
హృతిక్ రోషన్
ప్రస్తుతం వికాస్ బాల్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘సూపర్ 30’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో వికాస్‌పై వచ్చిన లైంగిక దాడుల ఆరోపణలకు హృతిక్ స్పందించారు. ‘‘ఇలాంటి ఆరోపణలు ఎదురైన వారితో కలసి పని చేయడం అసాధ్యం. అయితే ఈ ఆరోపణలకన్నా ముందే మా సినిమా పూర్తయింది. నేను వేరే షూటింగ్ నిమిత్తం వేరే చోట ఉండటంతో పూర్తి స్థాయి సమాచారం నా దగ్గర లేదు. ‘సూపర్ 30’ సినిమా నిర్మాతలను నిజానిజాలేంటో నిర్ధారణ చేసుకోమని, కఠినమైన చర్యలు తీసుకోమని కోరాను. బయట వాళ్లకు తెలియకుండా కాదు అందరికీ తెలిసే వి«ధంగానే చర్యలు చేపట్టాలి. నేరం రుజువైన వాళ్లందరూ శిక్షింపబడాలి. వేధింపులకు గురైనవాళ్లందరు బయటకు వచ్చి మాట్లాడగలిగే ధైర్యాన్ని మనమివ్వాలి’’ అని హృతిక్ ట్వీట్ చేశారు.