ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు
కర్ణాటక, చింతామణి : అదనపు కట్నం తీసుకురాలేదని భార్యను చితకబాదిన ఘటన తాలుకాలోని కత్తిరగుప్ప గ్రామంలో సోమవారం చోటుచేసుకొంది. వివరాలు... చింతామణి తాలూకా కత్తిరగుప్ప గ్రామానికి చెందని ఇమ్రాన్ ఖాన్‌తో అదే తాలూకా జంగమకోటకు చెందిన షబీరాతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది.
వీరికి ముగ్గురు సంతానం. ఇమ్రాన్ ఖాన్ కుటుంబ పోషణ పట్టించుకోకుండా భార్య నగలు తాకట్టు పెట్టి జల్సా చేసేవాడని సమాచారం. ఈ క్రమంలో పుట్టింటి వారు పలుమార్లు సహాయం చేశారు. రెండు రోజుల క్రిందట షబీరాను డబ్బులు తీసురావాలని పుట్టింటికి పంపాడు. అయితే ఆమె డబ్బులు ఏమీ తీసుకురాకపోవడంతో ఆగ్రహించి భార్యను చితకబాదాడు. అతని తల్లిదండ్రులు సైతం అతనికి సహకరించారు. ఆమె స్పృహ తప్పిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment