'అతనో అమ్మాయిల పిచ్చోడు' | kangana ranaut Reveals On Vikas bahl behaviour In Queen Shooting | Sakshi
Sakshi News home page

'అతనో అమ్మాయిల పిచ్చోడు'

Published Tue, Oct 9 2018 11:51 AM | Last Updated on Tue, Oct 9 2018 11:51 AM

kangana ranaut Reveals On Vikas bahl behaviour In Queen Shooting - Sakshi

సినిమా: చిత్ర పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారం రగులుతోంది. చిన్న హీరోయిన్ల నుంచి టాప్‌ హీరోయిన్ల వరకూ తాము ఎదుర్కొన్న వేధింపులను బహిరంగపరచడానికి ముందుకొస్తున్నారు. ఆ మధ్య సుచీ లీక్స్‌ పేరుతో గాయనీ సుచిత్ర కలకలం సృష్టించింది. నటి శ్రీరెడ్డి కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంలో ప్రకంపనలు సృష్టించింది. బాలీవుడ్‌ నటి తనూశ్రీదత్తా ప్రముఖ నటుడు నానాపటేకర్‌ లాంటి వారిపై రాస క్రీడ హింసలను బట్టబయలు చేసింది. ఈమె వ్యవహారం బాలీవుడ్‌ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. నానాపటేకర్‌పై నటి తనూశ్రీదత్తా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మంటలు రగుతుండగానే మరో టాప్‌ హీరోయిన్‌ కంగనారనౌత్‌ మరో ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడి రాసక్రీడల చిట్టాను బయట పెట్టి కలకలం పుట్టిస్తోంది. కంగనారనౌత్‌ తమిళంలో దామ్‌ ధూమ్‌ చిత్రంలో నటించింది. తెలుగులోనూ ఏక్‌ నిరంజన్‌ చిత్రంలో నటించింది. ఇక బాలీవుడ్‌లో అగ్ర నటిగా రాణిస్తున్న ఈ జాన క్వీన్‌ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఈ చిత్రం ఇప్పుడు దక్షిణాది భాషలన్నింటిలోనూ రీమేక్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు వికాశ్‌ పాహల్‌పైనే కంగనా లైంగిక వేధింపుల ఆరోపణలను గుప్పించింది.

2014లో క్వీన్‌లో నటిస్తున్నప్పుడే దర్శకుడు వికాస్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కంగనా ఆరోపించింది. అదే విధంగా 2015లో బాంబే వెల్వెట్‌ చిత్ర ప్రచారంలో పాల్గొన్నప్పుడు తనపై వేధింపులకు పాల్పడ్డాడని ఒక యువతి అతనిపై ఆరోపణలు చేసింది. ఆ వ్యవహారం అప్పట్లో వెలుగులోకి రాలేదు. ఇటీవల తనూశ్రీదత్తా నటుడు నానాపటేకర్‌ లైంగిక వేధింపుల గుట్టు రట్టు చేయడంతో ఇప్పుడు కంగనా తాను ఎదుర్కొన్న సెక్స్‌ వేధింపుల గురించి బయట పెట్టింది. దర్శకుడు వికాస్‌ నుంచి లైంగిక వేధింపులకు గురైన యువతికి తాను మద్దతుగా నిలిచానని కంగనా ఇటీవల ఒక భేటీలో పేర్కొంది. కంగనా తెలుపుతూ ఆ యువతి చెప్పింది నేను పూర్తిగా నమ్మాను. 2014లో క్వీన్‌ చిత్ర షూటింగ్‌ సమయంలో దర్శకుడు వికాస్‌ రోజుకో అమ్మాయితో ఎంజాయ్‌ చేసేవాడు. ప్రతి రాత్రి విందు, వినోదాలు జరిగేవి. షూటింగ్‌ పూర్తి కాగానే నేను విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లిపోయేదాన్ని. రోజూ షూటింగ్‌ పూర్తి కాగానే నేను దర్శకుడు వికాశ్‌ కలిసి హగ్‌ చేసుకునే వాళ్లం. అయితే అతను నా మెడపై ముఖం పెట్టి గట్టిగా నొక్కేసేవాడు. అతని నుంచి విడిపించుకోవడాని చాలా బాధతో పోరాడాల్సి వచ్చేది. నువ్వు ఎలా గుభాళిస్తుంటావు. నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని అంటుండేవాడు. అతని ప్రవర్తనలో తప్పు ఉందని నేను చెప్పగలను. అంతే కాదు అతనో అమ్మాయిల పిచ్చోడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement