స్టార్‌ హీరో ప్రేమ వ్యవహారంపై క్లారిటి ఇచ్చిన తల్లి | Tiger Shroff mother says he, Disha Patani never Dated | Sakshi
Sakshi News home page

దిశా పటానీతో డేటింగ్‌.. స్పందించిన టైగర్‌ ష్రాఫ్‌ తల్లి

Published Tue, May 16 2023 5:47 PM | Last Updated on Tue, May 16 2023 5:59 PM

Tiger Shroff mother says he, Disha Patani never Dated - Sakshi

బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌, హీరోయిన్‌ దిశా పటానీ లవ్‌లో ఉన్నారనే సంగతి అందరికి తెలిసిందే. కానీ ఈ విషయాన్ని ఈ జంట ఎప్పుడూ బహిరంగంగా చెప్పలేదు.  ఆరేళ్ల నుంచి ప్రేమలో మునిగి తేలుతూనే ఉన్నారీ లవ్‌ బర్డ్స్‌.. కానీ  బ్రేకప్‌ చెప్పుకున్నారంటూ  బీటౌన్‌లో ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి.  వారిద్దరూ మౌనంగా ఉన్నప్పటికి, టైగర్‌​ తల్లి అయేషా ష్రాఫ్‌ ఓ ఇంటర్వ్యూలో క్లారటీ ఇచ్చింది. టైగర్‌, దిశా డేటింగ్‌ చేస్తున్నారనే వార్తలు వచ్చినప్పుడల్లా తాను నవ్వుకుంటానని, సరదాగా ఉంటుందని వెల్లడించింది.  

(చదవండి: లావణ్య త్రిపాఠితో వరుణ్‌తేజ్‌ ఎంగేజ్‌మెంట్‌? )

అంతేకాక దిశాతో టైగర్‌ డేటింగ్‌​ అనేది నిజం కాదా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ‘దిశతో టైగర్‌ డేటింగ్‌ అనే దాంట్లో వాస్తవం లేదు. వారిద్దరూ మంచి స్నేహితులు. ఆ రూమర్‌ని నమ్మొద్దు. దిశాతో నాకు కూడా మంచి స్నేహం ఉంది’ అని అయేషా చెప్పుకొచ్చింది. 

(చదవండి: పెళ్లి చేసుకుంటే అమ్మ చనిపోంతుందని చెప్పారు: శివ బాలాజీ )

ఇక  టైగర్‌ నటించిన సినిమాల్లో వార్‌, హీరోపంతి2 సినిమాలంటే ఇష్టమని తెలిపింది.  దిశా పటానీకి టైగర్‌ సోదరి క్రిష్ణ ష్రాఫ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ కూడా! తరచూ వాళ్లింటికి కూడా తనూ వెళ్తూ ఉంటుంది. ఇలా చక్కగా వారి కుటుంబంతో కలిసిపోయేది. కానీ ఈ రూమర్స్‌ వల్ల ప్రస్తుతం  దూరంగా ఉంటుందని టాక్‌.  ఏదేమైనా బాలీవుడ్‌లో చూడచక్కని ఈ జంట విడిపోవడం బాధాకరమే అంటున్నారు ఫ్యాన్స్‌. పుకార్లను పక్కన పెడితే  వీరు సోషల్‌ మీడియాలో మాత్రం ఒకరినొకరు ఫాలో అవుతూనే ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement