హీరోలు పాత్ర కోసం ఎన్ని పాట్లైనా పడాల్సి వస్తుంది. అలా కష్టపడి నటిస్తేనే పాత్రలకు జీవం పోసినట్టవుతుంది. పాత్ర డిమాండ్ చేస్తే ఎంత డీగ్లామర్‌గానైనా నటించే హీరోలు అరుదుగా దొరుకుతారు. కొందరు మాత్రమే తమపంథాను మార్చుకుని, క్యారెక్టర్ డిమాండ్ మేరకు ఆ పాత్రల్లోకి దూరిపోతారు. అలాంటి వారే స్టార్‌గా ఎదుగుతారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో రాబోతోన్న సూపర్ 30 అనే మూవీలో హృతిక్ రోషన్ డీ గ్లామర్‌గా కనిపించి తన నటనతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
గ్రీకు శిల్పంలా కనిపించే హృతిక్ రోషన్ మొదటిసారి డీగ్లామర్ రోల్‌లో కనిపించేసరికి.. అభిమానులు కాస్త నిరాశపడినా పాత్రకు జీవం పోయడంలో సక్సెస్ అయ్యాడని సంబరపడుతున్నారు. ఎక్కడో మారుమూలన ఉన్న గణిత శాస్త్రవేత్త అయిన ఆనంద్.. ఐఐటీలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడం వంటి అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయన ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం వెనుక ఎంతో శ్రమ దాగి వుందని, దానికోసం ఆయన ఎంతో కష్టపడ్డాడని హృతిక్ షేర్ చేసిన ఓ పిక్‌ను చూస్తే అర్థమవుతుంది.
‘ఆనంద్ జీవిత ప్రయాణంలో పాపడాలు అమ్ముకునే ఘట్టం చాలా ముఖ్యమైనది. ఆ సమయంలో ఆయన పడిన భావోద్వేగమే.. తరువాత సాధించిన విజయాలకు కారణమైంద’ ని హృతిక్ ట్వీట్ చేశారు. వికాస్ భల్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్‌వాలాకు చెందిన నడియాద్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫాంటమ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
“The papad selling phase of Anand Kumar’s journey is an important one as it was cathartic and became the genesis of all that he did later on in his life.” #Super30 #12thJULY pic.twitter.com/I7FCbXyphG
— Hrithik Roshan (@iHrithik) June 27, 2019
Comments
Please login to add a commentAdd a comment