ముస్లిం వ్యక్తిని ప్రేమించిన కారణంగా తనను చిత్ర హింసలకు గురిచేస్తున్నారంటూ హీరో హృతిక్ రోషన్ సోదరి సునయన రోషన్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సొంత ఇళ్లే తనకు నరకంగా మారిందని, తమ్ముడు హృతిక్ కూడా తనపై ద్వేషం పెంచుకుని, వేధిస్తున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంపై హృతిక్ తొలిసారిగా స్పందించాడు. ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ మాది అందమైన అనుబంధం. ఇక ప్రేమ అనేది మన పిల్లలు, స్నేహితులతో ఉండే బంధం వంటిదే. అయితే అందులో కూడా కాస్త విఙ్ఞత పాటించాలి. మనపై ఎవరి ప్రేమ నిజమైందో తెలుసుకోగలగాలి. ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను. ప్రేమ ఎన్నటికీ ద్వేషంగా రూపాంతరం చెందదు. ఒకవేళ అలా జరిగితే అసలు అది ప్రేమే కాదు. ఈ విషయం అర్థం చేసుకోగలిగితే ఎవరైనా పూర్వపు ప్రేమ పొందవచ్చు’ అని సునయను ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. ఇక ప్రస్తుతం హృతిక్ తన అప్‌కమింగ్ మూవీ ‘సూపర్ 30’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు.
కాగా తన ప్రేమ విషయం గురించి సుయన మాట్లాడుతూ..‘ గతేడాది రుహైల్ అమీన్ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డాను. కానీ అతడు ముస్లిం అన్న కారణంగా మా నాన్న మా రిలేషన్‌షిప్‌ను అంగీకరించలేదు. నన్ను తీవ్రంగా కొట్టారు. అతడు ఒక ఉగ్రవాది అతడిని పెళ్లి చేసుకుంటావా అంటూ హింసించారు. ఈ విషయంలో హృతిక్ కూడా నాకు సహాయం చేయలేదు. తను కూడా నన్ను వేధిస్తున్నాడు. రుహైల్‌తో ప్రేమ అతడికి ఇష్టం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సునయన రోషన్ తన ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నారంటూ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చేసిన వరుస ట్వీట్లు కలకలం రేపాయి. అయితే ఇంతవరకు రుహైల్ మాత్రం సునయనతో ప్రేమ విషయంపై నోరు విప్పలేదు గానీ.. ఈ విషయంలో ఆమె తండ్రి రాకేశ్ రోషన్‌ను తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశాడు. కాగా రుహైల్‌కు ఇది వరకే పెళ్లై, పిల్లలు కూడా ఉన్నారని..అతడు సునయను ట్రాప్ చేశాడని బీ-టౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment