
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న సూపర్ 30 చిత్రాన్ని ఎట్టకేలకు మోక్షం లభించింది. హృతిక్ రోషన్ నటించిన ఈ మూవీపై కంగన రనౌత్ కక్షగట్టి.. వాయిదా పడేలా చేస్తూ వచ్చింది. మొత్తానికి ఈ చిత్రం విడుదల కానున్నట్లు ఓ తేదీని ప్రకటించింది చిత్రయూనిట్.
ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న సూపర్ 30 సినిమాను జూలై 12న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. బిగ్ స్క్రీన్‌పై హృతిక్ తొలిసారిగా రియల్ లైఫ్ క్యారెక్టర్‌ను పోషిస్తుండటంతో మూవీపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. చెందిన నడియాద్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, టీవీ నటుడు నందిష్ సింగ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment