Vikas Bahl
-
అదే జోరు
ప్రస్తుతం టాలీవుడ్లో సూపర్ బిజీ హీరోయిన్గా ఉన్నారు రష్మికా మందన్నా. ఇటీవలే తన తొలి హిందీ సినిమా కమిట్ అయిన ఆమె అక్కడా అదే జోరుని చూపిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కనున్న ‘మిస్టర్ మజ్ను’లో హీరోయిన్గా నటించనున్నారు రష్మిక. తాజాగా రెండో హిందీ సినిమా కూడా అంగీకరించారట. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలసి యాక్ట్ చేయనున్నారు రష్మిక. అమితాబ్ ప్రధాన పాత్రలో వికాస్ బాల్ దర్శకత్వంలో ‘డాడీ’ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో అమితాబ్ కుమార్తె పాత్రలో కనిపించనున్నారట ఆమె. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
తండ్రీకూతుళ్లుగా...
అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ త్వరలోనే తండ్రీ కూతుళ్లు కానున్నారట. తండ్రీ–కూతుళ్ల బంధం మీద బాలీవుడ్ దర్శకుడు వికాశ్ బాల్ ‘డెడ్లీ’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అంత్యక్రియల కార్యక్రమం చుట్టూ ఈ సినిమా కథాంశం తిరుగుతుందట. ఇందులో అమితాబ్ బచ్చన్, కత్రినా తండ్రీ కూతుళ్ల పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాలో నటించడానికి ఆల్రెడీ తమ అంగీకారాన్ని తెలిపారట బచ్చన్, కత్రినా. ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్‌ను మే నెలలో ప్రారంభించాలనుకున్నారు. కానీ కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణను కొన్నిరోజులు ఆగి ప్రారంభించాలనుకుంటున్నారు. -
మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్ 30’
అదిరిపోయే డ్యాన్సులు, నటనతో బాలీవుడ్ గ్రీక్ గాడ్‌గా ఫేమ్ తెచ్చుకున్న కథా నాయకుడు హృతిక్‌రోషన్. 2017లో కాబిల్ లాంటి వైవిధ్యమైన చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ హీరో దాదాపు రెండున్నర సంవత్సరాల విరామం తర్వాత సూపర్–30తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణనిస్తూ ఐఐటీలకు పంపుతూ పేరు గడించిన ప్రముఖ గణితవేత్త ఆనంద్‌కుమార్ జీవిత గాథతో తీసిన సూపర్ 30 సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మరి వాటిని ఈ చిత్రం ఎంతమేర అందుకుందో తెలుసుకుందాం.. కథ: బిహార్‌లోని పాట్నాలో ఉండే ఆనంద్‌కుమార్‌కు గణితం అంటే ఎనలేని ఆసక్తి. ఆ ఇష్టంతోనే తక్కువ కాలంలో గణితంపై పట్టు తెచ్చుకొని, ప్రఖ్యాత కేంబ్రిడ్జి వర్సిటీలో సీటు దక్కించుకుంటాడు. కానీ పేదింట్లో పుట్టిన ఆనంద్ ఆర్థిక సమస్యలతో కేంబ్రిడ్జికి వెళ్లలేకపోతాడు. అదే సమయంలో అతని కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలతో అతడి చదువు ఆగిపోతుంది. కుటుంబ పోషణ కోసం ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో క్లాసులు చెప్తూ మంచి పేరు తెచ్చుకుంటాడు. కానీ ఓ రాత్రి ఒక బాలుడు, రిక్షా కార్మికుడితో జరిపే సంభాషణతో తీవ్ర వేదనకు గురైన ఆనంద్ ఉద్యోగం మానేసి, పేద పిల్లలకు ఉచితంగా ఐఐటీ శిక్షణ ఇవ్వాలన్న నిర్ణయానికి వస్తాడు. సొంత అకాడమీని నెలకొల్పి, నైపుణ్యం కలిగిన 30 మంది పేద పిల్లలను ఎంచుకుని వారికి ఉచిత వసతి కల్పిస్తూ పాఠాలు చెప్తుంటాడు. తమ కోచింగ్ వ్యాపారానికి ఆనంద్ చర్యలతో నష్టమని గ్రహించిన ప్రైవేటు శిక్షణ సంస్థ యజమాని ఆదిత్య శ్రీవాత్సవ, రాజకీయ నాయకుడు పంకజ్ త్రిపాఠీ ఆనంద్‌పై కక్ష కడతారు. చివరికి వారు ఆనంద్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఏం చేశారు? తను శిక్షణనిస్తున్న పిల్లలకు ఐఐటీలో సీట్లు తీసుకురావాలన్న ఆనంద్‌కుమార్ కల నెరవేరిందా లేదా అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. నటీనటులు: ఆనంద్‌కుమార్ పాత్రలో హృతిక్‌రోషన్ జీవించాడనే చెప్పాలి. ఆ పాత్రలో హృతిక్ ఒదిగిన తీరు అద్భుతం. చాలా చోట్ల ఆయన కళ్లతో, హావభావాలతో సన్నివేశాలకు అదనపు హంగులద్దాడు. కేంబ్రిడ్జిలో సీటు వచ్చే సీన్, పతాక సన్నివేశాల్లో హృతిక్ నటన ఆడియన్స్‌ను సీట్ల నుంచి కదలనివ్వకుండా చేస్తుంది. కొన్ని సీన్లలోనే కనపడినా క్లాసికల్ డ్యాన్స్, మంచి లుక్స్‌తో రితూ పాత్రలో కథానాయిక మృనాల్ ఠాకూర్ ఆకట్టుకుంది. హీరో తండ్రి పాత్రలో నటించిన సీనియర్ నటుడు వీరేందర్ సక్సేనా సహజసిద్ధ నటనతో మెప్పించాడు. కోచింగ్ సెంటర్ యజమానిగా బాగా నటించిన ఆదిత్య శ్రీవాత్సవ పాత్ర కథను కీలక మలుపు తిప్పుతుంది. రాజకీయ నాయకుడిగా పంకజ్ త్రిపాఠీ పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఆనంద్‌కుమార్ తమ్ముడు ప్రణవ్ కుమార్‌గా నటించిన నందిష్ సింగ్ చక్కని నటనతో మంచి మార్కులు కొట్టేశాడు. ఆనంద్ వద్ద శిక్షణ పొందే పిల్లలుగా నటించిన వారందరూ ఆకట్టుకున్నారు. విలేకరిగా నటించిన అమిత్ సాద్‌తోపాటు మిగిలిన వారు తమ పాత్రల పరిధి మేర బాగానే నటించారు. విశ్లేషణ: ఆదర్శంగా నిలిచే ఆనంద్‌కుమార్ జీవితాన్ని అంతే స్ఫూర్తిమంతంగా తెరకెక్కించి, ప్రేక్షకుల ముందుంచడంలో దర్శకుడు వికాస్ భల్ విజయవంతమయ్యాడు. పాత్రల చిత్రణ, వాటి తాలూకు సంఘర్షణకు తెరరూపమివ్వడంలో ఆయన సఫలమయ్యాడు. చిన్న పిల్లల నుంచి తనకు కావాల్సిన నటనను రప్పించుకోవడం, హృతిక్‌ను పాత్రకు తగ్గట్లుగా మలచడంలో సక్సెస్ అయ్యాడు. కథనంలో వేగం తగ్గిన్నప్పుడల్లా సున్నితమైన హాస్యంతో సినిమాను నిలబెట్టాడు. పాత్రకు తగ్గట్టుగా తనను తాను మార్చుకున్న హృతిక్ రోషన్ స్టార్ ఇమేజ్ తాలూకు ఛాయలు పాత్రలో కనపడనీయకుండా అద్భుతమైన నటనను కనబరిచారు. బిహారీ హిందీ యాసలో హృతిక్, పంకజ్ త్రిపాఠీ, వీరేందర్ సక్సేనాలు తమ డైలాగులు, నటనతో పేక్షకుల్ని మాయ చేస్తారు. అనయ్ గోస్వామి తన కెమెరా పనితనంతో పాట్నా వీధులు, పేదల జీవితాలను బాగా చూపాడు. అజయ్–అతుల్ సంగీతం కథలో భాగంగా సాగగా.. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సంజీవ్ దత్తా రాసిన సంభాషణలు మనసుకు హత్తుకునేలా, పొట్టచెక్కలయ్యేలా, ఆలోచింపజేసేలా ఉన్నాయి. స్ఫూర్తినింపుతూ సందేశాన్నిచ్చే కథ, నటీనటుల సహజమైన నటన, చక్కని వినోదం, హృతిక్‌ను కొత్తగా చూపిన విధానం కలగలిపిన ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని మెప్పిస్తుందనడంలో సందేహం లేదు. టైటిల్: సూపర్ 30 (హిందీ చిత్రం) జానర్: బయోగ్రఫీ నటీనటులు: హృతిక్ రోషన్, మృణాల్ ఠాకూర్, పంకజ్ త్రిపాఠీ, వీరేందర్ సక్సేనా, అమిత్ సాద్, నందిష్ సింగ్, ఆదిత్య శ్రీవాత్సవ సంగీతం: అజయ్ గోగావలే –అతుల్ గోగావలే నిర్మాత: అనురాగ్ కశ్యప్, మధు మంతెన వర్మ, సాజిద్ నదియాడ్వాలా దర్శకత్వం: వికాస్ భల్ – నిధాన్ సింగ్ పవార్ -
'సూపర్ 30' ఆనంద్‌కుమార్ ఇంటర్వ్యూ
బాలీవుడ్లో బయోపిక్‌ల పరంపర కొనసాగుతోంది. సామాన్య ప్రజల అసాధారణ జీవిత చరిత్రలను బయోపిక్‌లుగా మలిచి.. హిట్ మీద హిట్ కొడుతున్నారు. ఈ క్రమంలో వస్తున్న తాజా బయోపిక్ సూపర్ 30. బిహార్‌కు చెందిన గణిత శాస్త్రవేత్త ఆనంద్కుమార్గా ఈ సినిమాలో హృతిక్ రోషన్ నటిస్తున్నాడు. నిరుపేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించి.. వారు ఐఐటీలో సీటు సాధించేలా చేసిన ఆనంద్‌కుమార్ జీవిత నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నారు. అయితే మూవీ టైలర్ రిలీజైన తరువాత నుంచి హృతిక్ మాట తీరు, వేషధారణపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. 12 సంవత్సరాలుగా సరైన హిట్‌లేని హృతిక్ ఈ సినిమాతో తనకు మంచి హిట్ దొరుకుతుందని ఆశిస్తున్నాడు. చివరగా 2017లో కాబిల్ చిత్రంలో కనిపించిన హృతిక్ దాదాపు రెండేళ్ల తర్వాత సూపర్30 సినిమాతో జూలై 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ‘సూపర్ 30’ ఇన్స్టిట్యూట్ అధినేత, ప్రముఖ గణిత శాస్త్రవేత ఆనంద్‌కుమార్‌ను ఇండియా టుడే పలుకరించింది. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సూపర్ 30 సినిమాకు ముందు ఆ సినిమా డైరెక్టర్ వికాస్ భల్ ఎవరో తనకు తెలియదని, సూపర్‌హిట్ అయిన క్వీన్ మూవీని ఆయన డైరెక్ట్ చేసిన విషయం కూడా తెలియదని ఆనంద్‌కుమార్ చెప్పారు. సూపర్ 30 సినిమా చర్చల్లో భాగంగా డైరెక్టర్ వికాస్ ఫైనల్ స్ర్కిప్ట్‌ను తీసుకురావడానికి పన్నెండుసార్లు కథలో మార్పులు చేశారన్నారు. ఈ సినిమా కోసం హృతిక్ భోజ్‌పురి(బిహారీ)ను నేర్చుకున్నాడని తెలిపారు. ఈ సినిమాను నిర్మిస్తున్న సమయంలో తనతోపాటు వికాస్‌కు కూడా సమస్యలు ఎదురయ్యాయని, వికాస్ భల్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలు వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే, ఈ వ్యవహారంలో కోర్టు అతనికు క్లీన్చిట్ ఇచ్చిందని, చేసిన కష్టానికి తగ్గ ఫలితం ఎప్పుడూ దక్కుతుందని, అందుకే ఆయనకు క్లీన్చిట్ లభించి.. చిత్ర దర్శకుడిగా క్రెడిట్ కూడా దక్కిందని తెలిపారు. ఐఐటీ సీటు సాధించిన తమ ఇన్స్టిట్యూట్కు చెందిన 30 మంది విద్యార్థుల పేర్లు వెల్లడించలేదంటూ గౌహతీ ఐఐటీకి చెందిన నలుగురు విద్యార్థులు తనకు వ్యతిరేకంగా హైకోర్టులో పిల్ వేశారని ఆనంద్ చెప్పుకొచ్చారు. అయితే, అస్సాంకు చెందిన ఆ నలుగురు విద్యార్థులను తనను ఎన్నడూ కలవలేదన్నారు. కొందరు పెద్దల ఒత్తిడి కారణంగానే వారు పిల్ వేశామని ఒప్పుకొన్నారని, తనపై దాడికి యత్నించడమే కాకుండా మళ్లీ పిల్ వేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారని, వారి పేర్లను వెల్లడించడానికి తనకు ఇష్టం లేదని ఆనంద్ చెప్పారు. తనకు రక్షణగా బీహార్ ప్రభుత్వం నలుగురు కమాండోలను నియమించిందన్నారు. తన జీవితచరిత్ర ఆధారంగా రూపొందుతున్న సూపర్ 30 మూవీకి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, దర్శకుడు వికాస్‌భల్ తగిన న్యాయం చేశారన్నారు. సినిమా చూస్తే అసలు వాస్తవం తెలుస్తుందన్నారు. -
సూపర్ 30 రిలీజ్ డేట్ ఫిక్స్!
ఐఐటీ బాబాగా పేరుగాంచిన గణిత ఉపాధ్యాయుడు ఆనంద్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా సూపర్ 30 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆనంద్ కుమార్ పాత్రలో హృతిక్ రోషన్ నటించగా.. వికాస్ బాల్ దర్శకత్వం వహించారు. అయితే ఆ మధ్య వికాస్ బాల్‌పై మీటూ ఆరోపణలు రాగా.. ఆయన్ను ఈ చిత్రం నుంచి నిర్మాతలు తప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావల్సి ఉండగా.. వాయిదాలు పడుతూ వస్తోంది. అయితే వికాస్ బాల్‌ను తప్పించే సమయానికే షూటింగ్ పూర్తైందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మూవీని జనవరి 25న విడుదల చేసేందుకు ప్లాన్చేసినా.. అది కుదరలేదు. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. జూలై 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. సాజిద్ నడియాద్వాలాకు చెందిన నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. మృణాల్ ఠాకూర్, టీవీ నటుడు నందిష్ సింగ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. -
బలవంతంగా ముద్దు పెట్టబోయాడు!
‘‘నాతో అసభ్యంగా ప్రవర్తించాడు’’.. మీటూ అంటూ పలువురు సినీ తారలు తమ చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. ‘మీకు తోడుగా నేనున్నాను’ మీటూ.. అంటూ పలువురు వారికి మద్దతుగా నిలుస్తున్నారు. కొందరు పురుషుల కోసం ‘హీటూ’ రావాలంటున్నారు. కొందరు ‘వియ్ టు’ (వీటూ) అంటూ మగవాళ్లే ముందుకు రావాలని చెబుతున్నారు. ఎవరెవరు ఏమేం అన్నారు? ఎవరెవరు తాజాగా మీటూ అని ఆరోపించారు? అనేది తెలుసుకుందాం. బలవంతంగా ముద్దు పెట్టబోయాడు! వికాస్ బాల్, సాజిద్ ఖాన్, సుభాష్ కపూర్... ఇలా కొంతమంది బాలీవుడ్ డైరెక్టర్లకు ‘మీటూ’ ఉద్యమ సెగ తగిలిన విషయం తెలిసిందే. ఇప్పుడు సౌత్‌లో కన్నడ స్క్రీన్‌ప్లే రైటర్, డైరెక్టర్ ఎరే గౌడ ఈ జాబితాలో చేరారు. ‘తిథి’ సినిమాకి స్క్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేసినప్పుడు ఎరే తనను లైంగికంగా వేధించాడని ఏక్తా అనే యువతి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సారాంశం ఇలా ఉంది. ‘‘సినిమాలపై ఆసక్తితో చదువు పూర్తయ్యాక ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేద్దామని బెంగళూరు వచ్చాను. నా లక్ష్యం నెరవేర్చుకోవడానికి సహాయం చేస్తానంటూ, ఎరే నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించాడు. ఆ తర్వాత అతనికి దూరంగా వెళ్లిపోయాను’’ అని చెప్పుకొచ్చారు. ఏక్తా చెప్పిన ఈ విషయాన్ని నటి శ్రుతీ హరిహరన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎరేపై ఏక్తా చేసిన ఆరోపణ వెంటనే ప్రభావం చూపింది. ఎరే దర్శకత్వంలో వచ్చిన ‘భలేకెంపా’ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ దక్కింది. ప్రముఖ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు సైతం నామినేట్ అయ్యింది. త్వరలోనే ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రదర్శితం కావాల్సి ఉంది. కానీ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు ‘భలేకెంపా’ సినిమాను ప్రదర్శించడం లేదని వెల్లడించారు. అలాగే ఎరే మీద వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందో తెలిసే వరకు ఈ సినిమాను ఫిల్మ్ ఫెస్టివల్స్ కమిట్మెంట్స్ నుంచి విత్ డ్రా చేసుకుంటున్నాం’’ అని స్వయంగా ఈ సినిమా నిర్మాణసంస్థ జూ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులు పేర్కొన్నారట. నా పోరాటం ఆగదు ‘‘అర్జున్‌పై ‘మీటూ’ ఆరోపణలు చేయడం నా పొరపాటుగా ఒప్పుకోవాలని కొందరు నాపై ఒత్తిడి తెస్తున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఆయనపై చేసిన ఆరోపణలకు కట్టుబడే ఉన్నాను. అర్జున్ పై ఆరోపణలు చేయాలని చేతన్, ప్రకాశ్ రాజ్, కవితా లంకేశ్, మరి కొందరు నన్ను ప్రోత్సహించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. చట్టపరంగా నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. అర్జున్ ఫ్యాన్స్ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాపై తమాషా వీడియోలను తయారుచేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. వాళ్లు ఏమి కావాలో అది చేసుకోవచ్చు, నేనేం చేయాలో అది చేస్తాను. భట్, సంజన, మరికొందరు నటీమణులు ‘మీటూ’ ఆరోపణలు చేస్తున్నారు. వారికి భవిష్యత్ లేకుండా చేయాలని కన్నడ ఫిల్మ్ చాంబర్ ప్రయత్నిస్తున్నట్లుంది. నా పోరాటం ఆగద’’ని వివరిస్తూ శ్రుతీ హరిహరన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాకది పెద్ద షాక్ – అమలాపాల్ ఇటీవల ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ లీలా మనిమేకళై దర్శకుడు సుశీ గణేశన్ తనను వేధించారని ఆరోపించారు. ఇప్పుడు నటి అమలాపాల్ కూడా సుశీపై ఆరోపణలు చేశారు. ‘‘లీలాను నేను నమ్ముతున్నాను. సుశీ డైరెక్షన్లో ‘తిరుట్టుపయలే 2’ అనే సినిమా చేశాను. సెట్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడేవాడు. మహిళల పట్ల అతని ప్రవర్తన సరిగ్గా ఉండేది కాదు’’ అన్నారు అమలాపాల్. ఆ తర్వాత కొంచెం సేపటికి ఆమె ఓ ట్వీట్ చేశారు. ‘‘సుశీ, ఆయన భార్య మంజరి నాకు కాల్ చేశారు. ఈ ఇష్యూ గురించి మంజరికి వివరిస్తున్నప్పుడు సుశీ తిట్టడం స్టార్ట్ చేశాడు. అప్పుడు మంజరి నవ్వడం ఆశ్చర్యంగా అనిపించింది. నాపై పగ తీర్చుకోవడానికి వాళ్లు ఏకమయ్యారు. నేను భయపడతానని వాళ్లనుకుంటున్నారేమో’’ అన్నారు. పురుషులకు ‘హీటూ’ ఉండాలి ఒకవైపు ‘మీటూ’కి పలువురు మద్దతుగా నిలుస్తుంటే బాలీవుడ్ తార రాఖీ సావంత్, కన్నడ తార హర్షికా పూనాచా మాత్రం వ్యతిరేకంగా మాట్లాడారు. ‘‘తనుశ్రీ పబ్లిసిటీ కోసమే నానాపై ఆరోపించిందని, తనకు పిచ్చి అని నేను అన్నందుకు నాపై పది కోట్ల పరువు నష్టం దావా వేస్తే, నన్ను లో క్లాస్ గాళ్ అని అన్నందుకు ఆమెపై నేను 50 కోట్ల పరువు నష్టం దావా వేస్తా. ‘మీటూ’ ఉద్యమంలో మహిళలు చెబుతున్నవన్నీ వాస్తవాలని ఎందుకు నమ్ముతున్నారు? అయోధ్యన్ సుమన్, హృతిక్‌రోషన్ ఎంతో టార్చర్ అనుభవించారు. మహిళలకు ‘మీటూ’ ఉన్నట్లే.. పురుషులకు ‘హీటూ’ లేదా ‘మెన్‌టూ’ మూమెంట్స్ ఉండాలి’’ అని రాఖీ సావంత్ అన్నారు. ఒంటి చేత్తో చప్పట్లు కొట్టలేం హర్షిక పూనాచా ‘వీటూ’ (వియ్ టూ) మూమెంట్ రావాలని అభిప్రాయపడుతూ ఓ పోస్ట్‌ను సోషల్ మీడియాలో ఉంచారు. ‘‘మీటూ’ డెవలప్‌మెంట్స్‌ను గమనిస్తున్నా. మహిళల ప్రమేయం లేకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరని ఒక స్ట్రాంగ్ ఉమెన్‌గా నా అభిప్రాయం. పబ్లిసిటీ కోసమే కొందరు నటీమణులు ఫెమినిటీని ఓ టూల్‌గా వాడుకుంటున్నారు. పదేళ్లుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పుడు ‘యాక్టివిస్ట్ యాక్ట్రసెస్’గా చెప్పుకుంటున్న కొందరు కెరీర్ స్టార్టింగ్‌లో తమ సౌకర్యాల కోసం పురుషులకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. ఆ తర్వాత పబ్లిసిటీ కోసం ఆరోపణలు చేస్తున్నారు. ‘మీటూ’కి సంబంధించి నా దగ్గర కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకడం లేదు. ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘ఎ’ లిస్ట్ సూపర్ స్టార్స్ పేర్లు మీటూ ఉద్యమంలో ఎందుకు రావు? సూపర్ స్టార్ హీరోయిన్లు ఎందుకు స్పందించడం లేదు. ఇప్పుడు ‘మీటూ’ ఉద్యమంలో ఉన్న కొందరు తారలు హ్యాపీగా మత్తు పీలుస్తూ.. మీటూ ఉద్యమంలో ఫేమస్ పర్సనాలిటీస్‌ను ఎలా లాగాలి? అని చర్చించుకుంటున్న వీడియోను చూశాను. ఇంకో వీడియోలో అర్ధనగ్నంగా కారులో ఉన్న ఓ హీరోయిన్ ‘మీ తర్వాతి చిత్రంలో కూడా నేనే హీరోయిన్.. ఓకేనా’ అని ఓ ఫేమస్ హీరోని అడగడం చూశాను. ఒక నటిగా నన్ను కొందరు ‘ఆఫర్స్’ అడిగారు కానీ నేను నో చెప్పాను. దానివల్ల పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌లో నేను చాన్సులు మిస్ అయ్యుండవచ్చు. కానీ నేను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను. ఈ రోజు నేను చెప్పిన ఈ విషయాలను కొందరు వ్యతిరేకించవచ్చు. కానీ నిజం ఎప్పటికీ మారదు. ఇండస్ట్రీలో కొందరు చెడ్డ వ్యక్తులు ఉండవచ్చు. వర్క్ ఇస్తామంటూ మహిళలను ప్రలోభ పెట్టవచ్చు కానీ మహిళల ప్రమేయం ఎంతో కొంత లేకుండా బలవంతంగా రేప్ చేయలేరు. ఒంటి చేత్తో చప్పట్లు కొట్టలేం. ‘మీటూ’ ఉద్యమంలో యాక్టివ్‌గా ఉన్న మహిళలను ఒక విషయం కోరుతున్నాను. దయచేసి రియల్‌గా ఉండండి. ఇప్పుడు పురుషులు ‘వీటూ’ అనే ఉద్యమం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నా తోటి నటీమణులకు వ్యతిరేకంగా మాట్లాడాలన్నది నా ఉద్దేశం కాదు. అయితే ఇతరులు మనల్ని, మన ఇండస్ట్రీని అపహాస్యం చేస్తున్నారు. మనకు ఇండస్ట్రీ ‘బ్రెడ్ అండ్ బటర్’ ఇస్తోంది. ఆ పరిశ్రమను అపహాస్యం కానివ్వకూడదు ’’ అని చెప్పుకొచ్చారు. సుశీ గణేశన్, అమలాపాల్ -
వికాస్‌కు ఓ అవకాశం ఇవ్వండి
ఆరోపణలు ఆగడం లేదు. మేం మద్దతుగా ఉంటున్నాం అని ముందుకొస్తున్న నటీనటులతో ‘మీటూ’ ఉద్యమం సినీ ఇండస్ట్రీల్లో కొనసాగుతూనే ఉంది. తనుశ్రీ దత్తా ఆరోపణలతో మొదలైన ఈ ఉద్యమం చాలా మంది బయటకు వచ్చి నిర్భయంగా మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చింది. దానికి మద్దతు తెలుపుతూ కొందరు యాక్టర్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో నటించబోము అని సినిమాలను ఆపేస్తున్నారు. వికాస్ బాల్‌పై వచ్చిన ఆరోపణలను కంగనా రనౌత్ నిజమే అంటూ స్పందించారు. ఇప్పుడు దానికి సమాధానంగా వికాస్ బాల్ మాజీ భార్య రీచా దూబే కంగనా రనౌత్‌పై కామెంట్లు విసిరారు. ‘‘మీతో ఎవరైనా ఇబ్బందికరంగా ప్రవర్తించినప్పుడు ఇంకా అతనితో ఎందుకు ఫ్రెండ్షిప్ కొనసాగిస్తారు? ఇంకా వాళ్లతోనే నవ్వుతూ తిరుగుతారెందుకు? అతను తన పనిలో మంచి టాలెంట్ ఉందని ఇవన్నీ వదిలేస్తారా? వికాస్ నీతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అని నీకనిపించినప్పుడు అప్పుడే చెప్పొచ్చుగా. మొన్నటి వరకూ ఫ్రెండ్లీగా మెసేజ్‌లు చేసుకొని ఇప్పుడు ఒక్క అవకాశంతో అంతా మారిపోయిందా? నీతో మీడియా ఫైట్ పెట్టుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే అందులో నువ్వు ఆరితేరిపోయావు. సెలబ్రిటీ పవర్‌ని తప్పుగా ఉపయోగించకు. కంగానాకు ఉన్న ప్రామాణికతేంటి? వికాస్ దగ్గర లేనిది ఏంటి? నేను అతని మాజీ భార్య అయినప్పటికీ ఈ డ్రామా చూడలేకపోతున్నాను. నిజం నిరూపించుకోవడానికి అతనికో అవకాశం ఇవ్వండి. నిజం బయటకు రాకముందే అతనికి అనవసరమైన ట్యాగ్స్ అతికించకండి. నిజం నిరూపితమైనప్పుడు అతనికేం చెబుతాం?’’ అని ఘాటుగా స్పందించారు. అలాగే మరోవైపు ‘మీటూ’ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్టు సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్, మలైకా అరోరా, సయేషా ట్వీట్స్ చేశారు. విన్నాక రియాక్ట్ అవుదాం ‘హౌస్‌ఫుల్ 4’ దర్శకుడు సాజిద్ ఖాన్‌పై కూడా ఆరోపణలు వచ్చాయి. నిజానిజాలు తెలిసే వరకూ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను అని సాజిద్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై సైఫ్ అలీ ఖాన్ కూడా స్పందించారు. ‘‘సాజిద్ ఖాన్‌పై వస్తున్న ఆరోపణలు వింటున్నాను. కానీ సెట్లో అతను అలా ప్రవర్తించడం ఎప్పుడూ చూడలేదు. కానీ రియాక్ట్ అయ్యే ముందు వాళ్లు చెప్పేదంతా విందాం. మాట్లాడనిద్దాం, ఎందుకంటే అలా బయటకు వచ్చి మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి. మొత్తం విన్నాక దాన్ని బట్టి రియాక్ట్ అవుదాం’’ అని పేర్కొన్నారు. ‘హౌస్‌ఫుల్ 4’ సినిమా నుంచి దర్శకుడు సాజిద్‌ఖాన్ తప్పుకోవడంతో మిగతా పార్ట్‌ను ‘హౌస్‌ఫుల్ 3’ కి దర్శకత్వ బాధ్యతలు వహించిన సాజిద్, ఫర్హాద్లు డైరెక్ట్ చేయనున్నారని లేటెస్ట్ బాలీవుడ్ టాక్. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ తిరిగి మొదలు కానుందని సమాచారం. నిరుత్సాహపరిచుంటే సారీ చాలా మంది మీ నలభై ఏళ్ల సినీ కెరీర్లో మీరెప్పుడైనా లైంగిక వేధింపులకు గురయ్యారా? అని అడుగుతున్నారు. నేనెప్పుడూ లైంగిక వేధింపులకు గురవలేదు. మిమ్మల్ని నిరుత్సాహపరిచుంటే క్షమించండి. చిన్నప్పటి నుంచి కూడా విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాను. అదే చేశాను’’ అని పేర్కొన్నారు. మీటూను దుర్వినియోగం చేయకండి ప్రస్తుతం ‘మీటూ’ ఉద్యమాన్ని కొంత మంది తప్పుగా ఉపయోగుస్తున్నట్టుగా అనిపిస్తోంది. తప్పుడు నిందలు చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఈ ఉద్యమాన్ని సరిగ్గా వినియోగిస్తే కచ్చితంగా మంచి జరుగుతుంది అనుకుంటున్నాను’’ – హృతిక్ మాజీ భార్య సుసానే ఖాన్ ‘మీటూ’ ద్వారా బయటకు వచ్చి చెబుతున్న స్త్రీలందరి ధైర్యం మెచ్చుకునేది. ఇండస్ట్రీ స్త్రీల సురక్షిత వాతావరణానికి ఏర్పరిచే ప్రయత్నం చేయాలి. దేశంలోని ప్రతి స్త్రీ ఏదోరకంగా లైంగిక వేధింపులకు గురవుతున్నారంటే చాలా బాధగా ఉంది’’ – పూజా హెగ్డే ‘‘ఇన్నేళ్లు తమతో దాచుకున్న ఈ చేదు అనుభవాలు గురించి ఇలా బయటకు వచ్చి మాట్లాడటానికి చాలా ధైర్యం కావాలి. ‘మీటూ’ అంటూ ముందుకొచ్చిన అందర్నీ నమ్ముతున్నాను. అలాగే నిజాయతీగా ముందుకు వచ్చిన వాళ్లను సపోర్ట్ చేస్తున్న పురుషులందరీకి నా థ్యాంక్స్’’ – సయేషా ‘‘అసలు జరగకపోవడం కంటే కొంచెం ఆలస్యం అయినా ఫర్వాలేదు. ఇప్పుడు ఈ స్టెప్ తీసుకుంటే భవిష్యత్తులో ఈ వేధింపులను కంట్రోల్లో ఉంచొచ్చు’’ – మలైకా అరోరాఖాన్ -
అతనితో పని చేయొద్దు
కంగనా రనౌత్, హృతిక్ రోషన్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందని బాలీవుడ్ మీడియాకు తెలిసిందే. వీలు కుదిరినప్పుడల్లా హృతిక్‌పై మాటల తూటాలు పేల్చుతూనే ఉంటారు కంగనా. తాజాగా ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా మాట్లాడుతూ హృతిక్‌తో ఎవ్వరూ పని చేయకూడదు అని సంచలన వాఖ్యలు చేశారామె. ‘‘దర్శకుడు వికాస్ బాల్ విషయంలో వస్తున్న ఆరోపణలన్నీ నిజమే. మన ఇండస్ట్రీలో స్త్రీలతో సరిగ్గా ప్రవర్తించనివాళ్లు ఇంకా చాలామందే ఉన్నారు. వాళ్లందర్నీ శిక్షించాలి. తమ భార్యలను పతకాలుగా ఉంచుకొని యవ్వనంలో ఉన్న స్త్రీలను గర్ల్‌ఫ్రెండ్‌గా భావించేవాళ్లను కూడా శిక్షించాలి’’ అన్నారు. మీరు ఎవర్ని ఉద్దేశించి అంటున్నారు అని అడగ్గా ‘‘నేను హృతిక్ రోషన్ గురించే మాట్లాడుతున్నాను. అతనితో కలసి పని చేయడం మానేయాలి’’ అన్నారు. -
మార్పుకి ముందడుగు
‘మీటూ’ అంటూ అన్ని సినీ ఇండస్ట్రీల నుంచి స్త్రీలు తమకు జరిగిన వైధింపుల గురించి బయటకు వచ్చి చెబుతున్నారు. వారి ధైర్యానికి మద్దతు లభిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లతో ఇకపై కలసి పని చేయబోమని పలువురు స్వచ్ఛందంగా ప్రకటిస్తున్నారు. వికాస్ బాల్‌పై వచ్చిన ఆరోపణల కారణంగా ఆయనతో చేయబోయే ప్రాజెక్ట్ నుంచి వికాస్‌ని తప్పిస్తున్నాం అని అమేజాన్ సంస్థ పేర్కొంది. అలాగే ‘స్టాండప్ కామెడీ’ టీమ్ ఏఐబీ మీద వచ్చిన ఆరోపణల వల్ల హాట్‌స్టార్ తమతో వాళ్ల కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా ఈ లిస్ట్‌లోకి బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా తోడయ్యారు. ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ సినిమా తర్వాత దర్శకుడు సుభాష్ కపూర్‌తో కలసి ఆమిర్ ఓ సినిమా చేయాల్సి ఉంది. తాజాగా అతని మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వినిపించే సరికి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ఆమిర్ ప్రకటించారు. ఈ విషయాన్ని ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. ఆ సారాంశం ఏంటంటే... ‘‘క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉంటూ సామాజిక సమస్యలకు పరిష్కారం వెతకడానికి నటులుగా మేం ప్రయత్నిస్తుంటాం. మా నిర్మాణ సంస్థలో లైంగిక వేధింపులను అస్సలు సహించకూడదనే పాలసీ ఉంది. అంతే సమానంగా తప్పుడు ఆరోపణలను కూడా ప్రోత్సహించం. మేం త్వరలో మొదలుపెట్టబోయే ఓ ప్రాజెక్ట్‌లో ఓ వ్యక్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి అని మాకు తెలిసింది. కేసు లీగల్‌గా నడుస్తున్నందు వలన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాం. పాత తప్పులన్నీ సరిచూసుకొని మార్పువైపు అడుగు వేయడానికి ఇదో ముందడుగు. చాలా ఏళ్లుగా స్త్రీలు లైంగికంగా దోచుకోబడుతున్నారు. ఇది ఆగాలి’’ అని ఆమిర్ భార్య కిరణ్ రావ్, ఆమిర్ పేర్కొన్నారు. ‘ఓ వ్యక్తి’ అని ఆయన పేర్కొన్నది సుభాష్ కపూర్ గురించే అని బాలీవుడ్ టాక్. -
చీకటి కోణాలు
ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశంలో ‘మీ టూ’ ఉద్యమం ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తుందో తెలిసిందే. ప్రస్తుతం చిత్రసీమలో చర్చలన్నీ లైంగిక వేధింపుల గురించే. ఇప్పటికే కొందరు ఫీమేల్ ఆర్టిస్టులు తమకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచారు. ఈ విషయంలో బాధిత నటీమణులకు సహచర నటీమణుల నుంచి మాత్రమే కాదు.. కొందరు నటులు, దర్శకులు కూడా మద్దతు ఇస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఐశ్వర్యారాయ్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘‘వేధింపులకు సంబంధించి బాధిత మహిళలు తమ అనుభవాలను బయటకు చెప్పినప్పుడు వాటిని మనం కూడా ధైర్యంగా ఇతరులతో షేర్ చేసుకోవాలి. మహిళపై వేధింపుల సమస్య కేవలం ఇప్పటిది మాత్రమే కాదు. ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు వేధింపుల గురించి ఓ ఉద్యమం నడుస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇలాంటి విషయాలపై మాట్లాడటానికి నేను సంకోచించను. గతంలో మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడుతున్నా. భవిష్యత్‌లో మాట్లాడతాను. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు తమ గొంతును వినిపించడానికి సోషల్ మీడియా ఉపయోగపడుతోంది’’ అని పేర్కొన్నారు. అయితే లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు వికాస్ బాల్, అలోక్నాథ్ల గురించి మీ ఒపీనియన్ ఏంటి? అని మీడియా అడిగితే.. ఆ విషయం గురించి చెప్పకుండా ఐశ్వర్య మాట దాటేశారు. దోషులను చట్టం శిక్షిస్తుందన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... తనుశ్రీ దత్తా, నానా పటేకర్‌ల వివాదం మరో స్థాయికి చేరింది. ఇటీవల తనుశ్రీకి నానా పటేకర్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తాజాగా తనుశ్రీ దత్తా లాయర్లు ముంబై పోలీసులు, మహారాష్ట్ర స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్లకు దాదాపు 40 పేజీల ప్రతులను అందజేశారు. తనుశ్రీ వివాదానికి సంబంధించి నటుడు నానా పటేకర్, నిర్మాత సమి సిద్ధిఖీ, కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య, దర్శకుడు రాకేష్ సారంగ్‌లు పది రోజుల్లో సంజాయిషీ చెప్పాల్సిందిగా ముంబై రాష్ట్ర మహిళా విభాగం మంగళవారం నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. క్షమాపణలు చెప్పాల్సిందే! ఫాంథమ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలో ఒకరైన వికాశ్ బాల్‌పై లైంగిక ఆరోపణలు వచ్చిన తర్వాత మిగిలిన ముగ్గురు (అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య, మధు మంతెన)లు ఆ సంస్థను నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్యలు వికాస్‌పై సోషల్æమీడియా ద్వారా పలు ఆరోపణలు చేశారు. దీంతో అనురాగ్, విక్రమాదిత్యలకు తాజాగా నోటీసులను పంపించారు వికాస్. ‘‘నా గురించి అనురాగ్, విక్రమాదిత్య చేసిన ఆరోపణలను వెనక్కు తీసుకోవాలి. క్షమాపణలు చెప్పాలి. వృత్తిపరమైన అసూయ కారణంగానే నాపై అనురాగ్, విక్రమాదిత్య ఇలాంటి ఆరోపణలు చేశారనిపిస్తోంది. అలాగే నా కెరీర్‌ను, ఇమేజ్ను దెబ్బతీయాలనే ఇలా ప్లాన్ చేశారు. నాపై వచ్చిన ఆరోపణలు నిజమో కాదో తెలియకుండానే పాంథమ్స్ ఫిల్మ్స్‌ను నిర్వీర్యం చేశారు. ఇందుకు నాపై వచ్చిన ఆరోపణలను వారు ఒక సాకుగా చూపించారన్నది నా ఆలోచన’’ అంటూ మూడు పేజీల లీగల్ నోటీసును అనురాగ్, విక్రమాదిత్యలకు పంపారు వికాస్ తరఫు లాయర్. మరోవైపు వికాస్ నోటీసుల విషయమై తనపై పడ్డ నింద తొలగిపోయేంత వరకు ముంబై అకాడమీ ఆఫ్ ది మూవీంగ్ ఇమేజ్ బోర్డ్ (ఎమ్ఎఎమ్ఐ) సభ్యత్వాన్ని అనురాగ్ కశ్యప్ రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ సంగతి ఇలా ఉంచితే... వికాస్‌పై వచ్చిన ఆరోపణలు అతన్ని రెండు ప్రాజెక్ట్‌లకు దూరం చేశాయని తెలుస్తోంది. అపస్వరం! సింగర్‌గా పలు హిట్ పాటలను ఆలపించి శ్రోతల మనసును గెల్చుకున్న కైలాష్ ఖేర్ తాజాగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వృత్తిపరమైన విషయాలను చర్చించే సమయంలో కైలాష్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని గాయని సోనా మల్హోత్రా ఆరోపించారు. ఓ ఇంటర్య్వూ నిమిత్తం సింగర్ కైలాష్ ఖేర్‌ను కలవడానికి వెళ్లిన సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సోషల్ మీడియా వేదికగా ఓ జర్నలిస్ట్ కూడా ఆరోపించారు. తెలుగులో పండగలా దిగి వచ్చాడు (మిర్చి), ‘వచ్చాడయ్యో సామీ..’ (భరత్ అనే నేను), ‘యాడపోయినాడో..’ (అరవిందసమేత వీరరాఘవ) వంటి హిట్ సాంగ్స్‌ను పాడారు కైలాష్. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ ఏడాది దాదాపు అరడజను తెలుగు సినిమాలకు సంగీతం అందించి, మంచి ఫామ్‌లో దూసుకెళ్తున్నారు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్. ప్రస్తుతం ‘మీ టూ’ ఉద్యమంలో ఆయన పేరు కూడా వినిపిస్తోంది. తనను లైంగికంగా వేధించారని ఓ సింగర్ సోషల్ మీడియా ద్వారా ఆరోపించారు. చక్కని స్వరం ఉన్న ఈ గాయకులపై ఇలాంటి ఆరోపణలు ‘అపస్వరం’గా అనిపిస్తున్నాయని పలువురు అనుకుంటున్నారు. భార్యను వేధించిన దర్శకుడు! మరోవైపు మరాఠీ చిత్రం ‘సైరాట్’తో దేశవ్యాప్త గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు నాగరాజ్ మంజులేపై ఆయన మాజీ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నా 18ఏళ్ల వయసులో నాగరాజ్‌తో నాకు వివాహం జరిగింది. ఆ సమయంలో దర్శకునిగా పేరు తెచ్చుకోవాలని నాగరాజ్ ఎంతగానో ప్రయత్నిస్తుండే వాడు. ఇంటికి నేనే పెద్ద కోడలిని. మా సంసారంలో వచ్చిన ఎన్నో సమస్యలను నేను ఎదుర్కొన్నాను. ఒక టైమ్‌లో నాగరాజ్ ప్రవర్తన హద్దులు దాటింది. ఇంటికి అమ్మాయిలను తెచ్చుకునేవాడు. పైగా నన్ను అబార్షన్ చేయించుకోమని వేధించాడు. రెండు, మూడుసార్లు చేయించాడు కూడా. ఇక భరించలేక 2014లో అతన్నుంచి విడిపోయాను’’ అని సునీత చెప్పినట్లు ఇప్పుడు తాజాగా వార్తలు వస్తున్నాయి. నటి అమైరా దస్తూర్ కూడా మూవీ లొకేషన్లో వేధింపులు ఎదుర్కొన్నానని పేర్కొన్నట్లు చెబుతున్నారట. ‘‘సౌత్, నార్త్ ఇండస్ట్రీలో నేను లైంగిక దాడులను ఎదుర్కొనలేదు. కానీ వేరే రకమైన వేధింపులకు గురయ్యాను. వాళ్ల పేర్లు చెప్పడానికి ప్రస్తుతం నాకు ధైర్యం సరిపోవడం లేదు’’ అన్నారు అమైరా. మొత్తానికి మీటూ ఎన్నో చీకటి కోణాలను బయటకు తెస్తోందని, ఇంకా ఎవరెవరి పేర్లు వస్తాయోననే చర్చ జరుగుతోంది. ఇప్పుడిదొక ఫ్యాషన్! గాయని చిన్మయి ‘మీటూ’కి సంబంధించిన మరికొన్ని ట్వీట్స్‌ను బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంగళవారం ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు గురించి ఆమె ట్వీట్స్ చేశారు. బుధవారం వైరముత్తు స్పందిస్తూ – ‘‘అమాయకులను అవమానించడం ఇప్పుడు చాలామందికి ఓ ఫ్యాషన్ అయిపోయింది. గతంలో నా మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఇది. నిజమేంటో కాలమే చెబుతుంది’’ అన్నారు. ఈ విషయంపై చిన్మయి సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘వైరముత్తు అవాస్తవాలు చెబుతున్నారు’ అని పేర్కొన్నారు. -
'అతనో అమ్మాయిల పిచ్చోడు'
సినిమా: చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం రగులుతోంది. చిన్న హీరోయిన్ల నుంచి టాప్ హీరోయిన్ల వరకూ తాము ఎదుర్కొన్న వేధింపులను బహిరంగపరచడానికి ముందుకొస్తున్నారు. ఆ మధ్య సుచీ లీక్స్ పేరుతో గాయనీ సుచిత్ర కలకలం సృష్టించింది. నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో ప్రకంపనలు సృష్టించింది. బాలీవుడ్ నటి తనూశ్రీదత్తా ప్రముఖ నటుడు నానాపటేకర్ లాంటి వారిపై రాస క్రీడ హింసలను బట్టబయలు చేసింది. ఈమె వ్యవహారం బాలీవుడ్‌ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. నానాపటేకర్‌పై నటి తనూశ్రీదత్తా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మంటలు రగుతుండగానే మరో టాప్ హీరోయిన్ కంగనారనౌత్ మరో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడి రాసక్రీడల చిట్టాను బయట పెట్టి కలకలం పుట్టిస్తోంది. కంగనారనౌత్ తమిళంలో దామ్ ధూమ్ చిత్రంలో నటించింది. తెలుగులోనూ ఏక్ నిరంజన్ చిత్రంలో నటించింది. ఇక బాలీవుడ్లో అగ్ర నటిగా రాణిస్తున్న ఈ జాన క్వీన్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఈ చిత్రం ఇప్పుడు దక్షిణాది భాషలన్నింటిలోనూ రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు వికాశ్ పాహల్పైనే కంగనా లైంగిక వేధింపుల ఆరోపణలను గుప్పించింది. 2014లో క్వీన్‌లో నటిస్తున్నప్పుడే దర్శకుడు వికాస్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కంగనా ఆరోపించింది. అదే విధంగా 2015లో బాంబే వెల్వెట్ చిత్ర ప్రచారంలో పాల్గొన్నప్పుడు తనపై వేధింపులకు పాల్పడ్డాడని ఒక యువతి అతనిపై ఆరోపణలు చేసింది. ఆ వ్యవహారం అప్పట్లో వెలుగులోకి రాలేదు. ఇటీవల తనూశ్రీదత్తా నటుడు నానాపటేకర్ లైంగిక వేధింపుల గుట్టు రట్టు చేయడంతో ఇప్పుడు కంగనా తాను ఎదుర్కొన్న సెక్స్ వేధింపుల గురించి బయట పెట్టింది. దర్శకుడు వికాస్ నుంచి లైంగిక వేధింపులకు గురైన యువతికి తాను మద్దతుగా నిలిచానని కంగనా ఇటీవల ఒక భేటీలో పేర్కొంది. కంగనా తెలుపుతూ ఆ యువతి చెప్పింది నేను పూర్తిగా నమ్మాను. 2014లో క్వీన్ చిత్ర షూటింగ్ సమయంలో దర్శకుడు వికాస్ రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడు. ప్రతి రాత్రి విందు, వినోదాలు జరిగేవి. షూటింగ్ పూర్తి కాగానే నేను విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లిపోయేదాన్ని. రోజూ షూటింగ్ పూర్తి కాగానే నేను దర్శకుడు వికాశ్ కలిసి హగ్ చేసుకునే వాళ్లం. అయితే అతను నా మెడపై ముఖం పెట్టి గట్టిగా నొక్కేసేవాడు. అతని నుంచి విడిపించుకోవడాని చాలా బాధతో పోరాడాల్సి వచ్చేది. నువ్వు ఎలా గుభాళిస్తుంటావు. నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని అంటుండేవాడు. అతని ప్రవర్తనలో తప్పు ఉందని నేను చెప్పగలను. అంతే కాదు అతనో అమ్మాయిల పిచ్చోడు. -
తగిన చర్యలు తీసుకోవాలి
ప్రస్తుతం వికాస్ బాల్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘సూపర్ 30’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో వికాస్‌పై వచ్చిన లైంగిక దాడుల ఆరోపణలకు హృతిక్ స్పందించారు. ‘‘ఇలాంటి ఆరోపణలు ఎదురైన వారితో కలసి పని చేయడం అసాధ్యం. అయితే ఈ ఆరోపణలకన్నా ముందే మా సినిమా పూర్తయింది. నేను వేరే షూటింగ్ నిమిత్తం వేరే చోట ఉండటంతో పూర్తి స్థాయి సమాచారం నా దగ్గర లేదు. ‘సూపర్ 30’ సినిమా నిర్మాతలను నిజానిజాలేంటో నిర్ధారణ చేసుకోమని, కఠినమైన చర్యలు తీసుకోమని కోరాను. బయట వాళ్లకు తెలియకుండా కాదు అందరికీ తెలిసే వి«ధంగానే చర్యలు చేపట్టాలి. నేరం రుజువైన వాళ్లందరూ శిక్షింపబడాలి. వేధింపులకు గురైనవాళ్లందరు బయటకు వచ్చి మాట్లాడగలిగే ధైర్యాన్ని మనమివ్వాలి’’ అని హృతిక్ ట్వీట్ చేశారు. -
సోనమ్–కంగనాల మాటల తూటాలు
మనసుకి అనిపించినది ఎవరికీ భయపడకుండా బాహాటంగా మాట్లాడే స్వభావం ఉన్న నటి కంగనా రనౌత్. ఇటీవల తన సూపర్ హిట్ చిత్రం ‘క్వీన్’ దర్శకుడు వికాస్ బాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తే వాటిని సమర్థిస్తూ ‘అవును’ అంటూ ఆ ఆరోపణలు చేసిన స్త్రీని సపోర్ట్ చేశారు కంగనా. ఈ నేపథ్యంలో సోనమ్ కపూర్ ముందు బాలీవుడ్ మీడియా కంగనా గురించి ప్రస్తావన తీసుకొచ్చింది. సోనమ్ తనదైన స్టైల్లో ఘాటుగా స్పందించారు. ఆ మాటలకు కంగనా ప్రతిస్పందించారు. ఇద్దరి మాటలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కంగనాని నమ్మలేం వికాస్ బాల్‌పై ఆరోపణలు చేసిన స్త్రీని కంగనా సపోర్ట్ చేయడం పై మీ అభిప్రాయం ఏంటి? అని సోనమ్ కపూర్‌ని అడగ్గా – ‘‘స్త్రీలపై వేధింపులు దారుణం. చాలా బాధగా అనిపిస్తుంది. అయితే కంగనా మాటలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. తనని నమ్మడం కష్టం. కంగనా చాలా మాటలు మాట్లాడుతుంది. వాటిలో నిజం ఎంత? అనేది చెప్పలేం’’ అని సమాధానమిచ్చారు. – సోనమ్ సోనమ్ గొప్ప నటి కాదు ‘‘కంగనాని నమ్మలేం అంటే అర్థం ఏంటి? నాకు ఇలాంటి సంఘటన జరిగింది అని నేను చెప్పుకున్నప్పుడు నన్ను జడ్జ్ చేసే హక్కు సోనమ్‌కి ఎవరు ఇచ్చారు? కొందరిని నమ్మాలి.. మరికొందర్ని నమ్మకూడదు అనే లైసెన్స్ ఏమైనా తనకుందా? నా మాటలను నమ్మకపోవడానికి కారణమేంటో? మనసులో ఉన్నది బయటకు చెప్పేస్తా అనే పేరు నాకుంది. మన దేశాన్ని గురించి పలు ప్రపంచ దేశాల సదస్సులలో ప్రసంగించాను. నా ప్రసంగాల ద్వారా యువతను ప్రభావితం చేయగలను అనే పేరు నాకుంది. అంతే కానీ మా నాన్నగారి వల్ల కానీ, ఆయన సంపాదించి పెట్టిన ప్లేస్ వల్ల కానీ కాదు. నాకు ఇండస్ట్రీలో మంచి స్థానం ఉంది. అది స్వయంగా నేను సంపాదించుకున్నదే. సోనమ్ గొప్ప నటీ కాదు.. వక్త కూడా కాదు. నా గురించి మాట్లాడటానికి వాళ్లకు ఏం హక్కుందని?’’ అన్నారు. మొత్తానికి సోనమ్–కంగనాల వాడి వేడి మాటలు చాలామందికి వినోదం అయ్యాయి. నెక్ట్స్ వీళ్ల నుంచి వచ్చే తూటాల్లాంటి మాటల కోసం ఎదురు చూస్తున్నారు. – కంగనా -
కంగనా రనౌత్‌ను నమ్మలేం : సోనమ్
బాలీవుడ్లో ప్రకంపణలు సృష్టిస్తోన్న మీటూ ఉద్యమం తాజాగా కంగనా రనౌత్, సోనమ్ కపూర్ల మధ్య వివాదానికి తెరతీసింది. ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై సోనమ్ కపూర్ స్పందిస్తూ.. ‘తనుశ్రీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. ఇండస్ట్రీలో ఉన్న బలవంతులైన నటులకు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం అంత తేలికేం కాదు. కానీ ఈ విషయంలో తనుశ్రీ చూపిన తెగువ అభినందనీయం’ అన్నారు. అలానే వికాస్ బహ్ల్ గురించి కంగనా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ఈ విషయం గురించి కంగనా ఎంతో చెప్పింది. కానీ అన్ని సార్లు ఆమెని నమ్మలేం. కంగనా తాను నమ్మిన విషయానికి కట్టుబడి ఉంటుంది. నేను ఆ విషయాన్ని ఎంతో గౌరవిస్తాను. కానీ పూర్తిగా వాస్తవాలు తెలియకుండా కంగనా రాతలను మాత్రమే నమ్మి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేను’ అన్నారు. అంతేకాక ‘నాకు అతను(వికాస్) ఎవరో తెలీదు.. నాకు అక్కడ ఉన్న పరిస్థితి కూడా తెలియదు. కానీ ఇప్పుడు వినిపిస్తున్నవన్ని వాస్తవాలే అయితే నిజంగా ఇది చాలా సిగ్గు పడవలసినదే కాక భయంకరమైన అంశం కూడా. ఇవన్ని నిజాలైలే వారికి తప్పకుండా శిక్షపడాలం’టూ పేర్కొన్నారు. అయితే సోనమ్ వ్యాఖ్యలపై కంగనా మండిపడుతున్నారు. నన్ను జడ్జ్ చేయడానికి సోనమ్ కపూర్ ఎవరంటూ ప్రశ్నిస్తున్నారు. ‘నా వ్యాఖ్యలు అవాస్తవాలు అన్పించడానికి సోనమ్ దగ్గర ఏమైనా ఆధారలు ఉన్నాయా.. నేను ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిని.. నేను పలు అంతర్జాతీయ వేడుకల్లో నా దేశం తరపున పాల్గొన్నాను.. నేను యువతకు ప్రేరణగా ఉన్నాను. నేను ఓ దశాబ్దం పాటు పోరాడి ఇండస్ట్రీలో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాను తప్ప సోనమ్ కపూర్‌లాగా నా తండ్రి వల్ల నాకు ఈ గుర్తింపు రాలేదు’ అంటూ మండిపడ్డారు. -
స్టార్ హీరో డిఫరెంట్ మేకోవర్
కాబిల్ సక్సెస్ తరువాత మరో ఆసక్తికరమైన సినిమాలో నటిస్తున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు, ఉపాధ్యాయుడు ఆనంద్ కుమార్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ లో నటిస్తున్నాడు హృతిక్. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం సూపర్ 30 పేరుతో స్కూల్ ప్రారంభించిన ఆనంద్ కుమార్ ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారు. బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వారణాసి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో హృతిక్ లుక్ కు సంబంధించిన స్టిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. గుబురు గెడ్డంతో డిఫరెంట్ గా కనిపిస్తున్న హృతిక్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సినిమాకు వికాస్ బాహ్ల్ దర్శకత్వం వహిస్తున్నారు. -
ఇప్పుడేం ఒత్తిడి లేదు.. పూర్తి స్వేచ్ఛా జీవిని
న్యూఢిల్లీ: తానిప్పుడు పూర్తిగా స్వేచ్ఛా జీవినని, కొంత బాధ్యతలను పక్కకు పెట్టి ఆనందంగా గడిపేందుకు సరైన సమయం ఇదేనని భావిస్తున్నానని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు వికాస్ బాల్ అన్నారు. గతంలో క్వీన్ అనే చిత్రానికి దర్శకత్వం వహించి హిట్ కొట్టిన ఆయన ఆ చిత్ర సమయంలో పూర్తి ఒత్తిడిలో ఉన్నట్లు తెలిపారు. తనపై ఏదో భారం ఉందని, కొంత భయంగా ఉండేదని చెప్పారు. కానీ, ఆ చిత్రం నమోదు చేసిన విజయంతో తనపై తనకు పూర్తి విశ్వాసం వచ్చిందని, కొంత స్వేచ్ఛగా ఉన్నానని చెప్పారు. షాహిద్ కపూర్, అలియాభట్ హీరో హీరోయిన్లుగా షాందార్ అనే చిత్రాన్ని ఆయన తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆ చిత్ర తాలూకు అంశాలు పంచుకుంటూ షాందార్ చిత్రం విషయంలో తనకు ఎలాంటి భయం, ఆందోళన, ఒత్తిడి లేదని చెప్పారు. ఇప్పుడు సంతోషంగా ఉండేందుకు సరైన సమయం అని భావిస్తున్నానని చెప్పారు. -
ఇక స్మాల్ స్క్రీన్!
వెండి తెరపై అవకాశాలు అడుగంటిపోయి... ఉక్కిరిబిక్కిరి అవుతున్నవారికి ఇప్పుడు వరంలా మారాయి బుల్లి తెర సీరియల్స్. తాజాగా మరో బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ ఈ దారే పట్టాడు. వికాస్ బహ్ల్ రూపొందిస్తున్న టీవీ సిరీస్‌లో అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సిరీస్ ఫ్లోర్‌పైకి వెళ్లనుంది. ఓ ఫిల్మ్ ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథాంశంతో దీన్ని తీస్తున్నారనేది సమాచారం. బాలీవుడ్ స్టార్ కావాలని తీవ్రంగా శ్రమించే యువకుడి పాత్రలో సోహైల్ కనిపించనున్నాడు. ‘వికాస్ నాకు మంచి మిత్రుడు. అతడు చక్కని స్క్రిప్ట్‌తో వచ్చి నన్ను అడిగితే... కాదనలేక పోయా’ అన్నాడు సోహైల్. -
11 ఏళ్ల వయస్సులోనే అతన్ని ప్రేమించాను: ఆలియా
ముంబై: బాలీవుడ్ నటుడు షాహీద్ కపూర్ కు పెద్ద ఫ్యాన్ అని సినీనటి ఆలియా భట్ వెల్లడించింది. తన వయస్సు పదకొండేళ్లు ఉన్నపుడే తాను షాహిద్ కపూర్ ను ప్రేమించానని ఆలియా తెలిపింది. అప్పుడే ముంబైలోని జెయిటీ గెలాక్సీ థియేటర్ లో షాహీద్ నటించిన ఇష్క్ విష్క్ చిత్రం చూశానన్నారు. షాహీద్ లో గొప్ప నటుడు ఉన్నాడని ఆలియా తెలిపింది. తాజాగా వికాస్ బెహల్ నిర్మిస్తున్న షాందార్ చిత్రంలో షాహీద్ సరసన నటించేందుకు అంగీకారం తెలిపినట్టు వచ్చిన వార్త నిజమేనంటూ ఆలియా ధృవీకరించింది. షాహీద్ ను సీనియర్ నటుడిగా చూడటం లేదని.. తాను రణదీప్ హుడాతో హైవే చిత్రంలో నటించిన విషయాన్ని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ఇటీవల తాను నటించిన వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, సిద్దార్థ్ మల్హోత్రాలకు సమకాలీకుడిగానే కనిపిస్తాడని షాహీద్ కు ఆలియా కితాబిచ్చింది. క్వీన్ చిత్రాన్ని అందించిన వికాస్ రూపొందిస్తున్న షాందార్ లో నటించడం తనకు ఆనందంగా ఉందని ఆలియా తెలిపింది. -
తమిళ, తెలుగు భాషల్లో 'క్వీన్'
బాలీవుడ్ లో విమర్శకుల ప్రశంసలందుకున్న క్వీన్ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్నట్టు ఆ చిత్ర దర్శకుడు వికాస్ బెహల్ తెలిపారు. రాణి అనే పేరు చాలా సాధారణమైందని, అందర్ని ఆకట్టుకోవడం చాలా సులభమన్నారు. ఓ అమ్మాయి ఒంటరిగా సాగించిన హానిమూన్ కథగా తెరకెక్కిన క్వీన్ చిత్రంలో కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించింది. బుసాన్ చలన చిత్రోత్సవంలో క్వీన్ చిత్రానికి ప్రశంసలు లభించాయిని వికాస్ తెలిపారు. ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ భాషల్లో రూపొందించడానికి పయత్నాలు జరుగుతున్నాయన్నారు. వివిధ భాషల్లో రూపొందిస్తామన్నారు. క్వీన్ చిత్రంలో కంగనా రనౌత్, రాజ్ కుమార్ యాదవ్, లిసా హెడెన్ తదితరులు నటించారు.