Sonam Kapoor Revealed Being Molested At Gaiety Galaxy Theatre - Sakshi
Sakshi News home page

Sonam Kapoor: వెనక నుంచి టచ్ చేశాడు.. భయంతో ఏడ్చేశా: సోనమ్ కపూర్

Jun 11 2023 5:37 PM | Updated on Jun 11 2023 9:01 PM

Sonam Kapoor Revealed Being Molested At Gaiety Galaxy Theatre - Sakshi

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. 2007లో వచ్చిన సల్మాన్ ఖాన్‌, రణ్‌బీర్ కపూర్ నటించిన సావరియా చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లోనే ఎక్కువ పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో ఈమె ఒకరు. నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు కూడా దక్కించుకుంది. 

( ఇది చదవండి: కొత్తింట్లోకి అడుగు పెట్టిన హిమజ, ఫోటో వైరల్‌)

జూన్‌ 9న 1985 ముంబయిలో జన్మించిన భామ కుటుంబసభ్యుల మధ్య 38వ పుట్టినరోజు కూడా సెలబ్రేట్ చేసుకుంది. అయితే ఇటీవలే ఓ ఇంటరాక్షన్‌కు హాజరైన సోనమ్ ఓ చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. యుక్త వయసులోనే తనపై లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించింది. ఈ చర్చలో అనుష్క శర్మ, అలియా భట్, విద్యాబాలన్ మరియు రాధికా ఆప్టే కూడా ఉన్నారు. ఇది విని వారంతా షాక్‌కు గురయ్యారు.   

సోనమ్ కపూర్ మాట్లాడుతూ..'13 ఏళ్ల వయస్సులో ఓ చేదు అనుభవం ఎదురైంది. నా స్నేహితులతో కలిసి సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లా. స్నాక్స్ తీసుకోవడానికి బయటకు వచ్చా. ఆ సమయంలో ఓ వ్యక్తి నా వెనక నుంచి వచ్చి బ్రెస్ట్‌ను టచ్‌ చేశాడు. ఊహించని సంఘటనతో ఒక్కసారిగా భయపడి వణికిపోయా. ఆ సమయంలో ఏం జరుగుతుందో నా కర్థం కాలేదు. ఆ షాక్‍తో అక్కడే కూర్చుని ఏడ్చేశా.' అంటూ చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత మాట్లాడుతూ.. ఈ సంఘటన గురించి ఎక్కడా నోరు విప్పలేదని అన్నారు.  ఇది విని ఆమె పక్కన ఉన్న నటీమణులు షాక్‌కు గురయ్యారు. ప్రతి ఒక్కరూ తమ చిన్నతనంలో ఏదో ఒక సందర్భంలో లైంగిక వేధింపులకు గురవుతున్నారని సోనమ్ కపూర్ ఆవేదన వ్యక్తం చేసింది. మహిళల జీవితంలో ఇలాంటి సంఘటనలు, మహిళల వేధింపుల గురించి నోరు విప్పాల్సిన అవసరముందని ఆమె సూచించింది. 

( ఇది చదవండి: తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆదిపురుష్ హీరోయిన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement