యువకుడి వేధింపులకు విద్యార్థిని బలి  | Young Man Harassment Girl Suicide Attempt Mahabubnagar | Sakshi
Sakshi News home page

యువకుడి వేధింపులకు విద్యార్థిని బలి 

Published Thu, Feb 21 2019 7:30 AM | Last Updated on Thu, Feb 21 2019 7:30 AM

Young Man Harassment Girl Suicide Attempt Mahabubnagar - Sakshi

సౌందర్య (ఫైల్‌)

మాగనూర్‌ (మక్తల్‌): ప్రేమ పేరుతో వేధింపులకు ఓ విద్యార్థిని బలైంది. ఈ సంఘటన మాగనూరు మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మాగనూర్‌కు చెందిన సౌందర్య(20) హైదరాబాద్‌లో ఉంటూ డిగ్రీ చదువుతుంది.ఈ క్రమంలో మంగళవారం స్వగ్రామానికి వచ్చింది. అయితే మక్తల్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు విద్యార్థినిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తూ.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే బుధవారం యువకుడు ఏకంగా తన తల్లితోపాటు యువతి ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. యువతిని తనకు ఇచ్చి పెళ్లి చేయాలని కోరాడు. అయితే తాను ప్రేమించకున్నా ఇంటికి రావడాన్ని తట్టుకోలేని యువతి అవమానభారంతో ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయమై ఏఎస్‌ఐ మహిభూషన్‌రెడ్డిని వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. అయితే రాత్రి 8 గంటల సమయంలో సీఐ వెంకట్‌ అక్కడికి చేరుకొని విద్యార్థిని కుటుంబ సభ్యులతో వివరాలు తెలుసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement