Disha Patani And Ex Boyfriend Tiger Shroff Spotted Together In Event - Sakshi
Sakshi News home page

గతేడాదే బ్రేకప్ చెప్పేసుకున్న ప్రేమజంట.. అప్పుడే కలిసిపోయారా!

Jul 3 2023 3:32 PM | Updated on Jul 3 2023 4:16 PM

Disha Patani And ExBoyfriend Tiger Shroff Spotted Together In Event - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ, దిశా పటానీ బీ టౌన్‌లో పరిచయం ‍అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆమె తమిళంలో సూర్య సరసన కంగువా చిత్రంలో నటిస్తోంది. శివ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దిశా పటానీ తెలుగులో వరుణ్ తేజ్ సరసన లోఫర్ చిత్రంలో నటించింది. అయితే గతంలో టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే గతేడాది ఈ బాలీవుడ్ బ్రేకప్  చెప్పేసుకుంది. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న టైగర్ ష్రాఫ్ తాను సింగిల్‌గానే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. 

(ఇది చదవండి: దీపికా పదుకొణె స్థానంలో దిశా పటానీ? లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన బ్యూటీ)

అయితే తాజాగా ఓ ఈవెంట్‌లో బాలీవుడ్ భామ దిశా పటానీ, ఆమె మాజీ ప్రియుడు టైగర్ ష్రాఫ్ జంటగా కనిపించారు. శనివారం దిల్లీలో జరిగిన ఓ ఈవెంట్‌కు ఈ మాజీ లవర్స్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు దిశా, టైగర్ మళ్లీ కలిసిపోయారంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

కాగా.. ఈ ఏడాది మార్చిలో టైగర్ ష్రాఫ్ పుట్టినరోజు సందర్భంగా దిశా పటానీ విష్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మాజీ లవర్‌కు విషెస్ చెప్పింది. కాగా.. దిశా పటాని ప్రస్తుతం యోధా, కంగువా, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నారు. టైగర్ ష్రాఫ్ గణపత్, బడే మియాన్ చోటే మియాన్‌లో కనిపించనున్నారు.

(ఇది చదవండి: హీరోతో కీర్తి నిశ్చితార్థం.. వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేనంటూ ఎమోషనల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement