కంగనా రనౌత్ - సోనమ్ కపూర్ (ఫైల్‌ఫోటో)
బాలీవుడ్‌లో ప్రకంపణలు సృష్టిస్తోన్న మీటూ ఉద్యమం తాజాగా కంగనా రనౌత్, సోనమ్ కపూర్‌ల మధ్య వివాదానికి తెరతీసింది. ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై సోనమ్ కపూర్ స్పందిస్తూ.. ‘తనుశ్రీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. ఇండస్ట్రీలో ఉన్న బలవంతులైన నటులకు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం అంత తేలికేం కాదు. కానీ ఈ విషయంలో తనుశ్రీ చూపిన తెగువ అభినందనీయం’ అన్నారు.
అలానే వికాస్ బహ్ల్ గురించి కంగనా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ఈ విషయం గురించి కంగనా ఎంతో చెప్పింది. కానీ అన్ని సార్లు ఆమెని నమ్మలేం. కంగనా తాను నమ్మిన విషయానికి కట్టుబడి ఉంటుంది. నేను ఆ విషయాన్ని ఎంతో గౌరవిస్తాను. కానీ పూర్తిగా వాస్తవాలు తెలియకుండా కంగనా రాతలను మాత్రమే నమ్మి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేను’ అన్నారు. అంతేకాక ‘నాకు అతను(వికాస్) ఎవరో తెలీదు.. నాకు అక్కడ ఉన్న పరిస్థితి కూడా తెలియదు. కానీ ఇప్పుడు వినిపిస్తున్నవన్ని వాస్తవాలే అయితే నిజంగా ఇది చాలా సిగ్గు పడవలసినదే కాక భయంకరమైన అంశం కూడా. ఇవన్ని నిజాలైలే వారికి తప్పకుండా శిక్షపడాలం’టూ పేర్కొన్నారు.
అయితే సోనమ్ వ్యాఖ్యలపై కంగనా మండిపడుతున్నారు. నన్ను జడ్జ్ చేయడానికి సోనమ్ కపూర్ ఎవరంటూ ప్రశ్నిస్తున్నారు. ‘నా వ్యాఖ్యలు అవాస్తవాలు అన్పించడానికి సోనమ్ దగ్గర ఏమైనా ఆధారలు ఉన్నాయా.. నేను ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిని.. నేను పలు అంతర్జాతీయ వేడుకల్లో నా దేశం తరపున పాల్గొన్నాను.. నేను యువతకు ప్రేరణగా ఉన్నాను. నేను ఓ దశాబ్దం పాటు పోరాడి ఇండస్ట్రీలో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాను తప్ప సోనమ్ కపూర్‌లాగా నా తండ్రి వల్ల నాకు ఈ గుర్తింపు రాలేదు’ అంటూ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment