
కుటుంబ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్ని బాధితురాలు బయటకు చెప్పలేదు
నరసరావుపేట రూరల్: మామ వేధింపులు తాళలేక కోడలు పోలీసులకు ఫిర్యాదుచేసింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇస్సప్పాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత ఏడాది జూన్‌లో తన కోడలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. కుటుంబ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్ని బాధితురాలు బయటకు చెప్పలేదు. అయితే రానురాను మామ వేధింపులు ఎక్కువ కావడంతో గురువారం రూరల్ పోలీసులను ఆమె ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ షఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.