ఐఐటీ బాబాగా పేరుగాంచిన గణిత ఉపాధ్యాయుడు ఆనంద్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా సూపర్ 30 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆనంద్ కుమార్ పాత్రలో హృతిక్ రోషన్ నటించగా.. వికాస్ బాల్ దర్శకత్వం వహించారు. అయితే ఆ మధ్య వికాస్ బాల్‌పై మీటూ ఆరోపణలు రాగా.. ఆయన్ను ఈ చిత్రం నుంచి నిర్మాతలు తప్పించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావల్సి ఉండగా.. వాయిదాలు పడుతూ వస్తోంది. అయితే వికాస్ బాల్‌ను తప్పించే సమయానికే షూటింగ్ పూర్తైందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మూవీని జనవరి 25న విడుదల చేసేందుకు ప్లాన్‌చేసినా.. అది కుదరలేదు. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. జూలై 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. సాజిద్ నడియాద్‌వాలాకు చెందిన నడియాద్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. మృణాల్ ఠాకూర్, టీవీ నటుడు నందిష్ సింగ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment