తమిళ, తెలుగు భాషల్లో 'క్వీన్'
తమిళ, తెలుగు భాషల్లో 'క్వీన్'
Published Wed, May 7 2014 2:11 PM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM
బాలీవుడ్ లో విమర్శకుల ప్రశంసలందుకున్న క్వీన్ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్నట్టు ఆ చిత్ర దర్శకుడు వికాస్ బెహల్ తెలిపారు. రాణి అనే పేరు చాలా సాధారణమైందని, అందర్ని ఆకట్టుకోవడం చాలా సులభమన్నారు.
ఓ అమ్మాయి ఒంటరిగా సాగించిన హానిమూన్ కథగా తెరకెక్కిన క్వీన్ చిత్రంలో కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించింది. బుసాన్ చలన చిత్రోత్సవంలో క్వీన్ చిత్రానికి ప్రశంసలు లభించాయిని వికాస్ తెలిపారు.
ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ భాషల్లో రూపొందించడానికి పయత్నాలు జరుగుతున్నాయన్నారు. వివిధ భాషల్లో రూపొందిస్తామన్నారు. క్వీన్ చిత్రంలో కంగనా రనౌత్, రాజ్ కుమార్ యాదవ్, లిసా హెడెన్ తదితరులు నటించారు.
Advertisement
Advertisement