. ఇదే విషయమై వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి. కంగనా రనౌత్‌ని వేధించినట్టే దిశాని కూడా వేధిస్తున్నాడు’’ అంటూ బాలీవుడ్‌లోని కొన్ని పత్రికల్లో వార్తలు అచ్చయ్యాయి. ఈ వార్తలకు అటు హృతిక్, ఇటు దిశా మండిపడ్డారు. హృతిక్‌ రోషన్, దిశా పటానీ జంటగా ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ నేపథ్యంలో వీరి గురించి పై విధంగా వార్తలొచ్చాయి.

ఈ వార్తలకు హృతిక్‌ రోషన్‌ స్పందిస్తూ– ‘‘మీకు పాపులారిటీ కావాలంటే  నన్నే నేరుగా అడిగితే ఏమైనా చేసి ఉండేవాణ్ణి కదా? ఇలాంటి అసభ్య, అవాస్తవ వార్తలు ప్రచురించడం ఎందుకు? నిజం ఏంటో తెలుసుకోండి’’ అని సదరు పత్రికలపై మండిపడ్డారు. దిశా పటానీ కూడా స్పందిస్తూ– ‘‘హృతిక్‌ సార్, నా గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నిరాధారమైన వార్తలు ఎందుకు రాస్తున్నారు?. హృతిక్‌ సార్‌ని నేను కలిసినప్పుడు ఎంతో మర్యాదగా మాట్లాడారు. అటువంటి గొప్ప వ్యక్తి గురించి వస్తున్న వార్తలను ఖండించాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆయనతో కలిసి నటిస్తున్న సినిమా నుంచి నేను తప్పుకోవడంలేదు’’ అని స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement